E-Paper
Advertisement

South Central Railway: భానుడి బీభత్సం.. ప్రయాణికుల భద్రత కోసం.. దక్షిణ మధ్య రైల్వే కీలక ఆదేశాలు

South Central Railway: భానుడి బీభత్సం.. ప్రయాణికుల భద్రత కోసం.. దక్షిణ మధ్య రైల్వే కీలక ఆదేశాలు
Advertisement

South Central Railway: అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొని రైళ్ల కదలికలు సజావుగా సాగేలా ట్రాక్‌లను బలోపేతం చేయాలని అధికారులకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సూచించారు. అవసరమైన చోట ట్రాక్‌లపై క్రమం తప్పకుండా భద్రతా తనిఖీలు చేపట్టాలని సూచించారు. బ్యాలస్ట్ ఫిల్లింగ్ ఉండేలా చూసుకోవాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత నేపథ్యంతో రైల్వే భద్రతా చర్యలపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల భద్రతపై సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో వివరణాత్మక సమావేశం నిర్వహించారు. రాబోయే వేసవి కాలం దృష్ట్యా జోన్ చేపడుతున్న జాగ్రత్తలను సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీవాస్తవ మాట్లాడుతూ వేసవిలో రైళ్లలో ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా జోన్ నిర్వహిస్తున్న అగ్నిమాపక భద్రతా డ్రైవ్‌ను కూడా సమీక్షించారు.

Advertisement

Also Read: Vi Annual Plans 2026: వీఐ వార్షిక ప్లాన్స్.. రోజుకి 2GB డేటా, ఫ్రీ ఓటీటీ.. ఇవి చాలా చీప్ గురు!

నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాలలో భద్రతా మార్గదర్శకాలు, జాగ్రత్తలను పాటించాలని నొక్కి చెప్పారు. పనులు పూర్తయిన తర్వాత పని ప్రదేశాలలో ఎటువంటి నిర్మాణ సామగ్రి మిగిలి ఉండకుండా చూసుకోవడానికి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. జనరల్ మేనేజర్ ప్రైవేట్ సైడింగ్‌లు, గూడ్స్ షెడ్‌ల వద్ద సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై కూడా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాష్, ప్రధాన విభాగాధిపతులతో పాటు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Women’s Day Celebrations: లండన్ అట్టహాసంగా మహిళా దినోత్సవ వేడుకలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగు మహిళలు!

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×