E-Paper
Advertisement

వైజాగ్ నుంచి సమ్మర్ స్పెషల్ రైళ్లు, ఎప్పటి నుంచి నడుస్తాయంటే?

వైజాగ్ నుంచి సమ్మర్ స్పెషల్ రైళ్లు, ఎప్పటి నుంచి నడుస్తాయంటే?
Advertisement

Indian Railways  Summer Special Trains: వేసవి సెలవులు దగ్గర పడుతున్న నేపథ్యంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతుంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏప్రిల్, మే నెలల్లో ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఈ స్పెషల్ ట్రైన్లు నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా విశాఖపట్నం, భువనేశ్వర్ లాంటి నగరాలకు వెళ్లే ప్యాసింజర్స్ కు ఈ రైళ్లు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించనున్నాయి.

⦿విశాఖపట్నం–శాలిమార్ మధ్య నడిచే వీక్లీ స్పెషల్ రైలు (08508/08507)..  ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు ప్రతి మంగళవారం ఉదయం 11:20 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 3:00 గంటలకు శాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఏప్రిల్ 8 నుంచి జూలై 1 వరకు ప్రతి బుధవారం ఉదయం 5:00 గంటలకు శాలిమార్ నుంచి బయలుదేరి, అదే రోజు రాత్రి 8:50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది.

Advertisement

⦿ భువనేశ్వర్–యశ్వంత్‌ పూర్ మధ్య కూడా వీక్లీ స్పెషల్ రైలు నడుస్తుంది. ఇది ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు ప్రతి శనివారం సాయంత్రం 7:15 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరి, అర్ధరాత్రి 12:15 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఏప్రిల్ 6 నుంచి జూన్ 29 వరకు ప్రతి సోమవారం ఉదయం 4:30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6:00 గంటలకు భువనేశ్వర్ చేరుతుంది. మొత్తం ఈ సర్వీసులు 13 ట్రిప్పులను అందిస్తుంది.

⦿ సంబల్‌ పూర్–ఈరోడ్ మధ్య నడిచే ప్రత్యేక రైలు (08311/08312) కూడా అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఏప్రిల్ 1 నుంచి మే 27 వరకు ప్రతి బుధవారం ఉదయం 11:35 గంటలకు సంబల్‌పూర్ నుంచి బయలుదేరి, గురువారం రాత్రి 10:50 గంటలకు ఈరోడ్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు బయలుదేరి, శనివారం రాత్రి 11:15 గంటలకు సంబల్‌పూర్ చేరుతుంది. మొత్తం తొమ్మిది ట్రిప్పులు వేస్తుంది.

Advertisement

⦿ యశ్వంత్‌ పూర్–కతిహార్ మధ్య కూడా ఒక ప్రత్యేక రైలు (06571) నడుస్తుంది. ఇది ఏప్రిల్ 7 నుంచి జూలై 14 వరకు ప్రతి మంగళవారం ఉదయం 7:00 గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5:00 గంటలకు విజయనగరం చేరుతుంది. అక్కడి నుంచి కతిహార్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఏప్రిల్ 10 నుంచి జూలై 17 వరకు ప్రతి శుక్రవారం బయలుదేరి, ఆదివారం ఉదయం యశ్వంత్‌పూర్ చేరుతుంది. ఈ రైలు మొత్తం 15 ట్రిప్పులు నడుస్తుంది.

సమ్మర్ ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా..

ఈ ప్రత్యేక రైళ్లు వేసవిలో పెరిగే రద్దీని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ముందుగానే షెడ్యూల్ తెలుసుకుని టికెట్లు బుక్ చేసుకుంటే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు సూచించారు. ముఖ్యంగా విశాఖపట్నం, భువనేశ్వర్ ప్రాంతాల నుంచి ప్రయాణించే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

Read Also: ఆ స్పెషల్ రైళ్లు ఇక రెగ్యులర్ సర్వీసులు.. కాకినాడ ప్రజలకు రైల్వే గుడ్ న్యూస్!

Related News

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

Big Stories

Advertisement
×