BigTV English

Costly Train Ticket: ఈ రైలు టికెట్ ధర రూ.39 లక్షలు మాత్రమే.. ఎక్కడో కాదు ఇండియాలోనే!

Costly Train Ticket: ఈ రైలు టికెట్ ధర రూ.39 లక్షలు మాత్రమే.. ఎక్కడో కాదు ఇండియాలోనే!

రైల్వే టికెట్ అంటే 500 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు ఉంటుందని అనుకుంటాం. ఎందుకంటే వందే భారత్ ట్రైన్ వచ్చాక అదే ఖరీదైన టికెట్ అని ఎంతోమంది అనుకున్నారు. కానీ ఏకంగా 39 లక్షల రూపాయల ధర పలికే ఖరీదైన రైల్వే టికెట్ కూడా ఉంది. అది ఇతర దేశాల్లో కాదు మన దేశానికి చెందినదే. ఈ రైలు టికెట్ ధర అక్షరాల 39 లక్షల రూపాయలు. కొన్ని భారతీయ రైళ్లలో సగటు వ్యక్తి ఊహించలేనంత ఎక్కువగా టికెట్ ధరలు ఉంటాయని చెప్పుకోవడానికి ఇదే పెద్ద ఉదాహరణ.


ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలు
అత్యంత ఖరీదైన రైల్వే టికెట్ గున్న ట్రైన్ ఏదో తెలుసుకోవాలని ఉందా? అదే ప్యాలెస్ ఆన్ వీల్స్. దీనిలో అత్యంత విలాసవంతమైన ప్రయాణాన్ని అనుభూతి చెందవచ్చు. ప్యాకేజీ ధరలు 12 లక్షల రూపాయల నుండి 39 లక్షల రూపాయల వరకు ఉంటాయి. ఏడు పగళ్లు, ఎనిమిది రాత్రులు ఈ ట్రైన్ లోనే విలాసవంతంగా గడపవచ్చు. మీరు ఎంచుకునే క్యాబిన్ రకాన్ని బట్టి ధర ఆధారపడి ఉంటుంది. డబుల్ ఆక్యుపెన్సీ, డీలక్స్, సూపర్ డీలక్స్, రెసిడెన్షియల్ సూట్ ఇలా మూడు రకాల క్యాబిన్లు ఉంటాయి. మీరు ఎంచుకునే రకాన్ని బట్టి మీరు ఖర్చు చేయాల్సిన డబ్బు ఆధారపడి ఉంటుంది. అది తక్కువగా 12 లక్షల రూపాయలు… అత్యంత ఎక్కువగా 39 లక్ష రూపాయలు వరకు ఖర్చు అవుతుంది.

ప్రయాణం ఎక్కడ నుంచి ఎక్కడికి?
ఈ ప్రయాణం ఢిల్లీలో ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి రాజస్థాన్లోని అనేక ప్రధాన నగరాల గుండా సాగుతుంది. తర్వాత తిరిగి ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ రైలు ప్రయాణంలో మీరు జైపూర్, సవాయి మాధవపూర్, చిత్థోర్ ఘడ్, ఉదయపూర్, జై సల్మేర్, జోధ్ పూర్, భారల్ పూర్, ఆగ్రా వంటివి ఉన్నాయి. రాజస్థాన్లోని సంస్కృతి, వారసత్వ సంపదను, రాజచరిత్రను ఆస్వాదించడానికి ఈ రైలు ఉత్తమ ప్రయాణంగా చెప్పుకోవచ్చు.


ఏమిటీ ప్రత్యేకత?
ఈ రైలు ప్రయాణం ఎందుకింత ఖరీదు అనే సందేహం రావచ్చు. ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలు మొత్తం ఎయిర్ కండిషన్ క్యాబిన్లను కలిగి ఉంటుంది. అలాగే బాత్రూంలు కూడా అద్దాల్లా మెరిసిపోతాయి. చక్కటి డైనింగ్ ఉండే రెస్టారెంట్లు రెండు ఉంటాయి. అంతేకాదు స్పా కూడా ఉంటుంది. ఆల్కహాల్ ప్రియుల కోసం లాంజ్ బార్ కూడా రెడీగా ఉంటుంది. ఈ ట్రైన్ ఎక్కితే ఒక పెద్ద ప్యాలెస్ లోకి అడుగుపెట్టిన ఫీలింగ్ వస్తుంది. ప్రయాణికులు మహారాజుల్లా రాయల్టీగా ప్రయాణించే అనుభూతిని అందిస్తుంది. మన దేశంలో మొట్టమొదటి లగ్జరీ టూరిస్ట్ రైలు ఇదే.

ప్యాలెస్ ఆన్ వీల్స్ ప్రయాణం ఈనాటిది కాదు. భారత రైల్వే, రాజస్థాన్ పర్యాటక అభివృద్ధి సంస్థ కలిసి 1982 జనవరి 26న ప్రారంభించారు. అప్పటినుంచి ఇది తన ప్రయాణాన్ని సాగిస్తూనే ఉంది. ఉన్నత స్థాయి ధనికులు ఈ ప్రయాణాన్ని ఎక్కువగా కోరుకుంటారు. అలాగే రాచరిక అనుభవాన్ని పొందాలని కోరుకునే వారు కూడా ఈ ప్రయాణాన్ని చేస్తూ ఉంటారు. ముఖ్యంగా విదేశీ పర్యాటకులు అధికంగా ఈ ట్రైన్ లో ప్రయాణిస్తారు.

ఇక ధరల కోణంలో చూస్తే ఈ రైలులో కేవలం ఒక్క రాత్రి గడపడానికి లక్ష ఎనభైవేల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. ఆ డబ్బుతో ఏడాది మొత్తం జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ దీన్ని భరించగలిగే కోటీశ్వరులు ఎంతో మంది ఉన్నారు. వారు భిన్నమైన, సంతోషకరమైన ప్రయాణాన్ని ఎంచుకునేందుకు ప్యాలెస్ ఆన్ వీల్స్ ను బుక్ చేసుకుంటారు.

ఇందులో రెండు డైనింగ్ సూట్ లు ఉంటాయి. ఆ డైనింగ్ కోట్ లకు ‘ది మహారాజా’, ‘ది మహారాణి’ అనే పేర్లను పెట్టారు. ఇందులో కేవలం భారతీయ ఆహారమే కాదు అనేక రకాల విదేశీ వంటకాలు కూడా లభిస్తాయి. చైనీస్ వంటకాలను కూడా ఇదే అందిస్తుంది. ప్రతి క్యాబిన్లోనూ ప్రైవేటు బాత్రూంలు, వైఫై, మ్యూజిక్ ఛానల్, మెత్తటి కార్పెట్లు, మినీ ప్యాంట్రీ వంటివి ఉన్నాయి.

ఎంతమందికి ప్రయాణం?
ఈ ట్రైన్ లో ఒకేసారి 104 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. 14 సెలూన్లు కూడా ఈ ట్రైన్ లో ఏర్పాటు చేశారు. ట్రైన్ లో బుకింగ్ కోసం మీరు ఆన్లైన్లో ట్రై చేయవచ్చు. లేదా ట్రావెల్ ఏజెంట్ల ద్వారా కూడా చేసుకోవచ్చు. ఢిల్లీలోనే సఫ్టార్ జంగ్ రైల్వే స్టేషన్ నుండి ఇది బయలుదేరుతుంది. ఈ రైలు సాధారణంగా సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ మధ్య ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంది.

ప్యాలెస్ ఆన్ వీల్స్ వెబ్ సైట్ లోకి వెళితే మీరు అక్కడ ప్రయాణాన్ని ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ప్యాలెస్ ఆన్ వీల్స్ వెబ్ సైట్లో సూచిస్తున్న ప్రకారం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 29 వరకు ఈ రైలు ప్రయాణం ఆఫర్లు కనిపిస్తున్నాయి. మొత్తం ఈ ప్రయాణంలో మీరు 2,411 కిలోమీటర్లను తిరిగి వస్తారు.

ఈ రైలులో అన్నిటికంటే ఖరీదైనది ప్రెసిడెన్షియల్ సూట్. ఇక అతి చవకది డబుల్ ఆక్యుపెన్సి. దీన్ని బుక్ చేసుకోవాలంటే మీరు ఆరు లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. సీజన్ ను బట్టి ఈ ధర మారుతూ కూడా ఉంటుంది. ఈ ధరలతో పాటు జీఎస్టీ ను కూడా పే చేయాలి. అలాగే 10 శాతం ఎడిషనల్ ఛార్జ్ కూడా ఉంటుంది. మొత్తం మీద లక్షల్లో ఖర్చు పెట్టగలిగితేనే మీరు ఈ బ్యాలెన్స్ వీల్స్ పై ప్రయాణం చేయగలరు.

Related News

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Watch Video: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..

UP Man: ఒక రైలు ఎక్కబోయి.. మరో రైలు ఎక్కాడు.. చివరి ప్రాణాలు కోల్పోయాడు!

Woman Train Driver: తొలి లేడీ లోకో పైలెట్ సురేఖ పదవీ విరమణ, ఘన వీడ్కోలు పలికి సిబ్బంది!

Big Stories

×