MLC Kavitha: తెలంగాణలో ఆర్టీసీ బస్సు పాస్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడికి దిగారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ను ముట్టడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
వెంటనే పెంచిన బస్సు పాస్ ధరలను ఉపసంహరించుకోవాలని కవిత డిమాండ్ చేశారు. బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపిందని అన్నారు. విద్యార్థులు, చిరుద్యోగులపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుందని ఆమె మండిపడ్డారు. బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై గుదిబండను మోపారని అన్నారు. ఈ పెంపుతో ఒక్క ప్రయాణికుడిపై నెలకు దాదాపు రూ.300 పైగా భారం పడుతుందని చెప్పారు. అనేక రూట్లల్లో విద్యార్థుల కోసం బస్సులు నడపడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఆమె ఆరోపించారు. ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటుపడిందని ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు.
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష, యాస అంటే అవహేళనగా చూసేవాళ్లు. కానీ ఇప్పుడు తెలంగాణ యాస లేకపోతే సినిమా హిట్ అవ్వట్లేదు. ఇప్పుడున్న CM కనీసం జై తెలంగాణ అన్న నినాదం చెయ్యలేకపోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ గురించి మన భాష, యాస గురించి ప్రపంచానికి తెలియజేశారు. రానున్న రోజుల్లో బోనాల పండగ సందర్భంగా ప్రతి బోనం మీద జై తెలంగాణ నినాదాన్ని రాయాలి. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనే బదులు జై తెలంగాణ అనాలి. తెలంగాణ జాగృతి, తెలంగాణ లో జరిగే అన్ని అన్ని ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతుంది. RTC టికెట్స్ ధరల పెంపు సాధారణ ప్రజల మీద మరింత భారం పడే విధంగా ఉంది. దీన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి’ అని అమె చెప్పారు.
ALSO READ: Telangana : భట్టికి హోం? వివేక్‌కు పవర్‌ఫుల్ పోస్ట్! మార్పు మంచికే!
పెంచిన ఆర్టీసీ ఛార్జీల విషయంపై ప్రభుత్వం పున: పరిశీలించాలని కవిత డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరించారు. కవిత అరెస్ట్ ను తెలంగాణ జాగృతి శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు.