Rowdy Janardhan : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్ లో విజయ్ దేవరకొండ ఒకరు. విజయ్ దేవరకొండ చాలామందికి ఇన్స్పిరేషన్. ముందుగా చిన్న చిన్న సినిమాల్లో కొన్ని పాత్రలో కనిపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రిషి అనే పాత్రతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ సినిమాలో విజయ్ పాత్ర చాలామంది ను విపరీతంగా ఆకట్టుకుంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు సినిమా విజయ్ కెరీర్ కి మంచి ప్లేస్ అయింది. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదు. ఇప్పటికీ విజయ్ దేవరకొండ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే దానికి కారణం అర్జున్ రెడ్డి సినిమా. వరుస డిజాస్టర్ సినిమాలు వచ్చినా కూడా విజయ్ కు అదే క్రేజ్ ఉంది.
క్రేజీ డైరెక్టర్స్ తో లైనప్
గీత గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండకు ప్రాపర్ హిట్ సినిమా పడలేదు. టాక్సీవాలా సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించిన కూడా అది పెద్దగా బయటకు రాలేదు. ఆ తర్వాత చేసిన వరుస సినిమాలన్నీ కూడా విజయ్ కెరీర్ కి మైనస్ అయిపోయాయి. ఇక ప్రస్తుతం విజయ్ లైనప్ లో పెట్టిన డైరెక్టర్లు మాత్రం మంచి సక్సెస్ కొట్టే కసితో ఉన్నారు. గౌతమ్ దర్శకత్వంలో కింగ్డమ్ సినిమా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. రాహుల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. వీటన్నిటిని మించి రాజా గారు రాణి గారు సినిమాతో దర్శకుడుగా మంచి పేరు సాధించుకున్న రవికిరణ్ కోలా దర్శకత్వంలో రాబోతున్న రౌడీ జనార్ధన్ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
రౌడీ జనార్ధన్ కాన్సెప్ట్ ఇదే
రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా రౌడీ జనార్ధన్. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఒక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో జరగనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో పాటు ఈ సినిమాలో ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ ఉంటుందట. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోహిన్ గా నటించనుంది. ప్రస్తుతం కింగ్డమ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నాడు విజయ్. ఇదివరకే విజయ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చేసిన నోట సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ చూసింది. మరి ఈసారి పొలిటికల్ డ్రామాను రవికిరణ్ కోలా ఎలా డిజైన్ చేశాడు తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
Also Read: Kingdom release date : కింగ్డమ్ రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ ఫిక్స్, త్వరలోనే అధికారిక ప్రకటన