E-Paper
Advertisement

కారులో సిగరెట్ తాగిన ప్రయాణికుడు.. డ్రైవర్ చేసిన పనికి నెటిజెన్స్ ఫిదా!

కారులో సిగరెట్ తాగిన ప్రయాణికుడు.. డ్రైవర్ చేసిన పనికి నెటిజెన్స్ ఫిదా!
Advertisement

Cab Driver vs Smoking Passenger: ఈ రోజుల్లో చాలా మంది క్యాబ్ బుక్ చేసుకుని గమ్యస్థానాలకు చేరుకుంటారు. అయితే, తాజాగా ఒక క్యాబ్ డ్రైవర్ తీసుకున్న నిర్ణయం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. టాక్సీలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి డ్రైవర్ అనుమతి లేకుండా సిగరెట్ వెలిగించడంతో, డ్రైవర్ వెంటనే రైడ్‌ ను క్యాన్సిల్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఒక ప్రయాణికుడు టాక్సీలో కూర్చుని నిర్లక్ష్యంగా సిగరెట్ తాగడం కనిపిస్తుంది. అతడిని గమనించిన డ్రైవర్ వెంటనే అభ్యంతరం వ్యక్తం చేశాడు. పర్మీషన్ లేకుండా ఎలా సిగరెట్ తాగుతున్నారని అడుగుతాడు. తన కారులో స్మోకింగ్ చేయడం కుదరదని తెగేసి చెప్తాడు.

అయితే, ప్రయాణికుడు మాత్రం తాను టాక్సీలో ఉన్నానని, సిగరెట్ తాగడానికి ప్రత్యేకంగా అనుమతి అవసరం లేదని వాదించాడు. ఆ సమాధానం డ్రైవర్‌కు నచ్చలేదు. వెంటనే రైడ్‌ ను క్యాన్సిల్ చేస్తూ, మీ డబ్బు నాకు అవసరం లేదు. దయచేసి నా కారులోంచి దిగండన్నాడు. అంతేకాదు, తానో టాక్సీ డ్రైవర్‌ ను అని.. మీ సర్వెంట్ ను కాదనిగట్టిగా బదులిచ్చాడు.

క్యాబ్ డ్రైవర్ కు నెటిజన్ల సపోర్టు

Advertisement

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వేలాది మంది డ్రైవర్‌ కు సపోర్టు చేస్తున్నారు. కారు బుక్ చేసుకున్నంత మాత్రాన అది పూర్తిగా ప్రయాణికుడి సొంతం కాదని, డ్రైవర్‌ కు కూడా కొన్ని నియమాలు, హక్కులు ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు. డ్రైవర్ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ వ్యవహరించిన తీరును అభినందిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం మరోలా కామెంట్ చేస్తున్నారు. ప్రయాణికుడిని కారు దిగమని చెప్పి, సిగరెట్ పూర్తి చేసిన తర్వాత తిరిగి ఎక్కించవచ్చంటున్నారు. కానీ, మరికొందరు మాత్రం ప్రయాణికుడి ప్రవర్తన చూసిన తర్వాత డ్రైవర్ తీసుకున్న నిర్ణయమే సరైందని అంటున్నారు.

ట్యాక్సీ డ్రైవర్లను గౌరవించాలంటున్న నెటిజన్లు

Advertisement

స్మోకింగ్ వల్ల డ్రైవర్‌ కే కాదు, తర్వాత ఆ క్యాబ్‌ లో ప్రయాణించే వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. సిగరెట్ వాసన చాలా సేపు కారులోనే ఉండిపోతుంది. అందుకే ఇలాంటి విషయాల్లో ప్రయాణికులు మర్యాదగా ప్రవర్తించాలని చాలామంది సూచిస్తున్నారు.  టాక్సీ డ్రైవర్లు మంచి సర్వీసు అందించాల్సిన బాధ్యత ఉన్నట్లే, ప్రయాణికులు కూడా వారిని గౌరవించడం అవసరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. క్యాబ్‌ లో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ నియమాలను పాటించడం, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండటం ప్రతి ప్రయాణికుడి బాధ్యత అని ఈ వైరల్ వీడియో మరోసారి గుర్తు చేస్తుంది.

Read Also: రైలులో ఫస్ట్ నైట్.. ఫస్ట్ ఏసీ క్లాసులో బెడ్, అబ్బో ఏం సెట్ చేశారయ్యా!

Related News

ఎయిర్‌పోర్ట్‌కు నరేంద్ర మోడీ పేరు..ఉత్తరప్రదేశ్ కేబినెట్ సంచలన నిర్ణయం!

రేపు 10 గంటలపాటు రైళ్లు బంద్, 57 మెట్రో స్టేషన్లు మూసివేత!

భయంకర పాము ఆకారంలో గుహ.. ఎక్కడుందో తెలుసా?

దసరా, దీపావళికి ఊరెళ్తున్నారా? తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు, ఎప్పటి నుంచంటే?

బస్ డిపోకు వెళ్లాల్సిన పనిలేదు.. మీ కాలనీ నుంచే దసరా స్పెషల్ బస్సులు!

150 ఏళ్ల చరిత్ర ఉన్న నాంపల్లి స్టేషన్ గురించి మీకు తెలుసా?

కొమ్మల్లో సొమ్ము.. లక్కతో లక్.. చెట్లపై పెరిగే ఈ పురుగులతో బోలెడు ఆదాయం!

భారత్‌లో అత్యంత అందమైన రోడ్లు ఇవే.. ఒక్కసారి జర్నీ చేస్తే మళ్లీ వెళ్లాలనిపిస్తుంది!

Big Stories

Advertisement
×