E-Paper
Advertisement

వీకెండ్‌లో విదేశీ ట్రిప్.. కేవలం 2 రోజుల్లో చూసేయగల అతి చిన్న దేశాలు

వీకెండ్‌లో విదేశీ ట్రిప్.. కేవలం 2 రోజుల్లో చూసేయగల అతి చిన్న దేశాలు
Advertisement

ప్రపంచాన్ని చుట్టి రావాలంటే చాలా రోజుల సమయం పడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ కొన్ని దేశాలు చాలా చిన్నవిగా ఉండటంతో వాటిని కేవలం ఒక వీకెండ్‌లోనే పూర్తిగా సందర్శించవచ్చు. ఈ దేశాలు భౌగోళికంగా సైజులో చిన్నవైనా చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అందాలు, పర్యాటక ఆకర్షణలతో టూరిస్టులను ఆకట్టుకుంటాయి. తక్కువ సమయంలో మంచి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి ఇవి అద్భుతమైన ఎంపికలు.

వాటికన్ సిటీ

వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. దీని విస్తీర్ణం కేవలం 0.49 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అయినప్పటికీ ఇది ప్రపంచంలోనే ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందింది. సెయింట్ పీటర్స్ బసిలికా, వాటికన్ మ్యూజియంలు, సిస్టిన్ చాపెల్ వంటి ప్రదేశాలను ఒకే రోజులో చూడవచ్చు. క్రైస్తవుల మతగురువు పోప్ కూడా ఇక్కడే ఉంటారు.

మొనాకో

Advertisement

ఫ్రెంచ్ రివేరాలో ఉన్న మొనాకో లగర్జీ జీవనశైలికి ఫేమస్. ఇక్కడ మాంటే కార్లో క్యాసినో, ప్రిన్స్ ప్యాలెస్, పోర్ట్ హెర్క్యులెస్ వంటి ఆకర్షణీయమైన ప్రదేశాలు ఉన్నాయి.
మెడిటరేనియన్ సముద్ర తీర అందాలను ఆస్వాదిస్తూ ఈ దేశాన్ని కాలినడకన సులభంగా సందర్శించవచ్చు.

నౌరూ

నౌరూ ప్రపంచంలో చాలా తక్కువ మంది టూరిస్టులు వచ్చే దేశాల్లో ఒకటి. ఈ చిన్న ఐలాండ్ (దీవి) దేశాన్ని కారులో గంటలోపే చుట్టేయవచ్చు. ప్రశాంతమైన బీచ్‌లు, స్థానిక సంస్కృతి, సహజ అందాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

శాన్ మారినో

Advertisement

శాన్ మారినో ఇటలీ మధ్యలో ఉన్న చిన్న దేశం. ఇది ప్రపంచంలోని అత్యంత పురాతన రిపబ్లికన్ దేశాల్లో ఒకటి. మధ్యయుగ కాలం నాటి వీధులు, ప్రసిద్ధ త్రీ టవర్స్, మ్యూజియంలు, కొండ ప్రాంతాల అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

లిచ్టెన్‌స్టైన్

స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్యలో ఉన్న లిచ్టెన్‌స్టైన్ ప్రకృతి ప్రేమికులకు ఎంతో నచ్చుతుంది. రాజధాని వాడుజ్, వాడుజ్ కోట, పర్వత మార్గాలు, మ్యూజియంలు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. ప్రకృతి అందాలు, సాంస్కృతిక వారసత్వం రెండింటినీ ఒకే ట్రిప్‌లో ఆస్వాదించవచ్చు.

మాల్టా

మధ్యధరా సముద్రంలో (మెడిటెర్రనియన్ సీ) ఉన్న మాల్టా దేశం.. చారిత్రక కట్టడాలు, అందమైన బీచ్‌లకు ఫేమస్. వాలెట్టా నగరంలోని పురాతన వీధులు, దేవాలయాలు, సముద్ర తీర ప్రాంతాలు తప్పక చూడాల్సినవి. చిన్న దేశం కావడంతో అన్ని ప్రదేశాలకు తక్కువ సమయంలో చేరుకోవచ్చు.

అండోరా

ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల మధ్య పైరెనీస్ పర్వతాల్లో అండోరా దేశం ఉంది. ఇక్కడ పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేయవచ్చు. థర్మల్ స్పాలను ఆస్వాదించవచ్చు. అండోరాలోని లా వెల్లా నగరంలో షాపింగ్, స్థానిక వంటకాలను కూడా ఆస్వాదించవచ్చు.

Also Read: మంచు కొండలు, ప్రశాంత నదులు, ప్రాచీన దేవాలయాలు.. ఫ్యామిలీ టూర్ కోసం నేపాల్‌ పర్ఫెక్ట్ డెస్టినేషన్

లక్సెంబర్గ్

లక్సెంబర్గ్.. ఇతర చిన్న దేశాల కంటే కొంచెం పెద్దదైనా, రెండు రోజుల్లో సులభంగా సందర్శించవచ్చు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్న ఓల్డ్ టౌన్, కోటలు, వంతెనలు, చారిత్రక కట్టడాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. రైలు లేదా కారులో ఇక్కడి అన్ని ముఖ్య ప్రదేశాలను సులభంగా చేరుకోవచ్చు.

ఈ చిన్న దేశాలు కూడా మంచి పర్యాటక ప్రాంతాలు. తక్కువ సమయంలో ఇక్కడి చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అందాలు, స్థానిక జీవనశైలిని ఆస్వాదించాలనుకునే వారికి ఈ దేశాలు అద్భుతమైన ట్రావెల్ డెస్టినేషన్స్. ఒక వీకెండ్ ట్రిప్‌తోనే మరపురాని జ్ఞాపకాలను సొంతం చేసుకోవచ్చు.

Related News

భగవాన్ పాండురంగ భక్తుల పండుగ.. పండర్‌పూర్ వారి 2026.. మహారాష్ట్రలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక యాత్ర

కారులో సిగరెట్ తాగిన ప్రయాణికుడు.. డ్రైవర్ చేసిన పనికి నెటిజెన్స్ ఫిదా!

రైలులో ఫస్ట్ నైట్.. ఫస్ట్ ఏసీ క్లాసులో బెడ్, అబ్బో ఏం సెట్ చేశారయ్యా!

రైలు ఆపి సమోసాలు కొన్న లోకో పైలెట్.. సోషల్ మీడియాలో వైరల్.. అసలు మ్యాటర్ చెప్పిన రైల్వే!

విజయవాడ రైల్వే సూపర్ పెర్ఫార్మెన్స్.. రద్దీలోనూ అద్భుతం!

పట్టాలెక్కబోతున్న ఫస్ట్ ఇండియన్ హైడ్రోజన్ ట్రైన్.. టికెట్ ధర జస్ట్ 5 రూపాయలే!

షాకింగ్.. ఒకే రన్‌వేపై ఎదురెదురుగా 2 విమానాలు.. తృటిలో తప్పిన పెనుముప్పు!

Big Stories

Advertisement
×