E-Paper
Advertisement

రూ.700 టికెట్‌ రూ.380కే ఇస్తానన్న టీటీఈ.. సోషల్ మీడియాలో దుమారం!

రూ.700 టికెట్‌ రూ.380కే ఇస్తానన్న టీటీఈ.. సోషల్ మీడియాలో దుమారం!
Advertisement

Vande Bharat Ticket Controversy: వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ లో టీటీఈలు టిక్కెట్లను అడ్డగోలుగా అమ్ముకుంటున్నారే విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి వ్యవహారానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారతీయ రైల్వేలో మరోసారి చర్చ మొదలైంది. ఓ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్‌ ప్రయాణికుడికి తక్కువ ధరకు టికెట్ ఏర్పాటు చేస్తానంటూ మాట్లాడినట్లు వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన అధికారులు, విచారణ ప్రారంభించడంతో పాటు సంబంధిత టీటీఈను సస్పెండ్ చేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

సోషల్ మీడియాలో ఘర్ కే కలేష్  అనే ఎక్స్ అకౌంట్ లో ఖాతాలో ఈ వీడియో మొదటగా షేర్ అయింది. ఈ వీడియోలో రైలు కోచ్ లోపల ఓ ప్రయాణికుడు, టీటీఈ మధ్య డిస్కర్షన్ జరిగినట్లు కనిపిస్తుంది. మరో ప్రయాణికుడు ఈ ఘటనకు సంబంధించి వీడియో తీశారు. ఇందులో టీటీఈ టికెట్ గురించి చెప్పుకొచ్చాడు. ఆ వీడియోలో.. సాధారణంగా అదే ప్రయాణానికి దాదాపు రూ.700 వరకు ఖర్చవుతుందని, కానీ.. రూ.380కే టికెట్ అందిస్తానని టీటీఈ చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, ఆ టికెట్ అధికారిక బుకింగ్ ద్వారా వస్తుందా? లేదా? అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. ప్రయాణికుడు టీటీఈని టికెట్ గురించి అడగ్గా.. బెర్త్ దగ్గర నిలబడి ధరల మధ్య తేడా గురించి వివరించే ప్రయత్నం చేసినట్లు వీడియోలో కనిపించింది. అయితే, మొత్తం సంభాషణ రాకపోవడంతో చివరికి టీటీఈ ఏం చెప్పాడనేది తెలియలేదు. ఈ వీడియోను సదరు ప్రయాణికుడు సోషల్ మీడియాలో షేర్ చేయండంతో కాసేపట్లోనే వైరల్ అయ్యింది.\

Advertisement

టీటీఈపై రైల్వే చర్యలు

ఈ వీడియోను చూసి  రైల్వే అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై అధికారికంగా స్పందించిన రైల్వే సేవా, దానాపూర్ డివిజన్ రైల్వే మేనేజర్ కార్యాలయం, సంబంధిత టీటీఈపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రయాణికుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఎలాంటి వ్యవహారాన్నీ ఉపేక్షించబోమని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై అలాగే పూర్తి స్థాయి విచారణ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని ప్రకటించారు.

నెటిజన్లు ఏమంటున్నారంటే?

Advertisement

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.  కొంతమంది నెటిజన్లు టీటీఈ ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి టీటీఈలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు టికెట్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని తగ్గిస్తాయన్నారు. మరోవైపు కొంతమంది మాత్రం ఈ ఘటనపై పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. సాధారణంగా ఎక్కువ డబ్బులు వసూలు చేసే ఘటనలు చూస్తుంటామని, కానీ ఈ టీటీఈ ప్రయాణికుడికి తక్కువ ధరలో సీటు ఇప్పించేందుకు ప్రయత్నించి ఉండవచ్చంటున్నారు. మొత్తంగా  ఈ ఘటన రైల్వే టికెటింగ్ విధానంపై మరోసారి చర్చకు కారణం అయ్యింది. ముఖ్యంగా రైళ్లలో టిక్కెట్ల జారీ, ఆన్‌ బోర్డ్ బుకింగ్ విధానం, టీటీఈ అధికారాలపై నెటిజన్లు చర్చిస్తున్నారు.

Read Also: 320 కి.మీ వేగంతో బుల్లెట్ రైలు పరుగులు.. ట్రాక్‌ ల నిర్మాణంలో జపాన్ సీక్రెట్ టెక్నాలజీ వినియోగం!

Related News

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?

అర్ధరాత్రి కూడా భానుడి ప్రతాపమే.. భూమిపై సూర్యుడు అస్తమించని ఆ 5 వింత ప్రదేశాలేవో తెలుసా?

మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

భూమిపై 5 ప్రమాదకర పర్యాటక ప్రాంతాలు.. ఇక్కడికి వెళ్లడం ప్రాణాలతో చెలగాటం.. అయినా వెళుతున్న టూరిస్ట్స్

Big Stories

Advertisement
×