E-Paper
Advertisement

DNA Paternity Tests: పెళ్లి ఒకరితో.. ‘సంతానం’ మరొకరితో.. ఉగాండాలో కూలుతోన్న వందలాది కాపురాలు!

DNA Paternity Tests: పెళ్లి ఒకరితో.. ‘సంతానం’ మరొకరితో.. ఉగాండాలో కూలుతోన్న వందలాది కాపురాలు!
Advertisement

ఉగాండా దేశం ప్రస్తుతం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటుంది. ముఖ్యంగా డీఎన్ఏ పరీక్షల ఎన్నో కాపురాలు కూలే పరిస్థితి నెలకొంది. పితృత్వ టెస్టులు, ఇటీవలి సంవత్సరాల్లో భారీ వివాదానికి కారణమయ్యాయి. 2023 నుంచి ఆ దేశంలో ఈ టెస్టుల డిమాండ్ 10 రెట్లు పెరిగింది. కుటుంబాలు, మతాలు, సాంస్కృతిక విలువల మధ్య తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబ్‌ లో రోజుకు 10 అప్లికేషన్ల నుంచి 100కి పైగా చేరాయి. వీటిలో 95% అప్లికేషన్లు పురుషుల నుంచి వస్తున్నప్పటికీ.. 98% కేసుల్లో వారు బయోలాజికల్ ఫాదర్లు కారని తేలుతోంది. ఫలితంగా ఎన్నో కుటుంబాల్లో ఊహించని వివాదాలు నెలకొన్నాయి.

పెళ్లి ఒకరితో.. సతానం మరొకరితో..

ఉండాగాలో డీఎన్ఏ ఫలితాలు వైవాహిక జీవితాలను ముక్కలుగా చేస్తోంది. కుటుంబ హింస, విడాకులు, ఆస్తి విభజనల్లో సమస్యలు పెంచుతోంది. వాస్తవానికి ఆ దేశంలో వివాహేతర సంబంధాలు ఎంత విచ్చలవిడిగా ఉన్నాయో, తాజా డీఎన్ఏ పరీక్షా ఫలితాలు వెళ్లడిస్తున్నాయి. ప్రముఖులు ముఖ్యంగా బిజినెస్ టైకూన్లు, అకడమిక్స్ తమ పిల్లల్లో కొందరు తమకు పుట్టలేదని అనుమానిస్తున్నారు. ఫలితంగా డీఎన్ఏ టెస్టులకు వెళ్తున్నారు. వారి అనుమానాలు నిజమే అని ఈ పరీక్షలు తేల్చుతున్నాయి. కాంపాలాలో ధనవంతుడైన అధ్యాపకుడు తన మూడు పిల్లల్లో ఒకరు తనకు పుట్టలేని అనుమానించాడు. కోర్టు ఆదేశంతో డీఎన్ఏ పరీక్షలు చేస్తే అందులో అతడి అనుమానం నిజం అయ్యింది.

కుటుంబ సమస్యల్లో కీలకపాత్ర

Advertisement

ఆస్తి విభజనలోనూ డీఎన్ఏ పరీక్షలు పెను వివాదానికి కారణం అవుతున్నాయి. ఒక సంఘటనలో భార్య మరణానంతరం ఆమె భర్త ఆరు నెలల బిడ్డను చంపేసిన ఇజ్రాయెల్ పౌరుడిని పోలీసు అరెస్ట్ చేశారు. కారణం ఏంటంటే, డీఎన్ఏ టెస్టులో అతడు ఆమె తండ్రి కాదని తేలింది. అదే సమయంలో సాంస్కృతిక, మతపరమైన వివాదాలకు డీఎన్ఏ రిపోర్టులు కారణం అవుతున్నాయి. మత నాయకులు డీఎన్ఏ టెస్టులను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే చాలా మంది మత నాయకులు అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలను కలిగి ఉన్నారు. ఈ రిపోర్టులతో అసలు వ్యవహారం బయటకు వస్తున్న కారణంగా వాటిని నిర్వహించకూడదంటున్నారు.

వివాదరం రేపిన బిషప్ వ్యాఖ్యలు

అంగ్లికన్ చర్చిలో జరిగిన క్రిస్మస్ డే సర్వీస్‌లో అర్చ్‌ బిషప్ స్టీఫెన్ కజియిం.. ఉగాండాలో డీఎన్ఏ రిపోర్టుల వివాదం గురించి మాట్లాడుతూ.. మరియా కన్యాగర్భోత్పత్తిని ఎగ్జాంపుల్ గా చెప్పాడు. నలుగురు పిల్లల్లో ఇద్దరు మాత్రమే మీకు పుట్టారని తేలితే ఏమవుతుంది?  జోసెఫ్ లాగా పిల్లలను ఆదరించాలని పిలుపునిచ్చాడు. అటు గిరిజన నాయకుడు మోసెస్ కుటోయ్ వంటి సంప్రదాయ పెద్దలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన దగ్గరకు వచ్చే కుటుంబ వివాదాలను పరిష్కరించే క్రమంలో.. తాను కూడా తన తండ్రి పోలికతో ఉండనంటూ ఉదాహరణగా చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరీక్షలతో ఉగాండా తీవ్రమైన కలవరపాటుకి గురవుతోంది.

ప్రభుత్వం ఏం చెప్తుందంటే?

Advertisement

దేశంలో డీఎన్ఏ రిపోర్టులు కుటుంబాల్లో భావోద్వేగ సమస్యలు పెరిగేందుకు కారణం అవుతున్నాయని ఇంటర్నల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పరీక్షలు ఇలాగే కొనసాగితే ఉగండాలో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఈ టెస్టుల విషయంలో నియంత్రణ విధించాలని కోరుతున్నారు.

Read Also:  ఇల్లు అద్దెకు దొరకడం లేదని.. రోజుకో అబ్బాయి ఇంట్లో గడుపుతున్న అమ్మాయి, అదెలా?

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×