Vande Bharat Train Routes: భారతీయ ఐకానిక్ సెమీ-హై-స్పీడ్ రైలు అయిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ సేవలను దేశ వ్యాప్తంగా మరింత విస్తరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా అనేక కొత్త మార్గాల్లో వందేభారత్ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. వేగంతో పాటు అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉన్న వందేభారత్ రైళ్లు త్వరలో పలు కీలక మార్గాల్లో తమ సర్వీసులను అందించబోతున్నాయి.
త్వరలో అందుబాటులోకి రానున్న మార్గాలు
1.నాగ్‌పూర్- సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ఈ మార్గం మహారాష్ట్రలోని కీలక రవాణా కేంద్రమైన నాగ్ పూర్ ను తెలంగాణలోని సికింద్రాబాద్ తో అనుసంధానించనుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది. అంతేకాదు, ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచనుంది.
2.జైపూర్- చండీగఢ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ఈ రూట్ రాజస్థాన్ రాజధాని జైపూర్ ను చండీగఢ్ తో కలుపుతుంది. ఈ మార్గంలో ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది.
3.ఇండోర్- సూరత్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ఈ రూట్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్- గుజరాత్ లోని సూరత్ లను కలుపుతుంది. రెండు ప్రధాన వాణిజ్య కేంద్రాల మధ్య మరింత త్వరగా ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ఈ మార్గం ఈ ప్రాంతాల మధ్య వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలను మరింత సులభతరం చేయనుంది.
4.ముంబై- కొల్హాపూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
ఈ రూట్ మహారాష్ట్ర ఆర్థిక రాజధాని ముంబై, చారిత్రక ప్రాముఖ్యత, పారిశ్రామిక కేంద్రంగా కొనసాగుతున్న కొల్హాపూర్ ను కలపనుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనుంది.
5.ఢిల్లీ-కోట వందే భారత్ ఎక్స్ ప్రెస్
దేశ రాజధాని న్యూఢిల్లీ- రాజస్థాన్‌లోని కోటాతో కలుపుతూ ఈ రైలును అందుబాటులోకి తీసుకురానున్నారు. కోటాలో విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
6.పూణే- మడ్గావ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
గోవాకు వెళ్లే పర్యాటకులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రూట్ మహారాష్ట్రలోని పూణే, గోవాలోని మడ్గావ్ తో కలుపుతుంది. ఈ రైలు పర్యాటకులకు, వ్యాపారస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
7.పూణే- హైదరాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
ఈ రైలు మహారాష్ట్రలోని పూణే, తెలంగాణలోని హైదరాబాద్ ను కలుపుతుంది. ఈ మార్గం రెండు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణాన్ని అందించనుంది.
8.పూణే- సూరత్-వడోదర వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ఈ రూట్ పూణే, సూరత్, వడోదను కలుపుతుంది. ఇది కళ్యాణ్ జంక్షన్ మీదుగా వెళ్తుంది. పశ్చిమ భారతదేశంలో ఇంటర్ సిటీ ప్రయాణాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా దీనిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
9.బెంగళూరు- మధురై వందే భారత్ ఎక్స్‌ప్రెస్
దేశ ఐటీ రాజధాని బెంగళూరును తమిళనాడులోని మధురైని ఈ మార్గం కలుపుతుంది. కీలకమైన మత, సాంస్కృతిక గమ్యస్థానంగా కొనసాగనుంది.
10.మంగళూరు-గోకర్ణ-మార్గో వందే భారత్ ఎక్స్ ప్రెస్
సుందరమైన కొంకణ్ తీర ప్రాంత ప్రయాణీకులకు ఈ రైలు మరింత ఆహ్లాదకర ప్రయాణానాన్ని అందించనుంది. ఇది మంగళూరును గోకర్ణ, మార్గోవాతో కలుపుతుంది. తీరప్రాంత కర్ణాటక, గోవాను కలుపుతూ వెళ్తుంది.
ఇండియన్ రైల్వే గేమ్ ఛేంజర్
ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ మార్గాలు ప్రయాణీకులకు వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించనుంది. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడంలో ఈ రైళ్లు కీలక పాత్ర పోషించనున్నాయి. అధునాతన భద్రతా ఫీచర్లు, మెత్తటి సీటింగ్, అత్యంత వేగం ప్రయాణీకులను మరింత ఆకట్టుకోనుంది.
Read Also: వేసవి సెలవుల వేళ రైల్వే గుడ్ న్యూస్, చర్లపల్లి నుంచి 26 ప్రత్యేక రైళ్లు!