Fake Baba Molest Woman| తెలంగాణ రాష్ట్రంలో స్వామిజీ ముసుగులో మహిళలపై లైంగిక దాడులు చేస్తున్న ఓ నకిలీ బాబా బండారాన్ని సిరిసిల్ల జిల్లా పోలీసులు బయటపెట్టారు. మహిళా భక్తులకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడులు చేస్తున్న ఈ నకిలీ బాబాను పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే.. వేములవాడకు చెందిన బాపు స్వామి అనే వ్యక్తి, తనకు మహిమలున్నాయని నమ్మిస్తూ.. ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని రాష్ట్రమంతా తిరిగేవాడు. అనారోగ్యం చేస్తే నయం చేస్తానని నమ్మించి తన వద్దకు వచ్చే భక్తులను మోసం చేసేవాడు. వారి వద్ద నుంచి డబ్బులు కాజేసేవాడు. అంతేకాకుండా మహిళలను ముఖ్యంగా వివాహితలను సంతాన సాఫల్యం పేరుతో బురిడీ కొట్టించేవాడు.
కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, తాను పూజలు చేసి నయం చేస్తానని నమ్మించేవాడు. సంతానం కోసం ప్రత్యేక పూజల పేరుతో మహిళలకు మత్తు మందు తినిపించి, స్పృహ కోల్పోయిన తర్వాత లైంగిక దాడులు చేసేవాడు. ఈ నకిలీ బాబా తన పూజల సమయంలో నిమ్మకాయలలో నిద్ర మాత్రలు కలిపి.. మహిళలకు వాసన చూపించి, ఒక జ్యూస్‌ని తాగించేవాడు. స్పృహ కోల్పోయిన తర్వాత వారిపై అత్యాచారం చేసేవాడు.
ఈ దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి, బాధితులను బ్లాక్‌మెయిల్ చేసేవాడు. ఓ మహిళ ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. విషయం బయటపడింది. పోలీసులు దొంగబాబాను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి పోలీసులు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో వందలాది మహిళల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు.
Also Read: రోజుకు అయిదువేలు ఇస్తేనే కాపురం.. టెకీ భర్తకు కండీషన్ పెట్టిన భార్య
లోదుస్తులు దొంగిలించే ఇంజినీర్
కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో 25 ఏళ్ల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, టుమ్కూరులో ఎస్ఐటీ సమీపంలోని అద్దె ఇళ్లలో గత కొన్ని రోజులుగా దండెంపై ఆరేసిన మహిళల, బాలికల లోదుస్తులు (Woman Innerwear) కనిపించకుండా పోయాయి. ఈ విషయాన్ని మహిళలు తమ భవన యజమానికి తెలియజేశారు. దీంతో యజమాని న్యూ ఎక్స్‌టెన్షన్ పోలీసులకు సమాచారం అందించాడు. వారు వెంటనే ఈ విషయంలో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా, బట్టలు ఎవరు దొంగిలిస్తున్నారో తెలుసుకోవడానికి పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను తనిఖీ చేశారు.
అందులో సీసీటీవీ ఫుటేజ్‌లో ఆసక్తికర విషయం బయటపడింది. మహిళలు, బాలికలు ఉండే ఇంటి దగ్గర ఒక వ్యక్తి బైక్ పై వచ్చి, రహస్యంగా లోదుస్తులను తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని టుమ్కూరులోని ఎస్ఐటీ నివాసి టెకీ శరత్‌గా గుర్తించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. అతను నేరం అంగీకరించాడు. తనకు అశ్లీల వీడియోలు చూసే అలవాటు ఉందని, ఆ నగరంలోని ఎస్ఐటీ ప్రాంతం, ఎస్ఎస్ పురం, అశోక్ నగర్ లలోని ఇళ్ల నుంచి కూడా లోదుస్తులను దొంగిలించానని శరత్ పోలీసుల ముందు చెప్పుకొచ్చాడు. అదేవిధంగా శరత్ తల్లిదండ్రులు వృత్తిరీత్యా టీచర్లు అని, అతని సోదరుడు సైతం ఇంజినీర్ అని తెలిసింది. శరత్ ప్రవర్తన, అతడిని అశ్లీల వీడియోల వ్యసనం గురించి తమకు ఏమీ తెలియదని వారు పోలీసులకు తెలిపారు.
కాగా, అద్దె ఇంట్లో నివసిస్తున్న మహిళలు అతనిపై ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా లేరని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో నిందితుడిని వార్నింగ్ ఇచ్చి బెయిల్‌పై విడుదల చేశారు.