Vande Bharat Sleeper Version Trial Run: రైల్వే ప్రయాణీకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. గత రెండు రోజులుగా మధ్యప్రదేశ్ లోని ఖజురహో-మహోబా నడుమ ఫీల్డ్ ట్రయల్ నిర్వహించారు. ఈ రైలు అనుకున్న ప్రకారంగానే ట్రయల్స్ పూర్తి చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి సమస్య తలెత్తలేదని వెల్లడించారు. ఈ కొత్త మోడల్ వందేభారత్ వేగవంతమైన ప్రయాణంతో పాటు అధునాతన సౌకర్యాలను కలిగి ఉంది. సుదూర ప్రయాణాల కోసం ఈ రైలును రూపొందించారు. ఈ రైలులో మాడ్యులర్ ప్యాంట్రీలు, ఎర్గోనామిక్ బెర్త్ లు, అదనపు సౌలభ్యం కోసం విశాలమైన లగేజ్ కంపార్ట్ మెంట్లు ఉన్నాయి. మెరుగైన భద్రత కోసం సెన్సార్ ఆధారిత కమ్యూనికేషన్ డోర్లు, ఫైర్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉన్నాయి.
స్లీపర్ వెర్షన్ పనితీరు, పరీక్ష ఫలితాలు
ఇక వందేభారత్ స్లీపర్ రైలుకు సంబంధించి తాజాగా నిర్వహించిన ట్రయల్ రన్స్ లో కీలక విషయాలను అధికారులు పరీక్షించారు. స్లీపర్ వెర్షన్ కు సంబంధించిన వేగం, స్థిరత్వం, సాంకేతిక వ్యవస్థలను రైల్వే ఇంజినీర్లు పరీక్షించారు. తొలి రోజు రోజు గంటకు 115 కి.మీ, రెండో రోజు 130 కి.మీ వేగంతో రైలును నడిపించారు. ఆప్టిమైజేషన్ల తర్వాత రైలు గంటకు 160 నుంచి 200 కి.మీ.కు చేరుకోగలదని నిపుణులు భావిస్తున్నారు. దేశ రైల్వే నెట్ వర్క్ లో పూర్తి రోల్ అవుట్ కు ముందు మరికొన్ని పరీక్షలు నిర్వహించనున్నారు.
अत्याधुनिक स्लीपर ट्रेनों के नए युग की कुछ झलकियां। #वंदेभारत_स्लीपरट्रेन pic.twitter.com/A82gO6p7pR
— Ministry of Railways (@RailMinIndia) December 26, 2024
త్వరలో అందుబాటులోకి 10 స్లీపర్ రైళ్లు
దేశ వ్యాప్తంగా పలు స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారతీయ రైల్వే సంస్థ ప్రయాణాళికలు సిద్ధం చేస్తున్నది. తొలి దశలో భాగంగా 10 స్లీపర్ వెర్షన్లను దేశ వ్యాప్తంగా ప్రారంభించాలని భావిస్తున్నది. ఈ రైళ్లు మీడియం, సుదూర మార్గాల్లో ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చేలా అందుబాటులోకి తీసుకురానున్నది. వేగవంతమైన ప్రయాణం, మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా వీటిని తీసుకొస్తున్నది. త్వరలోనే స్లీపర్ వెర్షన్ కు సంబంధించిన పూర్తి పరీక్షలు పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు.
విమానం తరహా సదుపాయాలు
వందేభారత్ స్లీపర్ వెర్షన్ లో మాడ్యులర్ డిజైన్లు, క్రాష్ రెసిస్టెంట్ స్ట్రక్చర్లు, మెరుగైన సామర్థ్యం కోసం ఏరోడైనమిక్ ఎక్స్ టీరియర్స్ ఉన్నాయి. ఈ రైలును స్టెయిన్ లెస్ స్టీల్ తో రూపొందించారు. ఈ నిర్మాణం కారణంగా రైలు మరింత వేగంగా దూసుకెళ్లే అవకాశం ఉంది. ఇక రైలులో ప్రయాణీకులు ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్లు, USB ఛార్జింగ్ పోర్ట్ లు, ఫస్ట్-క్లాస్ కంపార్ట్ మెంట్లలో హాట్ వాటర్ షవర్లు ఉంటాయి. దివ్యాంగులైన ప్రయాణీకుల కోసం టాయిలెట్లు, ఎర్గోనామిక్ డిజైన్లుతో మరింత పరిశుభ్రతను అందించనున్నాయి. వందేభారత్ స్లీపర్ వెర్షన్ భారతీయ రైల్వేను మరో మైలు రాయిని అదిగమించేలా చేయబోతున్నది. భారతీయ రైల్వే అధునాతన సాంకేతికత ద్వారా సేవలను మెరుగు పరచడంతో పాటు కనెక్టివిటీని విస్తరించనుంది. ఇక ఈ అత్యాధునిక రైలును జనవరి 26న ప్రధాని మోడీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తొలి వందేభారత్ స్లీపర్ వెర్షన్ న్యూఢిల్లీ-శ్రీనగర్ నడుమ సేవలను అందించనుంది.
Read Also: మరోసారి IRCTC వెబ్ సైట్ డౌన్.. నిలిచిపోయిన రైల్వే టికెట్ బుకింగ్స్!