Indian Railways: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ ఆండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) వెబ్ సైట్ సర్వర్ మరోసారి డౌన్ అయ్యింది. రైల్వే టికెట్ల బుకింగ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సైట్ పని చేయడం లేదు. మెయింటెనెన్స్ కారణంగా సైట్ పని చేయడం లేదని తెలుస్తోంది. రైల్వే టికెట్ బుకింగ్ వెబ్ సైట్, యాప్ ఓపెన్ కావట్లేదని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మెయింటెనెన్స్ యాక్టివిటీస్ కొనసాగుతున్నందున ఈ అంతరాయం ఏర్పడినట్లు భారతీయ రైల్వే సంస్థ ప్రకటించింది. మరికొద్ది గంటల్లో సమస్య పరిష్కారం అవుతుందని వెల్లడించింది. “వెబ్ సైట్ మెయింటెనెన్స్ యాక్టివిటీ కారణంగా, ఇ-టికెటింగ్ సర్వీస్ అందుబాటులో లేదు. దయచేసి తర్వాత ప్రయత్నించండి” అనే మెసేజ్ ను సైట్ లో డిస్ ప్లే చేస్తోంది. అయితే, IRCTC వెబ్ సైట్ సేవలు డౌన్ కావడం ఈ నెలలో రెండోసారి. డిసెంబర్ 9న కూడా సైట్ మెయింటెనెన్స్ కారణంగా IRCTC సేవలు నిలిచిపోయాయి.
Trying to book an emergency tatkal ticket only to face server downtime is extremely frustrating! This inefficiency during crucial times is unacceptable. Hope @IRCTCofficial resolves this issue soon! #TatkalBooking #IRCTC @IRCTCofficial @RailMinIndia pic.twitter.com/G9A2Qc7jyK
— Satyam (@satyaamps) December 26, 2024
IRCTC కాకుండా ఇతర మార్గాల్లో టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?
రైల్వే ప్రయాణీకులు ఎక్కువగా IRCTC వెబ్ సైట్ లేదంటే యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటారు. ఒకవేళ ఈ సైట్ డౌన్ అయితే, మరికొన్ని పద్దతుల ద్వారా కూడా రైల్వే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకీ అవేంటో తెలుసా?
⦿ఆథరైజ్డ్ ఏజెంట్లు
IRCTC- ఆథరైజ్డ్ టికెట్ బుకింగ్ ఏజెంట్లు లేదంటే మీకు సమీపంలోని ట్రావెల్ ఏజెన్సీని సందర్శించండి. మీ వివరాలను వారికి అందిస్తే అవసరమైన రైలుకు సంబంధించిన టికెట్లు బుక్ చేస్తారు.
⦿రైల్వే స్టేషన్ కౌంటర్లు
IRCTC యాప్ పని చేయని సందర్భంలో సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌కి వెళ్లండి. రిజర్వేషన్ ఫారమ్‌ను ఫిల్ చేయండి. వ్యక్తిగతంగా మీ టికెట్లను బుక్ చేసుకోండి.
⦿థర్డ్-పార్టీ యాప్‌లు, వెబ్‌సైట్లు
విశ్వసనీయమైన థర్డ్ పార్టీ యాప్స్ లేదంటే వెబ్ సైట్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది.
1.Paytm
2.MakeMyTrip
3.ConfirmTkt
4.RedBus యాప్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿139కి కాల్ చేయండి (ఇండియన్ రైల్వేస్ ఎంక్వైరీ)
IRCTC సైట్ పని చేయని సందర్భంలో భారతీయ రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 139కి కాల్ చేయండి. వారి IVR లేదంటే ఏజెంట్ సహాయం ద్వారా రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
⦿పోస్టాఫీసు
దేశంలోని కొన్ని పోస్టాఫీసులు రైలు టిక్కెట్ బుకింగ్ సేవలను అందిస్తాయి. మీకు దగ్గర్లోని పోస్టాఫీస్ లో ఈ సదుపాయం ఉంటే, అక్కడికి వెళ్లి బుక్ చేసుకోండి.
⦿తత్కాల్, ఎమర్జెన్సీ కోటాలు
అత్యవసర ప్రయాణం అయితే, మీరు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. లేదంటే స్టేషన్ లో అత్యవసర కోటా కింద కూడా కన్ఫర్మ్ టికెట్లు పొందే అవకాశం ఉంటుంది.
రైల్వే టికెట్ బుకింగ్ టిప్స్
⦿టిక్కెట్ బుకింగ్ కోసం మీ దగ్గర చెల్లుబాటు అయ్యే ID ఫ్రూఫ్ లు ఉంచుకోవాలి.
⦿ఒకవేళ అర్జంట్ ప్రయాణ సమయాల్లో టిక్కెట్లు అందుబాటులో లేకుంటే ప్రత్యామ్నాయంగా బస్సు, విమాన సేవలను పొందే ప్రయత్నం చేయండి.
Read Also: 2029 కల్లా హైపర్ లూప్ రైళ్లు.. విమానం కంటే వేగంగా గమ్యానికి చేరిపోవచ్చు!