Comedy Movie In OTT: ఓటీటీలోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని కామెడీతో కడుపుబ్బా నవ్వించడం మాత్రమే కాదు. హారర్ సన్నివేశాలతో ఆడియన్స్ ను నవ్విస్తూ భయపెడుతున్నాయి. ఇటీవల ఓటీటి ప్లాట్ ఫామ్స్ కొత్త సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొని వస్తున్నాయి.. తాజాగా మరో కొత్త కామెడీ మూవీని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. బాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న హారర్ కామెడీ మూవీ మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది. థియేటర్లలో భారీ రెస్పాన్స్ ను అందుకున్న మూవీ కోసం ఓటీటి లవర్స్ వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ మూవీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఏడాది వచ్చిన కామెడీ హారర్ మూవీలలో ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఇదొక్కటే కాదు థియేటర్లలోకి వచ్చిన అన్ని సినిమాలు కూడా మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.. ఈ జానర్లో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ మూవీయే భూల్ భులయ్యా 3. కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ లాంటి వాళ్లు నటించిన ఈ మూవీ థియేటర్లో భారీ వసూళ్లను అందుకోవడంతో పాటుగా బాలీవుడ్ తో పాటుగా తెలుగులో కూడా కలెక్షన్స్ ను అందుకుంది. ఈ మూవీ ఇన్ని రోజులకు ఓటీటిలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుంది. డిసెంబర్ 27 నుంచి మూవీ రిలీజ్ కాబోతుందని ఎప్పుడు స్ట్రీమింగ్ డేట్ ను లాక్ చేసుకుంది.. మరి కొన్ని గంటల్లో అంటే ఈరోజు అర్ధ రాత్రి నుంచే ఓటీటిలో అందుబాటులోకి రాబోతుంది..
భూల్ బాలయ్య మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత సీక్వెల్ గా వచ్చిన భూల్ బాలయ్య 2 కూడా సక్సెస్ అయ్యింది. అలాగే ఇప్పుడు వచ్చిన భూల్ బాలయ్య 3 మూవీ ఇటీవల థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీ శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత ఈ హారర్ కామెడీ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని కొన్నాళ్ల కిందటే అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్ తాజాగా గురువారం మరో వీడియో రిలీజ్ చేసింది.. ఆ వీడియోలో రేపటి నుంచి స్ట్రీమింగ్ కు రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు.
భూల్ భులయ్యా ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన మూడో మూవీకి నెగటివ్ రివ్యూలు వచ్చాయి. సినిమాను చూసిన ప్రేక్షకులకు కూడా అసలు నచ్చలేదు.. కానీ 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం 417 కోట్లు రాబట్టింది..కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, మాధురి దీక్షిత్, తృప్తి డిమ్రిలాంటి వాళ్లు ఈ సినిమాలో నటించారు. అనీస్ బజ్మీ సినిమాను డైరెక్ట్ చేశాడు. హారర్ తోపాటు కామెడీ కూడా పంచిన ఈ సినిమా మ్యూజికల్ గా మాత్రం సక్సెసైంది.. థియేటర్లలో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఓటీటిలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..