New Traffic Rules: ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పోలీసులు ఎప్పటికప్పుడు సరికొత్త ట్రాఫిక్ రూల్స్ అమలు చేస్తున్నారు. ప్రయాణీకులు జాగ్రత్తగా వాహనాలు నడపడంతో పాటు రోడ్డు ప్రమాదాలు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ వాయలేషన్స్ చేసే వారిని పట్టుకుని తరచుగా జరిమానాలు కూడా వేస్తున్నారు. అయితే, వాహనదారుల అసౌకర్యాన్ని తగ్గించడానికి ఆన్ లైన్ చలాన్ లను ప్రవేశపెట్టారు. అయితే, చాలా మంది వాహన యజమనాలు చలాన్లు జారీ చేసినప్పటికీ నెలల తరబడి చెల్లించడం లేదు. దీని వల్ల ఒకే వాహనం మీద చాలా చలాన్స్ పెండింగ్ లో ఉంటున్నాయి.
ఇకపై 90 రోజల్లో చలాన్ చెల్లించాల్సిందే!
చలాన్లు విధించినా చెల్లించని వాహనదారుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఇందుకోసం గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు కొత్త మార్గదర్శకాలను రూపొందించారు. రీసెంట్ గా ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. గురుగ్రామ్ లో చలాన్ జారీ చేసిన 90 రోజుల్లోపు జరిమానా చెల్లించని వ్యక్తి వాహనాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించనున్నట్లు ట్రాఫిక్ డీసీపీ వీరేందర్ విజ్ వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు చలాన్ విధించబడిన ఏ వాహనదారుడు అయినా నా 90 రోజుల్లోపు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు తమ పరిధిలో ఈ విషయం అవగాహణ కల్పిస్తున్నారు. గురుగ్రామ్ ట్రాఫిక్ అధికారులు రోజుకు సగటున 4,500 ట్రాఫిక్ చలాన్లు జారీ చేస్తున్నారు. దాదాపు మూడింట రెండు వంతుల చలాన్లు కెమెరాల నెట్ వర్క్ ద్వారా జారీ జారీ అవుతున్నాయి. మిగిలిన వాటిని ట్రాఫిక్ పోలీసు అధికారులు మాన్యువల్ గా జారీ చేస్తున్నారు.
90 రోజుల్లో చలాన్ చెల్లించకపోతే స్టేషన్ కు వాహనం
వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు.. 90 రోజుల తర్వాత చలాన్ చెల్లింపు బకాయి ఉన్నట్లు తేలితే.. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 167(8) కింద వాహనాన్ని అదుపులోకి తీసుకోవచ్చని ట్రాఫిక్ డీసీపీ వీరేందర్ విజ్ వెల్లడించారు. గతంలో చెల్లించాల్సిన చలాన్లన్నింటినీ చెల్లించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 2, 2025గా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజలు ఈలోపు తమ చెల్లించాల్సిన చలాన్లను క్లియర్ చేయాలని సూచించారు. లేదంటే వాహనాలను పట్టుకోవాల్సి ఉంటుందని విజ్ హెచ్చరించారు.
Read Also: మన వందేభారత్ కు మరిన్ని కోచ్ లు, ప్రయాణీకులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్!
ఆన్ లైన్ చలాన్ ఎలా జారీ అవుతుందంటే?
రోడ్లపై ఉల్లంఘనను గుర్తించే కెమెరాలు GMDAకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లోని అధికారులను అప్రమత్తం చేస్తాయి. సంబంధిత అధికారులు ఫుటేజ్ ను తనిఖీ చేసి, నిర్దిష్ట వాహన యజమానికి టోమేటిక్ ఆన్ లైన్ చలాన్ లను పంపిస్తారు. ఆన్ లైన్ చలాన్ వ్యవస్థలో జరిమానా మొత్తాలు వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా జారీ అవుతాయి. ప్రస్తుతం, పెండింగ్‌లో ఉన్న చలాన్ బకాయిలను నిర్దిష్ట వ్యవధిలోపు క్లియర్ చేసే యంత్రాంగం లేదు. కానీ, ప్రస్తుత రిజిస్ట్రేషన్ నంబర్ పై ఉన్న బకాయిలను క్లియర్ చేసే వరకు వాహనాన్ని మరొక యజమానికి, మరొక RTOకి బదిలీ చేయలేరు.
Read Also: విమాన, రైలు టికెట్లు క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మరింత రీఫండ్ పొందచ్చు!