OTT Movie : సినిమాలు మనుషుల జీవితాలను మారుస్తాయో లేదో గాని, చూసిన కాసేపైనా మనిషి ఫీలింగ్స్ ని మారుస్తాయి. ఎంతటి వాళ్ళయినా కొన్ని సన్నివేశాలలో కంటతడి పెడుతూ ఉంటారు. ఆ కన్నీళ్ళ వెనక, కరిగే హృదయం ఉంటుంది. సంగీతానికి రాళ్లు కరిగినట్టు, కొన్ని సినిమాలకి మనుషుల మనసు కరుగుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అటువంటిదే. తెలుగులో ‘గీతాంజలి’ మూవీ ఒకప్పుడు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. హాలీవుడ్ నుంచి వచ్చిన అటువంటి మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ‘ఫైవ్ ఫీట్ అపార్ట్‘ (Five Feet Apart). ఈ మూవీకి జస్టిన్ బాల్డో దర్శకత్వం వహించారు. సిస్టిక్ ఫైబ్రోసిస్‌తో బాధపడుతున్న వాళ్ళు, ఒకరికొకరు ఆరు అడుగుల దూరంలో ఉండవలసి వచ్చినప్పటికీ ప్రేమించుకోవడానికి పయత్నిస్తారు. ఈ మూవీ యునైటెడ్ స్టేట్స్‌లో లయన్స్‌గేట్ ద్వారా విడుదలైంది. విమర్శకుల నుండి ప్రశంసలు అందుకొని, ప్రపంచవ్యాప్తంగా $92 మిలియన్లు వసూలు చేసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ కి ఆరోగ్యం బాగో లేకపోవడంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. ఆమెకు సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే జబ్బు ఉంటుంది. ఊపిరితిత్తులు మారిస్తే తప్ప బ్రతికే అవకాశం తక్కువ ఉంటుంది. అదే హాస్పిటల్లో సేమ్ జబ్బు ఉన్న పో అనే వ్యక్తి కూడా ఉంటాడు. అయితే ఇటువంటి జబ్బు ఉన్న ఇద్దరు వ్యక్తులు దగ్గర కూర్చోకూడదు. ఆరడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఆ డిస్టెన్స్ మైంటైన్ చేయకపోతే చనిపోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే హీరో అదే జబ్బుతో అక్కడ జాయిన్ అవుతాడు. దూరంగా ఉంటూనే ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటారు. హీరోయిన్ కి లంగ్స్ మారిస్తే బతికే అవకాశం ఉంటుంది. అయితే హీరోకి ఆ అవకాశం కూడా ఉండదు. అతను కొద్ది రోజుల్లోనే చనిపోతాడు. బొమ్మలు వేస్తూ హీరోయిన్ తో ఎక్కువగా క్లోజ్ అవుతాడు హీరో. అందులో ఉండే పో అనే వ్యక్తి తల్లిదండ్రులను చూడడం ఇష్టం లేక అక్కడే ఉంటాడు. ఎందుకంటే అతడు కూడా కొన్ని రోజుల్లో చచ్చిపోతాడు. తల్లిదండ్రుల దగ్గర ఉండి బాధ పెట్టడం ఎందుకని అక్కడే ఉంటాడు. హీరో, హీరోయిన్లు డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ ఒకరిని ఒకరు ఇష్టపడుతుంటారు.
ఒకరోజు పో తన డెసిషన్ మార్చుకుంటాడు. కొద్దిరోజుల్లో చనిపోయే తనని చూడాలని తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. వాళ్లతో కలిసి ఉంటే కొద్ది రోజులైనా వాళ్లతో సంతోషంగా ఉండొచ్చు అని ఇంటికి వెళ్లడానికి ఒప్పుకుంటాడు. అలా ప్రయాణం అవుతుండగా అతను చనిపోతాడు. ఇది చూసి హీరోయిన్ గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఆ తర్వాత హీరో ఆమెను ఓదారుస్తాడు. వీళ్ళిద్దరూ సరదాగా బయటికి వెళ్లి కాసేపు గడుపుతూ ఉంటారు. ఇంతలోనే హీరోయిన్ కి లంగ్స్ డొనేట్ చేసే వాళ్ళు వస్తారు. హాస్పిటల్లో ఎంత వెతికినా ఇద్దరు కనిపించకుండా పోవడంతో ఫోన్ కి మెసేజ్ చేస్తారు. లంగ్స్ ఇచ్చేవాళ్ళు వచ్చారని తెలిసిన హీరోయిన్ సైలెంట్ గానే ఉంటుంది. ఎందుకంటే హీరోతో కలిసి తను కూడా చనిపోవాలనుకుంటుంది. చివరికి హీరోయిన్ కి ఆపరేషన్ జరుగుతుందా? వీళ్ళిద్దరి ప్రేమ ఏమవుతుంది? హీరో ఈ జబ్బుతో చనిపోతాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.