బాదంపప్పులు తరచూ తినడం వల్ల జీర్ణక్రియ, పేగుల ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. బాదంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కువ సేపు పొట్ట నిండేలా చేస్తుంది. దీనివల్ల జీవక్రియ కూడా మెరుగుపడుతుంది బరువు కూడా పెరగకుండా ఉంటారు అయితే ఎంతోమందికి బాదంపప్పును పొట్టు తీసి తినాలా లేకపొట్టుతో తినాలా అనే సందేహం ఉంటుంది
బాదంపప్పు ఎలా తినాలి
జనాలు ప్రకారం బాదంపప్పులను ఎలా తినాలో తెలుసుకుందాం. పొట్టు తీయని బాదం పప్పులు తినడం వల్ల విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బాదంపప్పు పైన ఉండే పొట్టులో ఫైబర్ నిండుగా ఉంటుంది. జీర్ణక్రియకు, బరువు నిర్వహణకు రక్తంలో చక్కెర నియంత్రణకు పొట్టు తీయని బాదం ఉపయోగపడుతుంది. పొట్టు తీయని బాదం తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలో పెరుగుతాయి.
ఇక పొట్టు తీసిన బాదం పప్పులు తినడం వల్ల అవి మృదువుగా మారుతాయి. వీటిని ఏ వంటకాల్లోనైనా చేర్చుకోవచ్చు. వీటిలో కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ప్రోటీన్లు నిండుగా ఉంటాయి. అలాగే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కానీ పొట్టు తీసేయడం వల్ల ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ల శాతం కొంచెం తగ్గుతుంది.
ఏవి తింటే మంచిది?
పొట్టు తీసినా లేదా తీయని బాదంపప్పులు… రెండూ కూడా ఆరోగ్యకరమైనవే. మీ పొట్ట సున్నితంగా ఉంటే పొట్టు తీసిన బాదం పప్పులు తినడం ముఖ్యం. పైన పొట్టు అరగడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా తినవచ్చు. అయితే బాదం పప్పులను నానబెట్టుకుని తినడం వల్ల పోషకాలు ఎక్కువగా అందుతాయి.
బాదంపప్పులను తినడం వల్ల మెగ్నీషియం స్థాయిలు అధికంగా చేరుతాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు వంటివి రాకుండా అడ్డుకోవచ్చు. మెగ్నీషియం లోపం వల్ల అధిక రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. బాదం పప్పులు తినడం వల్ల హై బీపీ తగ్గుతుంది.
రక్తంలో చాలామందికి చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి మీ రక్తంలోనే చెడు కొలెస్ట్రాల్ ఉంటే బాదం తినడం ప్రారంభించండి. అది చెడు కొలెస్ట్రాల్ ను కరిగిపోయేలా చేస్తుంది. ధమనులను వ్యాకోచించేలా చేసి రక్తపోటు పెరగకుండా అడ్డుకుంటుంది. బాదంపప్పుపై ఉండే పొట్టు పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి బాదంపప్పులు ఉత్తమమైనవి. ఇవి ప్రోటీన్, ఫైబర్తో నిండి ఉంటాయి. కాబట్టి గుప్పెడు తింటే చాలు పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి బాదంపప్పును మీరు ఎలా తిన్నా ఆరోగ్యకరమే.