Indian Railways: భారతీయ రైల్వేలో అత్యాధునిక సెమీ హైస్పీడ్ రైలుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ అడుగు పెట్టింది. లోకో మోటివ్ లేకుండా ఆధునిక సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. విద్యుత్ తో నడిచే ఈ రైలు గంటకు 160 కి.మీ అత్యధిక వేగంతో నడుస్తోంది. అయినప్పటికీ గంటకు 130 కిలో మీటర్లకు పరిమితం చేశారు. రైల్వే ట్రాక్ లు హైస్పీడ్ రాకపోకలకు సరిపడేలా లేకపోవడం వల్ల గంటకు 83 కి.మీ సగటు వేగంతో ప్రయాణిస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసిన ఈ రైలును రీసెర్చ్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ రూపొందించింది.
దేశంలో ఫాస్టెస్ట్, స్లోయెస్ట్ వందేభారత్ రైళ్లు
⦿ న్యూఢిల్లీ – వారణాసి వందే భారత్ ఎక్స్ ప్రెస్: న్యూఢిల్లీ – వారణాసి వందే భారత్ ఎక్స్ ప్రెస్ దేశంలో అందుబాటులోకి వచ్చిన తొలి వందేభారత్ ఎక్స్ ప్రెస్. దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే వందేభారత్ ఎక్స్ ప్రెస్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు న్యూఢిల్లీ- వారణాసి మధ్య 771 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఎనిమిది గంటల్లో కవర్ చేస్తుంది. ఈ రైలు సగటు వేగం గంటకు 96.37 కి.మీ.
⦿ హజ్రత్ నిజాముద్దీన్-రాణి కమలాపతి స్టేషన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్: ఈ రైలు సగటున 95.89 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 7 గంటల 30 నిమిషాల్లో 700 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
⦿ చెన్నై-కోయంబత్తూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్: ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ సగటున 90.36 కి.మీ వేగంతో 5 గంటల 50 నిమిషాల్లో 497 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
⦿ సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్: సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ సగటున 84.21 కి.మీ వేగంతో 8 గంటల 30 నిమిషాల్లో 699 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
⦿ న్యూఢిల్లీ – అంబ్ అందౌర వందే భారత్ ఎక్స్ ప్రెస్: న్యూఢిల్లీ – అంబ్ అందౌర వందే భారత్ ఎక్స్ ప్రెస్ సగటున 84.85 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 437 కిలో మీటర్ల దూరాన్ని 5 గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుంది.
⦿ గాంధీనగర్-ముంబై వందే భారత్ ఎక్స్ ప్రెస్: ఈ రైలు సగటున 83.87 కి.మీ వేగంతో 520 కిలోమీటర్ల దూరాన్ని 6 గంటల 20 నిమిషాల్లో చేరుకుంటుంది.
⦿ అజ్మీర్-ఢిల్లీ కాంట్ వందే భారత్ ఎక్స్ ప్రెస్: ఈ రైలు సగటున 83.10 కి.మీ వేగంతో 5 గంటల 15 నిమిషాల్లో 428 కిలోమీటర్ల దూరాన్నిచేరుకుంటుంది.
⦿ న్యూ ఢిల్లీ – కత్రా వందే భారత్ ఎక్స్ ప్రెస్: న్యూఢిల్లీ- కత్రా మధ్య ప్రవేశపెట్టబడిన రెండవ వందే భారత్ ఎక్స్ ప్రెస్ సగటున 81.87 కి.మీ వేగంతో ఎనిమిది గంటల్లో 655 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
⦿ సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్: ఈ రైలు సగటున 79.63 కి.మీ వేగంతో 8 గంటల 30 నిమిషాల్లో 661 కిలోమీటర్ల దూరం చేరుకుంటుంది.
⦿ చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్: చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ సగటున గంటకు 79.36 కి.మీ వేగంతో 6 గంటల 30 నిమిషాల్లో 500 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటుంది.
⦿ ముంబై-షిర్డీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్: ముంబై-షిర్డీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ సగటున 65.96 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలు 5 గంటల 20 నిమిషాల్లో 343 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటుంది.
Read Also: ప్రధాని చేతుల మీదుగా రాష్ట్రంలో 3 రైల్వే స్టేషన్లు ప్రారంభం, ఎప్పుడో తెలుసా?