BigTV English
Advertisement

OTT Movies: ఊహకందని ఎన్నో సీన్లు .. కిల్లర్ ను పట్టించిన వెంట్రుక.. ఆఖరిలో ట్విస్ట్..

OTT Movies: ఊహకందని ఎన్నో సీన్లు .. కిల్లర్ ను పట్టించిన వెంట్రుక.. ఆఖరిలో ట్విస్ట్..

OTT Movies: ఇటీవల హారర్ సినిమాలకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.. ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది. మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చే థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్, మిస్టరీ థ్రిల్లర్స్ కు అసలు కొదవే లేదు. వాళ్లు ఎక్కువగా ఏ స్టోరీ తో తీసిన కూడా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇప్పుడు ఓ హారర్ మూవీ మాత్రం ప్రేక్షకులను పలకరిస్తుంది. ఆ మూవీ పేరేంటి? స్ట్రీమింగ్ ఎక్కడో ఒకసారి చూసేద్దాం..


మూవీ & ఓటీటీ.. 

గత ఏడాది నుంచి మలయాళ ఇండస్ట్రీ పంట పండుతుంది. ఇక్కడ ఎలాంటి సినిమా వచ్చినా సరే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్ సినిమాలతో పాటు ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమాలు కూడా ఎక్కువగా జనాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లకు మొగ్గు చూపిస్తున్నారు.. ఇక ప్రేక్షకుల అభివృద్ధికి తగ్గట్లు కొత్త పాత సినిమాలను స్ట్రీమింగ్ తీసుకొస్తున్నాయి ఓటీటీ సంస్థలు.. తాజాగా మలయాళ ఇండస్ట్రీ నుంచి ఓ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ జాన్ లూథర్.. యూట్యూబ్ లో హిందీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న సినిమా ఇది.. యూట్యూబ్ లో అయితే దీన్ని ఫ్రీగా చూసేయొచ్చు.. ప్రముఖ మలయాళ ఓటీటీ సంస్థ మనోరమా మ్యాక్స్ లో ఫ్రీగా చూసేయ్యొచ్చు.. బెస్ట్ థ్రిల్లర్ మూవీగా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఇటు ఓటీటీలో పాటు యూట్యూబ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది..


Also Read: ఆ ఒక్కటి అడక్కు..నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న సుమక్క..

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు చిన్న స్టోరీ లైన్ తో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. జాన్ లూథర్ మూవీ కూడా అలానే చిన్న స్టోరీ తో వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసింది.. అభిజిత్ జోసెఫ్ కథ అందించడంతోపాటు మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో చాలా పాత్రలే ఉన్నా.. ప్రధానంగా లీడ్ రోల్ చుట్టే తిరుగుతుంది. ఇది ఓ సీరియల్ కిల్లర్ కు సంబంధించిన థ్రిల్లర్ మూవీయే.. కానీ ఈ మూవీ స్టోరీ మాత్రం కొత్తగా ఉండడం తో, స్క్రీన్ ప్రజెంటేషన్ కూడా కొత్తగా చూపించడం తో సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఇందులో వరుసగా అందరూ మిస్ అవుతూ ఉంటారు. అయితే వాళ్ళని ఎవరు కిడ్నాప్ చేస్తుంటారు. ఎందుకు చేస్తున్నారు అనేది పోలీసులకు పెద్ద తల నొప్పిగా మారింది. ఈ కేసులో ఒక చిన్న వెంట్రుక కీలకంగా మారుతుంది. దాంతోనే పోలీసులు అసలు అంతకుడ్ని పట్టుకుంటారు. ఎన్నో మలుపుల తో అదిరిపోయే ట్విస్ట్ లతో సినిమా ఎండ్ అవుతుంది.. ఈ మూవీ ఓటీటీ తో పాటుగా యూట్యూబ్ లో ఫ్రీగా చూసి ఎంజాయ్ చేయండి..

Tags

Related News

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

Big Stories

×