BigTV English

OTT Movie : పరుగులు పెట్టించే గేమ్… ఊహించని ట్విస్ట్ లతో ఆకట్టుకునే కథ

OTT Movie : పరుగులు పెట్టించే గేమ్… ఊహించని ట్విస్ట్ లతో ఆకట్టుకునే కథ

OTT Movie : ఓటీటీలో కామిడీ కంటెంట్ తో చాలా సినిమాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఒక డిఫెరెంట్ కంటెంట్ తో వచ్చింది. ఈ సినిమా నాలుగు వేర్వేరు కథలను ఒక చోటుకి చేరుస్తూ, లూడో ఆటను గుర్తుకు తెస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


స్టోరీలోకి వెళితే

యమధర్మ రాజు, చిత్రగుప్తుడు లూడో ఆట ఆడుతూ కొన్ని పాత్రలను నిర్ణయిస్తారు. ఇది నాలుగు స్టోరీలుగా తిరుగుతుంది. లూడో ఆటలోని నాలుగు రంగులను (ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం) సూచిస్తాయి. సత్తు భయ్యా అనే గ్యాంగ్‌స్టర్ ఈ కథలన్నింటినీ అనుసంధానం చేసే డైస్‌గా పనిచేస్తాడు. ఇప్పుడు ఆట మొదలౌతుంది.


ఎరుపు : బిట్టు ఒక నేరం చేసి, ఆరు సంవత్సరాల జైలు శిక్ష తర్వాత విడుదలవుతాడు. అతను తన భార్య ఆశా, కుమార్తెను కోల్పోయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆశా, అతని స్నేహితుడు భానుని వివాహం చేసుకుంటుంది. బిట్టు గతంలో సత్తు భయ్యా కోసం పనిచేస్తుండేవాడు. అతనితో పాత లెక్కలు తీర్చుకోవాలనుకుంటాడు. ఇంతలో ఒక చిన్న అమ్మాయి ఇతని జీవితంలోకి రావడంతో, అతనికి జీవితం మీద కొత్త ఆశ పుడుతుంది. ఆమెను చూసినప్పుడల్లా బిట్టుకి తన కుమార్తె గుర్తుకువస్తూ ఉంటుంది.

పసుపు: ఆకాశ్ , శృతి ఒకప్పుడు ఏకాంతంగా గడిపిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. శృతికి తొందరలోనే వేరొక వ్యక్తితో పెళ్లి జరగబోతుంది. వీళ్ళు ఆ వీడియోని తొలగించడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వారి మధ్య పాత లవ్ మళ్లీ మొదలౌతుంది.

ఆకుపచ్చ : ఆలోక్ అలియాస్ ఆలు ఒక ధాబా యజమానిగా ఉంటాడు. అతని చిన్ననాటి ప్రియురాలు పింకీ భర్త ఒక హత్య కేసులో చిక్కుకుంటాడు. తన భర్తను రక్షించడానికి ఆలు సహాయం కోరుతుంది పింకీ. పింకీకోసం ఆలు సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు.

నీలం : రాహుల్ అవస్థి అనే యువకుడు, తన ఉద్యోగంలో బెదిరింపులకు గురవుతాడు. షీజా థామస్ అనే ఒక మలయాళీ నర్సు కూడా ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వీళ్లిద్దరూ సత్తు అనే గ్యాంగ్ స్టర్ కు చెందిన రెండు బ్యాగుల డబ్బుతో పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కాని సత్తు గ్యాంగ్ వారిని వెంబడిస్తూ ఉంటుంది.

ఇలా ఈ నాలుగు కథలు సత్తు భయ్యా దగ్గరికి వస్తాయి. వీళ్ళంతా ఒక హోటల్‌లో కలవడంతో, ఇక్కడ ఒక గందరగోలం జరుగుతుంది. ఈ గందరగోళం ఎలా ఎండ్ అవుతుందో తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : దిష్టి బొమ్మను గెలికితే ఇంత డేంజరా? గుండెను దడ దడ లాడించే హార్రర్ థ్రిల్లర్

నెట్ ఫ్లిక్స్ (Netflix )

ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘లూడో’ (Ludo). 2020 లో వచ్చిన ఈ మూవీకి అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. ఇందులో అభిషేక్ బచ్చన్, రాజ్‌కుమార్ రావు, ఆదిత్య రాయ్ కపూర్, పంకజ్ త్రిపాఠి, సన్యా మల్హోత్రా, ఫాతిమా సనా షేక్, రోహిత్ సురేష్ సరాఫ్, పెర్ల్ మానీ ప్రధాన పాత్రల్లో నటించారు.  ‘లైఫ్ ఈజ్ లూడో, లూడో ఈజ్ లైఫ్’ అనే స్లోగన్ చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix ) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×