E-Paper
Advertisement

విమానంలా రైల్లో సీటు సెలెక్షన్ ఉండదు, కారణం ఏంటంటే?

విమానంలా రైల్లో సీటు సెలెక్షన్ ఉండదు, కారణం ఏంటంటే?
Advertisement

Train Seat Allocation System: సాధారణంగా బస్సులు, విమానాలలో టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలో నచ్చిన సీటు సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ, భారతీయ రైల్వేలో టికెట్ బుక్ చేసేటప్పుడు ఇష్టమైన సీటు,  బెర్త్‌ ను ఎంచుకునే అవకాశం ఉండదు. ఎందుకలా అని చాలా మందికి అనుమానం కలుగుతుంది. కానీ, రైల్వే సీట్ కేటాయింపు వెనుక పెద్ద కథ ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

రైళ్లలో సీటు కేటాయింపు ఎలా ఉంటుందంటే?   

రైళ్లలో భద్రత అనేది చాలా ముఖ్యం. రైళ్లు చాలా పొడవుగా ఉంటాయి. ఒక్కో రైల్లో పదుల సంఖ్యలో కోచ్ లు ఉంటాయి. ఒకే చోట ఎక్కువ మంది కూర్చుంటే,  లేదంటే ఒక కోచ్‌ లో బరువు ఎక్కువగా పడితే, రైలు సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే, IRCTCలో ఉన్న సిస్టమ్ ప్రయాణికులను అన్ని కోచ్‌ లలో సమానంగా పంచుతుంది. ఇలా చేయడం వల్ల రైలు స్థిరంగా ఉంటుంది.

Advertisement

ఇంకో కీలకమైన విషయం ఏటంటే.. రైళ్లు పలు స్టేషన్లలో ఆగుతాయి. ప్రయాణికులు మధ్యలో ఎక్కుతారు. దిగుతారు.  సీనియర్ సిటిజన్లు, మహిళలు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వాలి. అందరూ తమకు నచ్చిన సీటు ఎంచుకుంటే ఈ మొత్తం అస్తవ్యవస్థంగా మారుతుంది. ముఖ్యంగా చివరి నిమిషంలో జరిగే మార్పులు గందరగోళానికి కారణం అవుతాయి.

ఇక దేశంలోని రైళ్లు చాలా రద్దీగా ఉంటాయి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తారు. ఇలాంటి పరిస్థితిలో నచ్చిన సీటు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇస్తే, చాలా మంది లోయర్ బెర్త్‌ లు లేదంటే కిటికీ పక్క సీట్లనే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మిగతా సీట్లు ఖాళీగా ఉంటాయి. సమానంగా కేటాయింపు జరగకపోవచ్చు. దీనివల్ల గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.

రైళ్లలో సీటు సెలెక్షన్ పూర్తిగా లేదా?

Advertisement

రైళ్లలో సీటు సెలెక్షన్ అనేది పూర్తిగా లేదని కాదు. టికెట్ బుక్ చేసేటప్పుడు లోయర్, మిడిల్, అప్పర్  బెర్త్‌ లలో మీకు ఇష్టమైనదాన్ని ప్రాధాన్యతగా ఇవ్వవచ్చు. సిస్టమ్ అందుబాటులో ఉంటే మీ రిక్వెస్ట్ ను పరిగణలోకి తీసుకుంటుంది.    కానీ, కచ్చితమైన సీటు నంబర్ మాత్రం ముందుగా ఇవ్వదు. సాధారణంగా రైలు బయలుదేరే కొద్దిసేపటి ముందు చార్ట్ తయారు చేసినప్పుడు సీటు ఫైనల్ అవుతుంది. సీనియర్ సిటిజన్లు, గర్భిణీలు, దివ్యాంగులకు ప్రత్యేకంగా లోయర్  బెర్త్‌ లు ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది. అవసరమైతే ట్రైన్‌ లో TTE కూడా మార్పులు చేసి సాయం అందిస్తారు.  వందే భారత్ లాంటి ఆధునిక రైళ్లలో కొంతమేర సీటు మ్యాప్ కనిపించినా, పూర్తిగా మనమే ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తిగా అందుబాటులో లేదు. భద్రత, సమతుల్యత కారణాల వల్ల ఇప్పటికీ ఆటోమేటిక్ సిస్టమ్‌నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

Read Also: రైల్లో టాయిలెట్ దగ్గర పడుకున్న జవాన్లు, టీసీ ఏం చేశాడంటే?

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×