E-Paper
Advertisement

పుష్కర కాలం తర్వాత.. మనీ మార్కెట్లో బొమ్మ తిరిగిన రూపి, ఏకంగా..

పుష్కర కాలం తర్వాత.. మనీ మార్కెట్లో బొమ్మ తిరిగిన రూపి, ఏకంగా..
Advertisement

Rupee Gain: దాదాపు పుష్కర కాలం తర్వాత మనీ మార్కెట్లో రూపాయి రెక్కలు వచ్చాయి. డాలర్ తో పోల్చితే రూపాయి విలువ బలపడింది. ఏకంగా 93.20 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. రూపాయి బలపడడం వెనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న కఠిన చర్యలు కారణమని చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు.

మనీ మార్కెట్లో రూపాయి కాలం కలిసొచ్చింది

Advertisement

అంతర్జాతీయ పరిణామాల మధ్య బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో నడుస్తోంది. దశాబ్దం పైగానే రూపాయి విలువ పతనమైంది. ఆర్బీఐ తీసుకున్న చర్యల కారణంగా రూపాయి మారకం విలువ భారీగా పుంజుకుంది. 12 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా భారీగా లాభపడింది. సెప్టెంబర్ 2013 తర్వాత అత్యధిక పెరుగుదల ఇదే.

మధ్యాహ్నం 12 గంటలకు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 1.6 శాతం బలపడింది. ప్రస్తుతం 93.16 పైసలు వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.   మనీ మార్కెట్లో కరెన్సీ స్పెక్యులేషన్‌ ఎప్పటికప్పుడు జరుగుతోంది. దీన్ని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫోకస్ చేసింది. కఠిన చర్యలు కారణంగా రూపాయి బలపడినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి ఇందుకు కారణాలు లేకపోలేదు.

Advertisement

పుష్కర కాలం తర్వాత.. బొమ్మ తిరిగిన రూపాయి

గురువారం ఉదయం మార్కెట్లు ప్రారంభమైన రూపాయి ర్యాలీ స్పష్టంగా కనిపించింది. స్పెక్యులేషన్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఆఫ్‌షోర్ డెరివేటివ్ మార్కెట్లపై ఆర్బీఐ కొరడా ఝులిపించింది. ఫలితంగా రెసిడెంట్, నాన్-రెసిడెంట్ క్లయింట్లకు రూపాయి నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్ అందించకుండా బ్యాంకులను కట్టడి చేసింది. దీంతో రూపాయి జోరు కొనసాగుతోంది.

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అదే ఒరవడి కంటిన్యూ అయ్యింది. రద్దు చేయబడిన ఫారిన్ ఎక్స్ఛేంజ్ డెరివేటివ్స్ కాంట్రాక్టులను కంపెనీలు తిరిగి బుక్ చేసుకోలేవని పేర్కొంది. దీనివల్ల డాలర్లకున్న కృత్రిమ డిమాండ్‌ తగ్గిడంతో రూపాయికి బలం చేకూరింది. తద్వారా రూపాయి విలువ పెరిగే అవకాశం ఉండవచ్చు. కాకపోతే పెరిగే ఛాన్స్ ఉండవచ్చు.

ALSO READ: పసిడి ప్రేమికులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఇవే!

మార్చి 30న రూపాయి మారకం విలువ 94.83 వద్ద ఉంది. ఇది ఆల్ టైమ్ హైయిస్ట్ కూడా. మార్చి 31న మహావీర్ జయంతి కావడంతో మార్కెట్ మూతపడింది. ఏప్రిల్ ఒకటిన బ్యాంకుల ఖాతాల వార్షిక ముగింపు కావడంతో ఫారెక్స్ మార్కెట్ మూసి వేశారు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం అవుతుందని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. దీంతో ఆసియా మార్కెట్లు, కరెన్సీలు గురవారం ఉదయం నుంచి బలహీనపడ్డాయి.

అయినప్పటికీ రూపాయి బలంగా నిలిచింది. బ్యాంకుల నెట్ ఓపెన్ రూపాయి పొజిషన్లపై ఆర్బీఐ 100 మిలియన్ డాలర్ల పరిమితి విధించింది. ఈ చర్య రూపాయికి మద్దతుగా నిలిచింది. రూపాయిని స్థిరీకరించేందుకు ఆర్‌బీఐ వద్ద 700 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ మారక నిల్వలు ఉన్నాయన్నది నిపుణుల మాట. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత రూపాయికి కాలం కలిసొచ్చింది.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×