Actor Jayaseelan: కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. నటుడు జయశీలన్ (40) అనారోగ్యంతో కన్నుమూశాడు. గత రెండు నెలలుగా కామెర్లు వ్యాధితో బాధపడుతున్నజయశీలన్ చెన్నైలోని స్టాన్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కామెర్లు ముదిరిపోవడంతో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. జయశీలన్ సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాడు. విలన్ గ్యాంగ్ లో ఒకడిగా ఎన్నో సినిమాల్లో నటించాడు.
నటుడు ధనుష్ నటించిన పుదుపేట్టై, విజయ్ నటించిన తేరి, బిగిల్, విజయ్ సేతుపతితో విక్రమ్ వేద వంటి అనేక చిత్రాలలో సహాయ పాత్రలు పోషించిన జయశీలన్ కొన్ని సినిమాలో సహాయక పాత్రల్లో కూడా నటించి మెప్పించాడు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న అతను ఇంత చిన్న వయస్సులోనే మృతి చెందడం ఎంతో కలిచివేస్తుందని ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. రేపు వాషర్‌మన్‌పేటలోని అతని ఇంట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Game Changer: గేమ్ ఛేంజర్ ఫైరసీ.. చేసింది వారే.. పక్కా సాక్ష్యాలతో.. ?
ఇప్పటివరకు 100కు పైగా సినిమాల్లో నటించినా జయశీలన్ ఇంకా తనని గుర్తించే పాత్ర దక్కలేదనీ, సినిమాల్లో తాను అనుకున్న స్థాయికి వెళ్ళడానికి ఎంతో కష్టపడేవాడని బంధువులు చెప్పుకొస్తున్నారు. 40 ఏళ్ల వయసున్న జయశీలన్ ఆకస్మిక మరణం ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపింది.
ఇక ఇండస్ట్రీలో జయశీలన్ కు మంచి ఫ్రెండ్ హీరో విజయ్ సేతుపతి. వీరిద్దరూ కలిసి విక్రమ్ వేద సినిమాలో నటించారు. దానికన్నా ముందు నుంచే వీరి మధ్య స్నేహం ఉందని తెలుస్తోంది. ఇక ఫ్రెండ్ మరణవార్త విన్న విజయ్ సేతుపతి.. రేపు వారి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించనున్నారని సమాచారం. సినిమాలో మంచి పేరు తెచ్చుకున్నాకే జయశీలన్ వివాహం చేసుకుంటాను అనేవాడట. పెళ్లి కాకుండానే ఇలా మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు.