BigTV English

New Ration Card Process : కొత్త రేషన్ కార్డు కావాల్సిన వాళ్లు ఇలా ఆన్‌లైన్లో అప్లై చేయండి..

New Ration Card Process : కొత్త రేషన్ కార్డు కావాల్సిన వాళ్లు ఇలా ఆన్‌లైన్లో అప్లై చేయండి..

New Ration Card Process : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డుల్ని అందించాలని భావిస్తోంది. రాష్ట్రంలో చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న కొత్త కార్డుల జారీని తిరిగి ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే.. మార్గదర్శకాలు కూడా జారీ చేయగా.. జనవరి 26 నుంచి కొత్త కార్డుల జారీ ప్రారంభం కానుంది. ఇందుకోసం.. గ్రామ సభలను నిర్వహించడం, ఇంటింటి సర్వే నిర్వహించడం ద్వారా లబ్ధిదారుల్ని గుర్తించింది. దాంతో పాటే.. పౌరులు నేరుగా ఆన్ లైన్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.


తెలంగాణ ప్రభుత్వ అధికారిక పేజీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  ప్రభుత్వ కార్యాలయాల దగ్గర విపరీతమైన రద్దీ ఉన్న నేపథ్యంలో.. పనులన్నింటినీ పక్కన పెట్టి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండానే ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులు బాటు కల్పించింది. ప్రభుత్వం దగ్గరున్న ప్రాథమిక సమాచారం మేరకు లక్షల సంఖ్యలో నూతన దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు. కాగా.. గణతంత్య్ర దినోత్సవం నుంచి నాలుగు పథకాలు ప్రారంభం కానున్నాయి.

కొత్త రేషన్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి :


దరఖాస్తుదారులు కొత్త రేషన్ కార్డు దరఖాస్తులను https://meeseva.telangana.gov.in/meeseva/registration.html లో సమర్పించవచ్చు.

పేరు, చిరుమానా, అడ్రస్ నిర్ధరణ కోసం ప్రభుత్వం చూసించిన ఆధార్ కార్డ్, ఈ- మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, విద్యుత్ బిల్లు, చిరునామా రుజువు, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఇలా ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయండి..

  • దరఖాస్తుదారులు పైన పేర్కొన్న అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ఆన్‌లైన్ దరఖాస్తుల ఎంపిక ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  • కొత్త రేషన్ కార్డు కోసం రిజిస్ట్రేషన్ ఫారమ్ వస్తుంది. అందులో ప్రభుత్వానికి అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • దరఖాస్తుదారులు అన్ని వివరాలు పూరించిన తర్వాత దాన్ని చివర్లో సరిచూసుకుని సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు.. మీ దరఖాస్తు విజయవంతంగా అప్ లోడ్ అయినట్లు కనిపిస్తుంది. ఏదైనా సమస్య కారణంగా దరఖాస్తు పూర్తి కాకపోతే స్క్రీన్ పై కనిపిస్తుంది. ఏవైనా కారణాలతో పూర్తి కాకపోతే మళ్లీ మొదటి నుంచి చేయాల్సి ఉంటుంది.

Also Read : రాష్ట్రంలో 44 లక్షల మందికి ఇల్లు కావాలి.. ఈ ఏడాది ప్రభుత్వ టార్గెట్ ఎంతంటే..

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×