BigTV English
Advertisement

Nagababu :‘జబర్దస్త్’లోకి నాగబాబు రీ ఎంట్రీ.. రోజాకు ఘోర అవమానం?

Nagababu :‘జబర్దస్త్’లోకి నాగబాబు రీ ఎంట్రీ.. రోజాకు ఘోర అవమానం?

Nagababu: బుల్లితెరపై అతిపెద్ద కామెడీ షో గా ప్రేక్షకులను సందడి చేసిన కార్యక్రమాలలో జబర్దస్త్ (Jabardasth) ఖతర్నాక్ కామెడీ షో ఒకటి. ఈ కార్యక్రమం గత దశాబ్దకాలం పైగా ప్రసారమవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ కార్యక్రమం ప్రారంభంలో రోజా(Roja), మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) జడ్జిలుగా వ్యవహరించేవారు. అయితే కొన్ని కారణాలవల్ల నాగబాబు ఈ కార్యక్రమం నుంచి తప్పుకోగా, రోజా కూడా తనకు మంత్రి పదవి రావడంతో ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. ఇలా ఈ ఇద్దరు వెళ్లిపోవడంతో ఎంతోమంది ఈ కార్యక్రమంలో జడ్జెస్ గా పాల్గొని సందడి చేశారు. అయితే తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.


కనిపించని రోజా?

ఈ ప్రోమో చూస్తుంటే నవ్వుల రారాజు.. మెగా బ్రదర్ నాగబాబు రీ ఎంట్రీ (Nagababu Re entry) ఇచ్చారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం విజయవంతంగా 700 ఎపిసోడ్స్, 12 సంవత్సరాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో నాగబాబు తిరిగి ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అయితే ఈయన గెస్ట్ గా వచ్చారా? లేదా పర్మినెంట్ గా ఈ కార్యక్రమంలో కొనసాగుతారా? అనేది స్పష్టత లేదు. జబర్దస్త్ అనగానే రోజా, నాగబాబు గుర్తుకొస్తారు కానీ, తాజాగా విడుదల చేసిన ప్రోమోలో నాగబాబు మాత్రమే కనిపించి రోజా కనిపించకపోవడంతో అభిమానులకు ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. రోజాను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదా? ఆహ్వానించిన ఆమె రానని చెప్పారా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా రోజా ఈ కార్యక్రమంలో లేకపోవడంతో ఆ వెలితి స్పష్టంగా కనిపిస్తుందని, ఆమెను ఆహ్వానించకుండా అవమానించారు అంటూ అభిమానులు వాపోతున్నారు.


ఆనందపడాలే కానీ.. ఆశ్చర్యపోతున్నారేంట్రా..

ఇక ఈ ప్రోమో వీడియోలో భాగంగా నాగబాబు మాట్లాడుతూ…”కావలసిన వాళ్లు వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ… ఆశ్చర్యపోతున్నారేంట్రా క్యూయా… మనల్ని ఎవడ్రా ఆపేదంటూ”? నాగబాబు అందరిలో ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తించారు. ఇక ఈ ప్రోమో వీడియోలో భాగంగా హైపర్ ఆది వంటి వారు తమకు జబర్దస్త్ కార్యక్రమంలో లైఫ్ ఇచ్చినటువంటి సీనియర్ కమెడియన్లకు పాదాలు కడిగి, వారిని ఎంతో ఘనంగా సత్కరించినట్టు తెలుస్తోంది. మొత్తానికి నాగబాబు ఈ కార్యక్రమానికి రీఎంట్రీ ఇచ్చారనే విషయం అభిమానులకు, అలాగే జబర్దస్త్ కమెడియన్స్ కు సరికొత్త ఉత్సాహాన్ని కలిగించిందని చెప్పాలి. అయితే నాగబాబు 12 సంవత్సరాల జబర్దస్త్ మెగా సెలబ్రేషన్స్ కార్యక్రమంలో మాత్రమే పాల్గొంటున్నారా? లేకపోతే ప్రతివారం ఈ కార్యక్రమానికి జడ్జిగా కొనసాగుతారా? అనేది తెలియాల్సి ఉంది.

ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమానికి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తుండగా మరోవైపు కృష్ణ భగవాన్, శివాజీ, సింగర్ మను వంటి వారందరూ జడ్జెస్ గా మారుతూ వచ్చారు. ఇక నాగబాబు, రోజా జడ్జిగా ఉన్న సమయంలో ఈ కార్యక్రమానికి అద్భుతమైన రేటింగ్ ఉండేదని చెప్పాలి. అయితే మల్లెమాల వారితో వచ్చిన భేదాభిప్రాయాల కారణంగానే నాగబాబు ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి కానీ, ఈ వార్తలపై ఎలాంటి స్పష్టత లేదు. ఏది ఏమైనా నాగబాబు తిరిగి జబర్దస్త్ కార్యక్రమంలోకి అడుగుపెట్టడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. అయితే నాగబాబు ప్రస్తుతం జనసేన ఎమ్మెల్సీగా(Janasena MLC) కూడా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే.

Also Read: Priyanka -Shiva Kumar: పెళ్లికి ముందే హనీమూన్.. వెళ్తే తప్పేంటీ?

Related News

GudiGantalu Today episode: ఇంటి కోసం బాలు మాస్టర్ ప్లాన్.. ప్రభావతికి షాక్..మనోజ్ కు రోహిణి బంఫర్ ఆఫర్..

Malli Serial : ‘మల్లి ‘ హీరోయిన్ లాస్య చూడ్డానికి సాఫ్ట్.. స్పీడు తట్టుకోవడం కష్టమే సుమీ..!

Today Movies in TV : మంగళవారం మోస్ట్ యాక్షన్ మూవీస్.. అస్సలు మిస్ అవ్వకండి..

Hyper Aadi: సీరియల్ నటిపై హైపర్ ఆది బాడీ షేమింగ్ .. బండ ఆంటీ అంటూ!

DSP: బాబునే మెస్మరైజ్ చేసిన డీఎస్పీ.. మామూలు ముదురువి కాదయ్యో!

Illu Illalu Pillalu Today Episode: రామరాజు ఇంట దీపావళి పూజ.. ధీరజ్ ప్రేమ గొడవ.. పోలీసుల ఎంట్రీ.. ప్రేమ కన్నీళ్లు..

Intinti Ramayanam Today Episode: చక్రధర్ కు షాకిచ్చిన కమల్.. పల్లవికి క్లాస్ పీకిన పార్వతి.. అక్షయ్ కు అవని సపోర్ట్..

Brahmamudi Serial Today October 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: డాక్టర్‌ చేత అబద్దం చెప్పించిన కావ్య – నిజం తెలుసుకున్న రాజ్‌  

Big Stories

×