OTT Movie : మలయాళం సినిమాలు ఎక్కువగా గ్రామీణ వాతావరణంలో జరుగుతుంటాయి. అందమైన ప్రదేశాలు కూడా ఇక్కడి సినిమాలాకి ప్లస్ అవుతోంది. రీసెంట్ గా వచ్చిన ఒక సినిమా, డిఫరెంట్ స్టోరీతో ఆకట్టుకుంటోంది. ఈ కథలో ఒక గ్రామంలో పెళ్ళిళ్ళు చెడగొట్టే సాంప్రదాయం ఉంటుంది. ఎక్కువ పెళ్ళిళ్ళు చెడగొట్టిన వాళ్ళకి అవార్డ్ లు కూడా ఇస్తుంటారు. క్లైమాక్స్ వరకు సరదాగా ఈ కథ సాగిపోతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘వత్సల క్లబ్’ (Valsala Club) 2025లో విడుదలైన మలయాళం కామెడీ సినిమా. అనుష్ మోహన్ డైరెక్ట్ చేశాడు. ఇందులో మెయిన్ కాస్ట్‌లో కార్తీక్ శంకర్, అఖిల్ కవలయూర్, రూపేష్ పీతాంబరన్, గౌరి ఉన్నిమాయ, అధిరాధ్ కె. ప్రధాన పాత్రల్లో నటించింది. ఈ సినిమా 2 గంటల నిడివి ఉన్న ఈ సినిమా 2025 సెప్టెంబర్ 26న థియేటర్స్‌లో విడుదలైంది. అక్టోబర్ 19 నుండి మనోరమా మాక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
సినిమా కేరళలోని ఒక చిన్న విలేజ్‌లో మొదలవుతుంది. అక్కడ పెళ్లిళ్లను ఆపడం ఒక సరదా ట్రెడిషన్ లాంటిది. విలేజ్ ప్రజలు పెళ్లి సమయంలో కొంటె ప్లాన్స్ వేసి, ప్రాంక్స్‌తో పెళ్లిళ్లను డిస్టర్బ్ చేస్తుంటారు. ఇది ఒక ఆటలాగా ఉంటుంది. ఏడాది చివరిలో ఎవరైతే ఎక్కువ పెళ్లిళ్లను ఆపుతాడో వాళ్ళకి బెస్ట్ అవార్డ్ కూడా ఇస్తుంటారు. అరవిందన్ అనే వ్యక్తి ఈ విలేజ్‌లో బెస్ట్ అవార్డ్ ను గెలిచిన వ్యక్తి. చాలా పెళ్లిళ్లను అతను ఫన్నీగా ఆపేశాడు. అక్కడ అందరూ అతనికి రెస్పెక్ట్ కూడా ఇస్తారు. కానీ ఇప్పుడు అతని కొడుకు పెళ్లి ఫిక్స్ అవుతుంది. అరవిందన్ ఈ పెళ్లిని కూడా చెడగొట్టాలని ప్లాన్ చేస్తాడు. ఎందుకంటే అది అతని గౌరావానికి సంబంధించినది.
Read Also : అర్ధరాత్రి అఘోరా దిక్కుమాలిన పని… అమ్మాయి శవాన్ని వదలకుండా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్
అదే సమయంలో, వత్సల క్లబ్ అనే యంగ్ గ్రూప్, ఈ ట్రెడిషన్‌ను ఎండ్ చేయాలని అనుకుంటుంది. వీళ్లు యంగర్ జెనరేషన్, ఈ పాత ట్రెడిషన్ సిల్లీ అని ఫీల్ అవుతారు. వాళ్లు అరవిందన్‌తో నీ కొడుకు పెళ్లిని మేం జరిగేలా చేస్తాం. లేదంటే మా క్లబ్ ను మూసివేస్తాం అని ఒక బెట్ వేస్తారు. ఇక వత్సల క్లబ్ మెంబర్స్ అరవిందన్ ప్లాన్స్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రాసెస్ చాలా ఫన్నీగా జరుగుతుంది. చివరికి వత్సల క్లబ్ ఈ పాత ట్రెడిషన్ ని బ్రేక్ చేస్తుందా ? ఈ పందెంలో ఎవరు గెలుస్తారు ? అరవిందన్ కొడుక్కి పెళ్లి జరుగుతుందా ? అనే విషయాలను, ఈ మలయాళం సినిమాని చూసి తెలుసుకోండి.