Priyanka – Shiva Kumar: బుల్లితెర నటీ నటులు ప్రియాంక జైన్(Priyanka Jain), శివకుమార్ (Shiva Kumar)గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మౌనరాగం(Mounaragam) సీరియల్ ద్వారా వీరిద్దరూ జంటగా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సీరియల్ సమయంలోనే ఈ జంట ప్రేమలో పడిన విషయాన్ని బయట పెట్టారు. ఇలా గత ఐదు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండా ఒకే ఇంట్లో కలిసి ఉంటూ పెద్ద ఎత్తున వెకేషన్ లకు వెళ్తూ హంగామా చేస్తున్నారు. ఇలా పెళ్లికి ముందే హనీమూన్(Honey Moon) ప్రెగ్నెన్సీ అంటూ ఇటీవల విడుదల చేసిన వీడియోలు కూడా భారీ స్థాయిలో విమర్శలకు గురి చేశాయి.
సహజీవనం చేస్తే తప్పేముంది…
ఇలా ఇద్దరి సహజీవనం(Living in Relation) గురించి ఎన్నో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ జంట ఈ విమర్శలపై స్పందించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరికి సహజీవనం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. తాము మౌనరాగం సీరియల్ సమయంలోనే ప్రేమలో పడ్డాము అయితే ఈ విషయాన్ని మేము ముందుగా మా కుటుంబ సభ్యులకు తెలియజేశామని తెలిపారు. మా నిర్ణయం చెప్పడంతో మా కుటుంబ సభ్యులు కూడా మీ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఇలా కుటుంబ సభ్యుల అనుమతితోనే మేము సహజీవనం చేస్తున్నాము.
మేము ఏంటో మాకు తెలుసు..
మేము ఒకరి కోసం మరొకరు జీవితాంతం కలిసుండాలనే గట్టి నిర్ణయం తీసుకున్నప్పుడు సహజీవనం చేస్తే తప్పేంటి? మేము ఎలా ఉండాలీ? మా పరిధి ఏంటో మాకు తెలుసు. ఇటీవల కాలంలో పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు కూడా విడాకులు తీసుకొని విడిపోతున్నారు. వారి విషయంలో లేని తప్పు జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకొని సహజీవనం చేయడంలో తప్పులేదని తెలిపారు. ఇక యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసమే అలాంటి టైటిల్స్ పెట్టాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇలా ఐదు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా తెలిపారు.
త్వరలోనే పెళ్లి ప్రకటన..
పెళ్లి గురించి మాకంటూ కొన్ని కలలు ఉన్నాయి, మా పెళ్లి ఎలా చేసుకోవాలో మేము ప్లాన్ చేసుకున్నామని, మేం ప్లాన్ చేసుకున్న విధంగా పెళ్లి జరగాలి అంటే కొంత సమయం పడుతుందని, అతి త్వరలోనే మా పెళ్లి గురించి శుభవార్త కూడా తెలియజేస్తామని వెల్లడించారు. ఇక శివకుమార్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన బుల్లితెర సీరియల్స్ తో పాటు ఇతర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. మరోవైపు ప్రియాంక జానకి కలగనలేదు సీరియల్ ద్వారా చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సీరియల్ తర్వాత బిగ్ బాస్(Big Boss) హౌస్ లోకి వెళ్లిన ఈమె బిగ్ బాస్ తర్వాత సీరియల్స్ చేయకపోయినా బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: శివ్ పై కంప్లైంట్ చేసిన ప్రియాంక… ఈ జంట విడిపోతుందా ?