Malli Serial : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఈ మధ్య తెలుగు వాళ్ళ కన్నా కన్నడ ముద్దుగుమ్మలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీ గా మారిపోయింది. అయితే కొంతమంది తెలుగు అమ్మాయిలు కూడా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. అలాంటి వారిలో సీరియల్ హీరోయిన్ మళ్లీ అలియాస్ భావన లాస్య ఒకరు.. ఈమె ఈ మధ్య షోలలో కనిపిస్తూ సందడి చేస్తుంది. ఏ షోలో అయినా కానీ ఆమె అడుగుపెడితే అల్లరి అంత ఇంత ఉండదు.. లాస్య చూడ్డానికి చాలా సాఫ్ట్ గా అమాయకురాల్లాగా కనిపిస్తుంది.. కానీ లోపల మాత్రం వేరే అని చాలా షోలలో నిరూపించింది.. సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్తే మెంటలెక్కిపోవాల్సిందే.. బెంగాల్ టు వైజాగ్ కి షిఫ్ట్ అవ్వడం వెనుక ఉన్న అసలు స్టోరీని మనం తెలుసుకుందాం..
లాస్య గురించి తెలిసిన వాళ్ళు ఆమె స్పీడును తట్టుకోవడం కష్టమే అని అనక మానరు. ఇది మాత్రం 100% నిజం.. ఈమధ్య ఈమె ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ చేసే అల్లరి అంత ఇంత కాదు. అందుకే లాస్య స్పీడ్ కి బ్రేక్ చేయడం కష్టమే అంటూ చాలా సందర్భాల్లో చాలా మంది అన్నారు. ఇటీవల పలు చానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తన గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేస్తూ వస్తుంది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె బాత్రూం విషయాలను పంచుకుంది. ప్రస్తుతం అది హాట్ టాపిక్ అవుతుంది. ఎవరైనా బాత్రూంకి వెళ్తే సోప్ లేదా టవల్ లేదా ఈమె బ్లూటుత్ లేకుండా అస్సలు స్నానం చేయదట. ఇది విన్న చాలా మంది నెటిజెన్లు భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు. ఇదేం పిచ్చి తల్లి నీకు అంటూ ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా కూడా సీరియల్ లో కనిపించే లాస్యకి బయట కనిపించే లాస్యకి చాలా వ్యత్యాసం ఉందన్న మాట మాత్రం వాస్తవం..
Also Read : మంగళవారం మోస్ట్ యాక్షన్ మూవీస్.. అస్సలు మిస్ అవ్వకండి..
కొందరు కష్టపడి సినిమాల్లో నటించాలని ప్రయత్నాలు చేస్తారు. కానీ కొందరు మాత్రం అదృష్టం తలుపు తట్టినట్లు అనుకోకుండా ఛాన్స్ వస్తుంది. అలానే ఈ అమ్మడుకు కూడా సీరియల్ లో నటించే ఛాన్స్ వచ్చేసింది. ఇక ఈమె బెంగాల్ లో పుట్టినా వైజాగ్ లో పెరిగింది. ఈమె తండ్రి రైల్వే ఉద్యోగి. కెనడాలో ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేయాలి అనే కల ఉంటుంది. కానీ అనుకోకుండా సీరియల్ లో అవకాశం వచ్చింది.. సోషల్ మీడియాలో ఈమెను చూసి స్టార్ మా సెలెక్ట్ చేసుకొని కాల్ చేశారు. అలా అవకాశం వచ్చింది. దాంతో సీరియల్లో నటించడానికి వచ్చేసింది. మళ్లీ సీరియల్ లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ప్రస్తుతం మరో సీరియల్ లో నటించడానికి రెడీ అవుతుంది. మొత్తానికి ఈమె తెలుగమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది.