Gundeninda GudiGantalu Today episode October 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు పడిపోతూ ఉంటే సత్యం వచ్చి పట్టుకుంటాడు. ఏంట్రా తాగొచ్చావా అని అంటాడు. నేను బాధతోనే తాగానని చెప్పు మీనా.. కావాలని తాగలేదు అని బాలు మీనాతో అంటాడు. ఎందుకురా ఇలా చిన్న విషయాలని పట్టించుకోని నీలో నువ్వే మదన పడిపోతూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు అని సత్యం అంటాడు. అప్పుడే వీళ్లిద్దరి మాటలు విన్న ఇంట్లోని వాళ్ళందరూ కిందకి వస్తారు. మళ్లీ బాలు తాగొచ్చాడు అని అనగానే మీనా పెద్ద క్లాస్ పీకుతుంది. ప్రభావతి సార్ గుర్రం ఎక్కి వచ్చాడు. ఏంటి ఈ మధ్య లేదు అనుకున్నాను. కానీ మళ్లీ ఎక్కాడే అని వెటకారంగా మాట్లాడుతుంది. శృతి రవీతో మీ అన్నయ్య తాగేసి వచ్చాడు అంటుంది.. ఒక పెద్ద మనిషిని అవమానించాడు అని ప్రభావతి అంటుంది. ఆ మాట వినగానే మీనా రెచ్చిపోతుంది. మా ఆయనను అంటే ఊరుకోను అని మీనా అందరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నాన్న రూమ్ కట్టాలని అనుకున్నాడు కదా ఆ రూమ్ కి డబ్బులు ఇవ్వాలని ఇలా చేస్తున్నాడేమో అని మనోజ్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ మావయ్య మాకు రూమ్ కట్టించేదేంటి మా ఆయనే మాకు రూమ్ కట్టిస్తాడు. అప్పుడు బంగారం కొనిస్తాడు అంతవరకు వేసుకొని అని అన్నారు… ఇప్పుడు మళ్లీ రూమ్ కట్టిస్తాడు అని అంటున్నావు ఇవి తీరినట్టే అని ప్రభావతి పెట్టుకోరంగా మాట్లాడుతుంది. మీనా మాత్రం మా ఆయన రూమ్ కట్టిస్తాడు అని శబదం చేస్తుంది. బాలు మీనా దగ్గరికి వచ్చి నువ్వు ఇలా అంటుంటే నాకు మాత్రం భయంగా ఉంది అని అంటాడు. ఇంకొక కారు కొని దాన్ని రెంటిగిద్దాం. అప్పుడు మనకి డబ్బులు వస్తాయి కదా అని మీనా అంటుంది.
మీ ఒంటిమీద బంగారు ఉంటే వాటిని తాకట్టు పెట్టి కారు కొనేవాన్ని కానీ ఇప్పుడు అవి కూడా లేవు కదా అని బాలు అంటాడు.. మీ అమ్మని అడిగి మళ్ళీ తీసుకుందామని అంటుంది మీనా.. మా అమ్మని అడిగి తీసుకుంటే మళ్ళీ చులకన చేస్తుంది ఏదో ఒక దారిందేమో నేనే చూస్తాను అని బాలు అంటాడు. కాసేపటి తర్వాత బాలు మీనాకు ఫోన్ చేసి బయటకు రమ్మని అంటాడు.. మీనా ఈ పని అంతా వదిలేసి బయటికి వెళ్తే మీ అమ్మ అసలు ఒప్పుకోదు అని అంటుంది. కాసేపు ఏం కాదులే ఒకసారి బయటికి రా అనేసి అంటాడు. అయినా వెళ్తుంటే ప్రభావతి అడ్డుపడి ఆపుతుంది. కానీ మీనా ఆయనే లోపలికి రమ్మంటాను అనగానే ప్రభావతి పంపిచేస్తుంది.
బయటకు వెళ్లగానే బాలు మనం ఇల్లు కట్టడానికి ఈ రోజు ఒక ప్లాన్ చేశాను అది సక్సెస్ అయింది అని చెప్తాడు. ఏంటి ఆ ప్లాను అని నేను అడుగుతుంది. నేను ఒక కస్టమర్ నీ డ్రాప్ చేశాను ఆయనది ఇటుకల వ్యాపారం డబ్బుకు బదులు ఇటుకలు అడిగాను అని అంటాడు. ఇటుకలను పైన పెట్టాలని తీసుకొని వెళ్తారు.. ప్రభావతి ఏంటవి అని అడుగుతుంది. కనిపించట్లేదా ఇటుకలు ఎక్కువ మాట్లాడకు మీనా చేతిలో ఇటికలు ఉన్నాయి కొడుతుంది అని ప్రభావతిని భయపెడతాడు బాలు. ఏంటి ఆ రౌడీలను కొట్టినట్టు నన్ను కూడా కొడుతుందని ప్రభావతి భయపడుతుంది..
ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ పోతే మీరు షష్టిపూర్తి అయిన తర్వాతే ఇల్లు కట్టుకుంటారు అని ప్రభావతి అంటుంది.. అంత టైం మా కోసం లేదు మేము ఖచ్చితంగా ఇంటిని కట్టి చూపిస్తామని బాలు మీనా అంటారు.. సత్యం మీనా బాలుకి సపోర్ట్ చేస్తాడు. ఇద్దరు కలిసి ఇటుకలను పైన పెట్టేసి ఇంటిలో గదిని ఎలా కట్టాలి అని లెక్కలు వేస్తారు. మనోజ్ షాప్ లో ఉండగా రోహిణి అక్కడికి వెళుతుంది.. మాకు తెలిసిన ఒక క్లైంట్ చిన్న ఫంక్షన్ ఉందంట రిసార్ట్ లో మనకు ఒక రూమ్ కూడా ఇచ్చారు. అక్కడికి వెళ్దామా అని అడుగుతుంది..
మనిద్దరం ఏకాంతంగా గడపొచ్చు. ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు అని రోహిణి మనోజ్ కి బంపర్ ఆఫర్ ఇస్తుంది. అయితే నేనెప్పుడు దగ్గరకు వచ్చినా నువ్వు దగ్గరకు రానియ్యవు ఇలాంటి ఆఫర్ ఇస్తుంటే నేనెందుకు కాదంటాను అలానే వస్తాను అని మనోజ్ అంటాడు.. ఆ మాట ఒప్పుకున్నా కాసేపటికి ఒక ఫోన్ కాలుస్తుంది. మాకు ఫర్నిచర్స్ కావాలి అనేసి అడగగానే మనోజ్ మీరెప్పుడొచ్చినా ఇస్తామండి అని సంతోష్ పడతాడు. దాంతో రోహిణి ఆఫర్ ని రిజెక్ట్ చేసేస్తాడు. ఇంకొకసారి మనం వెళ్దాం లే అనేసి అంటాడు.. మనోజ్ షాపుకి ఫర్నిచర్స్ కొనడానికి వస్తున్నారని స్టాప్ తో చెప్తాడు.
Also Read :‘మల్లి ‘ హీరోయిన్ లాస్య చూడ్డానికి సాఫ్ట్.. స్పీడు తట్టుకోవడం కష్టమే సుమీ..!
శృతి డబ్బింగ్ చెప్పి చెప్పి నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. నావల్ల కావట్లేదు ఇంకా జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను అని అంటుంది.. అంతసేపు నిలబడుకునే బదులు కాసేపు కూర్చోవచ్చు కదా అని రవి అంటాడు. ఎపిసోడ్ మొత్తం పూర్తవ్వాలి అని నిల్చోని పూర్తి చేసేసాను అందుకే నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని రోహిణి అంటుంది. నా కాళ్ళు నొక్కువా రవి అని బతిమిలాడుతుంది. రవి శృతి కాలు నొక్కడం ప్రభావతి చూస్తుంది. కొడుకుని పనిమనిషి చేసేసింది అని బాధపడుతూ ఉంటుంది. వాళ్ల రూమ్ లోకి వెళ్లి ఏంటి ఏం చేస్తున్నావని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మనోజ్ దారుణంగా మోసపోతాడు. ఆ విషయం గురించి ఇంట్లో చెప్తాడా లేదా అన్నది చూడాలి..