Illu Illaalu Pillalu : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో కొన్ని సీరియల్స్ కొత్తగా వచ్చి కూడా మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అందులో ఇటీవల స్టార్ట్ అయిన స్టార్ మా సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా ఒకటి. ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ నీ పరిచయం చేయడంలో స్టార్ మా ముందు ఉంటుంది అన్న విషయం తెలిసిందే.. ఈ సీరియల్లో బుల్లితెర హీరో ప్రభాకర్, సీనియర్ హీరోయిన్ ఆమని జంటగా నటిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ కొత్త సీరియల్ ప్రస్తుతం సక్సెస్ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ లో మెయిన్ రోల్ లో నటిస్తున్న ఆమని రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకోవాలని బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. కొందరైతే సినిమాల్లో ఇచ్చే అంతా సీరియల్స్ కూడా ఇస్తున్నారని గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. నిజానికి ఆమని రెమ్యూనరేషన్ ఎంతో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
సీరియల్ కు ఆమని రెమ్యూనరేషన్..
సీనియర్ హీరోయిన్ ఆమని ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. స్టార్ హీరోలు అందరు సరసన నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు ఎన్నో అవార్డులను అందుకుంది.. ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈమె సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడంతో పాటుగా బుల్లితెర పై సీరియల్స్లలో నటిస్తుంది.. అయితే సినిమాలకి ఇస్తున్నారు రెమ్యూనిరేషన్ సీరియల్కు ఈమెకు దక్కుతుందా? సినిమా లేక సీరియల్స్ లుక్ తక్కువ అమౌంట్ కి చేస్తుందా? ఇలాంటి ప్రశ్నలు జనాల్లో వినిపిస్తున్నాయి.. మరి ఆమని రెమ్యూనరేషన్ ఎంత అన్నది ఆసక్తిగా మారింది. నిజానికి ఆమనికి సీరియల్స్ కు తక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటుందని తెలుస్తుంది.. ఒక్కరోజుకు ఆమెకు రెమ్యూనరేషన్ 30,000 వరకు తీసుకుంటుందని టాక్.. అంటే నెలకు 10 లక్షల వరకు తీసుకుంటుందని సమాచారం.. అలాగే చైన్నై లో ఉంటున్న ఈమెకు ట్రావెల్ ఖర్చులు కూడా ప్రొడక్షన్ వాళ్ళే సపరేట్ గా తీసుకుంటుందట..
ఆమని పర్సనల్ విషయానికొస్తే..
టాలీవుడ్ హీరోయిన్ ఆమని ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసింది.. ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న హీరోలు అందరి సరసన జోడిగా నటించింది. నటనపై ఆసక్తి ఉన్న ఆమని సినిమాల్లో కి వచ్చింది అన్న విషయాన్ని ఈ మధ్య ఇంటర్వ్యూలో బయటపెట్టింది. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె తమిళ నిర్మాతను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆయన చేస్తున్న సినిమాలు ప్లాప్ అవడంతో, అలాగే కొన్ని కుటుంబ కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఆమెని భర్తకు దూరంగా తన పిల్లలతో జీవిస్తుంది. ఇటీవల యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గురించి సంచల విషయాలని ఆమని అభిమానులతో పంచుకుంది. ఆయనతో విడిపోవడానికి గల కారణాలను ఆమె బయట పెట్టింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి.. ఈమధ్య వరుస సినిమాలలో కూడా నటిస్తుంది.. క్యారెక్టర్ కు వెయిట్ ఉన్న పాత్రలను చేస్తూ నటిగా బిజీగా గడుపుతుంది ఆమని..