Chahal -CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… బుధవారం రోజున చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ 49వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వాళ్ళ సొంత గడ్డపై ఓడించింది పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ చెన్నై లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమైంది. ఈ మ్యాచ్ ప్రారంభమైన నుంచి ఈ చివరి వరకు పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు అద్భుతంగా రాణించారు. ఈ దెబ్బకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై పంజాబ్ కింగ్స్ ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.
Also Read: RCB Captain In Tirumala: తిరుమలలో RCB ప్లేయర్ల పూజలు.. ‘ఈ సాలా కప్ నామ్దే’
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నుంచి తప్పకుండా చెన్నై సూపర్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ చేతిలో దారుణంగా ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఇంటిదారి పట్టింది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది చెన్నై సూపర్ కింగ్స్. ఆడిన 10 మ్యాచ్లలో మొత్తం ఎనిమిది మ్యాచ్లలో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు… రెండు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన మ్యాచ్లో గెలిచినా కూడా… చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ దశకు చేరుకునే అవకాశాలు లేవు. దీంతో అధికారికంగానే ఐపిఎల్ 2025 టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది చెన్నై సూపర్ కింగ్స్. ఇలా ఐపిఎల్ 2025 టోర్నమెంటులో వైదొలిగిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు సృష్టించింది.
Also Read: Rohit Sharma – Sofia: ఆ హాట్ బ్యూటీతో రోహిత్ శర్మ రిలేషన్.. పాపం రితికా సజ్దే !
ఐపీఎల్ లో చాహల్ హ్యాట్రిక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ చాహల్ అరుదైన రికార్డు సృష్టించాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై జరిగిన మ్యాచ్లో పంజాబ్ బౌలర్ చాహాల్ ఈ సీజన్ లో మొదటి హ్యాట్రిక్ సాధించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ లో చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. కంబోజ్, హుడా, నూర్ అహ్మద్ వికెట్లను వరుసగా తీశాడు. దీంతో ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఇదే ఓవర్లు మహేంద్ర సింగ్ ధోని వికెట్ కూడా పడగొట్టాడు.
ఐపీఎల్‌లో భారతీయులు హ్యాట్రిక్‌లు:
లక్ష్మీపతి బాలాజీ vs PBKS, 2008
అమిత్ మిశ్రా vs DC, 2008
యువరాజ్ సింగ్ vs RCB, 2009
రోహిత్ శర్మ vs MI, 2009
ప్రవీణ్ కుమార్ vs RR, 2010
అమిత్ మిశ్రా vs PBKS, 2011
అజిత్ చండిలా vs PWI, 2012
అమిత్ మిశ్రా vs PWI, 2013
ప్రవీణ్ తాంబే vs KKR, 2014
అక్షర్ పటేల్ vs GL, 2016
జయదేవ్ ఉనద్కత్ vs SRH, 2019
శ్రేయాస్ గోపాల్ vs RCB, 2019
హర్షల్ పటేల్ vs MI, 2021
యుజ్వేంద్ర చాహల్ vs KKR, 2022
యుజ్వేంద్ర చాహల్ vs CSK, 2025
YUZVENDRA CHAHAL – ONE OF THE GREATEST IN IPL 👑
– Second Hat-trick in his IPL Career. pic.twitter.com/SAvQXa7wcu
— Johns. (@CricCrazyJohns) April 30, 2025