RTC Charges: హైదరాబాద్ మహానగర ప్రయాణికులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ మహానగరంలో ఆర్టీసీ బస్సుల చార్జీలు ( RTC Charges ) పెంచేందుకు తెలంగాణ ఆర్టీసీ ( Telangana RTC ) సంస్థ తాజాగా నిర్ణయం తీసుకుంది. కేవలం హైదరాబాద్ అలాగే సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రమే నడిచే బస్సుల్లో చార్జీలు పెంచాలని తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిగా ప్రకటన కూడా వెలువడింది. జంట నగరాలలో పెరుగనున్న ఆర్టీసీ బస్ టికెట్ల ధరలు అక్టోబర్ ఆరో తేదీ నుంచి అంటే ఎల్లుండి నుంచి అమలులోకి రాబోతున్నాయి.
Also Read: Shoaib Malik Divorce: మూడో భార్యకు కూడా షోయబ్ మాలిక్ విడాకులు..? సానియా మీర్జా పాపం తగిలిందా !
హైదరాబాద్ ( Hyderabad ) అలాగే సికింద్రాబాద్ ( Secunderabad ) జంట నగరాల పరిధిలో నడిచే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఈ-ఆర్డినరీ అలాగే ఈ-ఎక్స్ ప్రెస్ బస్సుల్లో… చార్జీలు పెరగనున్నాయి. ఈ బస్సుల్లో మొదటి మూడు స్టేజీలకు గాను ఐదు రూపాయల చొప్పున చార్జీలు పెంచనున్నారు. అలాగే నాలుగొవ స్టేజి నుంచి పది రూపాయల అదనపు చార్జీ వసూలు చేయనుంది తెలంగాణ ఆర్టీసీ. ఇక మెట్రో డీలక్స్ అలాగే ఈ-మెట్రో ఏసీ సర్వీసులలో మొదటి స్టేజి నుంచే ఐదు రూపాయలు పెంచనున్నారు. రెండో స్టేజి తర్వాత అదనంగా ₹10 చార్జ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ ఆర్టీసీ సంస్థ. పెరుగనున్న చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రాబోతున్నాయి.
హైదరాబాద్ మహానగరంలో ( Hyderabad ) బస్సు చార్జీలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఆర్టీసీ సంస్థ ( TGRTC)… జంట నగరాల ప్రయాణికుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల… మొత్తం 2800 ఎలక్ట్రిక్ బస్సులు తిరిగేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ బస్సులను దశలవారీగా రంగంలోకి దింపేందుకు సిద్ధం చేసింది తెలంగాణ ఆర్టీసీ. ముఖ్యంగా డీజిల్ బస్సులు రద్దుచేసి వాటి స్థానంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులను భర్తీ చేయాలని సంస్థ ఆలోచన చేస్తుండట. దీనికోసం అదనంగా మరో 10 డిపోలను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారట.
అలా చేయాలంటే కచ్చితంగా 10 చార్జింగ్ స్టేషన్లు హైదరాబాదులో ఉండాలి. వాటికి మెయింటెనెన్స్, స్థలాలు కూడా అవసరం. అలాంటి వాటిపై తెలంగాణ ఆర్టీసీ సంస్థ అధ్యయనం చేస్తోంది. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని తెలంగాణ మహిళా మణులు చాలా చక్కగా వాడుకుంటున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీట్ల కొరత లేకుండా చూస్తోంది.
Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోదరి పెళ్లి చూసిన అభిషేక్ శర్మ
హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంపు..
సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు
మొదటి 3 స్టేజీల వరకు రూ.5 పెంపు
4వ స్టేజీ నుంచి రూ.10 పెంచుతూ నిర్ణయం
ఈ నెల 6 నుంచి అమల్లోకి పెంచిన ఛార్జీలు pic.twitter.com/1ziJ1oC8qY
— BIG TV Breaking News (@bigtvtelugu) October 4, 2025