మీకు తెలిసిన నాలుగు బ్రౌజర్ల పేర్లు టకటకా చెప్పాలని ఎవరినైనా అడిగితే ఫస్ట్ వినిపించే సమాధానం గూగుల్ క్రోమ్. ఆ తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్, మొజిల్లా, మైక్రోసాఫ్డ్ ఎడ్జ్.. ఇలా చెప్పుకుంటూ పోతారు. వాస్తవానికి బ్రౌజర్ల విషయంలో పెద్దగా జనాలకు ఆప్షన్లు లేవు. ఉండాలని కూడా ఎవరూ అనుకోవడం లేదు. అలాంటి టైమ్ లో గూగుల్ కే ముచ్చెమటలు పట్టించేలా వచ్చింది పర్ ప్లెక్సిటీ బ్రౌజర్ కామెట్. దీని సృష్టికర్త ఎవరో తెలుసా? మన భారతీయుడే. అతడి పేరు అరవింద్ శ్రీనివాస్.
అరవింద్ శ్రీనివాస్..
గూగుల్ సీఈఓ మనోడే, మైక్రోసాఫ్ట్ అధినేత మనోడే అని మనం చంకలు గుద్దుకుంటాం కానీ.. వాటిని స్థాపించింది మాత్రం మనోళ్లు కాదు అనేది వాస్తవం. ఎవరో స్థాపించి అభివృద్ధి చేసిన కంపెనీల్లోకి మనోళ్లు ఎంటరయ్యారు అంతే. అయితే ఇటీవల కాలంలో మనోళ్లు కొత్త కొత్త అన్వేషణలతో మరింత రాటుదేలుతున్నారు. అలాంటివారిలో ఒకరు పర్ ప్లెక్సిటీ సంస్థ సీఈఓ అరవింద్ శ్రీనివాస్. పర్ ప్లెక్సిటీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ని తయారు చేసి పెద్ద పెద్ద ఏఐ సంస్థలకే సవాల్ గా మారాడు అరవింద్ శ్రీనివాస్. అక్కడితో ఆగిపోయాడనుకుంటే పొరపాటే, ఇటీవల బ్రౌజర్లపై కన్నేశాడు. పర్ఫెక్ట్ గా కామెట్ అనే ఓ బ్రౌజర్ ని తీసుకొచ్చాడు.
కామెట్..
గూగుల్ క్రోమ్ కి పక్కాగా పోటీ ఇస్తోంది కామెట్ బ్రౌజర్. ప్రస్తుతం ఇది అన్ని రకాల ప్లాట్ ఫామ్స్ లో ఉచితంగా లభిస్తోంది. ఇందులో బ్రౌజింగ్ చాలా సులభం. మిగతా బ్రౌజర్లలాగే ఇందులో మనకు కావాల్సిన సమాచారాన్ని వెదుక్కోవచ్చు, మనకు అవసరమైన వెబ్ సైట్స్ ని బ్రౌజ్ చేసుకోవచ్చు. అయితే అంతకు మించి ఇందులో మరో ఫీచర్ ఉంది. ఇది బ్రౌజర్ కమ్ ఏఐ టూల్. గూగుల్ లో లాగా ఏఐ లో సెర్చ్ చేయాలంటే ప్రత్యేకమైన ఆప్షన్ లోకి వెళ్లాల్సిన అవసరం ఇందులో ఉండదు. సింపుల్ గా Alt + A బటన్స్ ప్రెస్ చేస్తే మనం చూస్తున్న విండోలో రైట్ సైడ్ ఏఐ సెర్చ్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఇక అక్కడ్నుంచి మనిష్టం అన్నమాట. అంటే ఏఐ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే మొట్టమొదటి బ్రౌజర్ ఇదే.
Also Read: చంద్రుడి మీదకు రోబో కుక్కలు.. అక్కడ అవి ఏం చేస్తాయంటే?
గూగుల్ క్రోమ్ ఖేల్ ఖతం..
ఇప్పటి వరకు ఎన్ని బ్రౌజర్లు వచ్చినా, అందరూ నమ్మకంగా గూగుల్ క్రోమ్ నే విశ్వసిస్తూ వస్తున్నారు. కానీ ఇకపై దానికి కూడా కాలం చెల్లినట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే యూజర్ల ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఏఐ ని బాగా వాడుకుంటూ సెర్చ్ చేసుకునే బ్రౌజర్ కావాలంటే కామెట్ ని ఒకసారి ట్రై చేయొచ్చు. దీని ఇన్ స్టాలేషన్ కూడా చాలా సులభం. కామెట్ ప్లస్ అనేది అడ్వాన్స్డ్ వెర్షన్. ఇది ప్రీమియం వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కామెట్ ని మించి ఇందులో ఫీచర్లు ఉన్నాయి. మొత్తానికి మన భారతీయుడు, అందులోనూ మన సౌత్ ఇండియన్. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ 31 ఏళ్ల కుర్రాడు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఏఐ రంగంలో సత్తా చాటి, బ్రౌజర్ల చరిత్రనే తిరగరాస్తున్నాడు. కామెట్ తో సంచలనం సృష్టించాడు.
Also Read: జగన్ కోలుకోవడం కష్టం