Tv Serials: తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా సినిమాల కన్నా కూడా టీవీ సీరియల్స్ కి మొగ్గు చూపిస్తూ ఉంటారు. ప్రతిరోజు టీవీ సీరియల్స్ అలరిస్తూ ఉండడంతో ఎక్కువ మంది సీరియల్స్ చూడడానికే ఆసక్తి చూపిస్తారు. ఒకప్పుడు కంటెంట్ ఉన్న సీరియల్స్ మనకి కనిపిస్తే.. ఈమధ్య వచ్చే సీరియల్స్ అదిరిపోయే ట్విస్టులతో పాటుగా గ్రాఫిక్స్ కూడా ఏడవడంతో ప్రేక్షకులు మరింత ఆసక్తిగా సీరియల్స్ ని చూస్తున్నారు. కొన్ని చానల్స్ తమ టిఆర్పి రేటింగ్ పెంచుకోవడం కోసం కొత్త జిమ్మిక్కులను కూడా చేస్తూ ఉంటారు. అయితే సీరియల్స్లలో నటించే నటీనటులకు కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయన్న విషయం చాలామందికి తెలియదు. ఇటీవల టీవీ సీరియల్ నటుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టారు. మరి ఆ కమిట్మెంట్ ఏంటో? ఒకవేళ దాన్ని బ్రేక్ చేస్తే ఏం జరుగుతుందన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
సినిమాల్లో అయితే ఒక సినిమా పూర్తి చేయడానికి హీరోకి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. సినిమా యూనిట్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేయించుకొని ఆ సినిమా పూర్తయ్యేంతవరకు ఆ సినిమాకే పని చేయాలని చెబుతుంటారని చాలావరకు మనం వినే ఉంటాము. కానీ సీరియల్స్ కూడా అలాంటి రూల్స్ ఉన్నాయని అతి కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. అవును మీరు విన్నది నిజమే.. టీవీ చానల్స్ లలో ప్రసారమవుతున్న సీరియల్స్ కి కూడా కమిట్మెంట్స్ ఉంటాయని అనేకమంది పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. ఆ సీరియల్ పూర్తయ్యేంతవరకు ఆదానికే పని చేయాలి అన్నట్లు ముందుగా అగ్రిమెంట్ మీద సంతకం చేయిస్తారట. అది పూర్తయిన తర్వాతే మరొక సీరియల్ కి సైన్ చేయాల్సి ఉంటుందట. ఈ విషయాన్ని తాజాగా నటుడు ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
Also Read: భరత్ ను ఇరికించిన పల్లవి.. అవనికి బిగ్ షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్ అయ్యిందా..?
ఒక సీరియల్ కు సైన్ చేస్తే ఆ సీరియల్ ఎన్ని ఎపిసోడ్లు జరిగితే అన్ని ఎపిసోడ్లకు ఆ నటుడు లేదా నటి అందుబాటులో ఉండాలని ముందుగా ఆ సీరియల్ యూనిట్ అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టించుకుంటుందట. ఒకవేళ ఈ సీరియల్ నటిస్తూ వేరొక సీరియల్ ఆఫర్ వస్తే దానికి ముందుగా ఆ టీం తో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఆ సీరియల్ కూడా నటించవచ్చు అని ఈమధ్య టీవీ నటులు పలు ఇంటర్వ్యూలలో బయటపెడుతున్నారు. ఒకవేళ ఆ సీరియల్ యూనిట్ గనక ఒప్పుకోకపోతే ఆ సీరియల్ అయిపోయేంతవరకు మరొక సీరియల్ కి సైన్ చేసేందుకు కుదరదు అని తెలుస్తుంది. ఒకవేళ ఆ సీరియల్ రూల్ ను గనక బ్రేక్ చేస్తే కొంత అమౌంట్ ని కట్టాల్సి ఉంటుందని సీరియల్ నటులు అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇటీవల కొంతమంది సీరియల్ యాక్టర్స్ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఇలాంటివి ఉంటాయని మాత్రం తెలుస్తుంది.