BigTV English

Bigtv Kissik Talks:  మహేష్ విట్టా సినిమాల్లోకి అలా వచ్చాడా? ట్విస్టులు చాలానే ఉన్నాయే.. ఫన్ బకెట్ లేకపోతే?

Bigtv Kissik Talks:  మహేష్ విట్టా సినిమాల్లోకి అలా వచ్చాడా? ట్విస్టులు చాలానే ఉన్నాయే.. ఫన్ బకెట్ లేకపోతే?

Bigtv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేస్తుంది అయితే ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ప్రముఖ కమెడియన్ మహేష్ విట్టా(Mahesh Vitta) హాజరై సందడి చేశారు. ఎలాంటి సినీ నేపథం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కమెడియన్ గా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఈయన కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొంటూ తన సినీ కెరియర్ కి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.


అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ ప్రారంభం..

ఈ సందర్భంగా మహేష్ విట్టా మాట్లాడుతూ తనుకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా పిచ్చి ఉండేదని తెలిపారు. అందుకే ఇంటర్ అయిపోగానే మా ఇంట్లో వారితో హైదరాబాద్ వెళ్లి ఒక స్టూడియోలో జాయిన్ అవుతానని నాకు డైరెక్షన్ అంటే ఇష్టం కావడంతో నా అభిప్రాయాన్ని తెలియజేశాను కానీ మా కజిన్స్ మాత్రం ఇండస్ట్రీలో మోసాలు జరుగుతాయి మోసపోకూడదు అంటే ముందు నువ్వు చదువుకోవాలి అని చెప్పి నాతో పీజీ పూర్తి చేయించారని తెలిపారు. ఇలా పీజీ చదవగానే ఆరు నెలల పాటు ఉద్యోగం చేసి తిరిగి నా నిర్ణయాన్ని మరోసారి తెలిపాను. నాకు ఒక సంవత్సరం టైం ఇవ్వండి సక్సెస్ అయితే ఇండస్ట్రీలోనే కొనసాగుతా లేదంటే ఉద్యోగం చేసుకుంటానని చెప్పి హైదరాబాద్ వచ్చానని వెల్లడించారు.

జీవితాన్ని మార్చేసిన ఫన్ బకెట్..

తాను నటుడిగా తెరపై కనిపించాలని ఎప్పుడూ కోరుకోలేదు. డైరెక్షన్ అంటే ఇష్టం కావడంతో ముందు ఫన్ బకెట్(Fun Bucket) సిరీస్ కోసం అసిస్టెంట్ డైరెక్టర్ గా మారాను. అయితే అప్పట్లో రెవెన్యూ లేకపోవడం వల్ల నేనే నటించాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఆ ఎపిసోడ్స్ మంచి హిట్ కావడంతో మేకర్స్ నేనే నటించాలని చెప్పారు. లేదు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా కొనసాగుతానని చెప్పగా వాళ్ళు ఒప్పుకోలేదని మహేష్ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా అయితే నీకు పేమెంట్ ఇవ్వం నటుడిగా అయితేనే పేమెంట్ ఇస్తామని చెప్పడంతో నేను ఇటు నటుడిగాను ఇటు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా కొనసాగానని తెలిపారు.


ఇలా డైరెక్టర్ అవుదామని వచ్చిన నాకు ఫన్ బకెట్ సిరీస్ మాత్రం మంచి గుర్తింపును తీసుకువచ్చిందని ఒకవేళ ఈ సిరీస్ చేయకపోతే ఇంతలా పాపులర్ అయ్యేవాడిని కాదు, అసలు తెర పైకి వచ్చేవాడిని కాదేమో అంటూ ఆసక్తి కరమైన విషయాలను పంచుకున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో నటీనటుల జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియదు. ప్రతి శుక్రవారం ప్రతి నటి నటుడి జీవితం మారిపోతుందని తెలిపారు. ఇక తనకు సినిమా అవకాశాలు రాకపోయినా రచయితగా కొనసాగుతాను అంటున్న ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఈ సందర్భంగా మహేష్ విట్టా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈయన సినీ జర్నీ చూస్తే మాత్రం ఫన్ బకెట్ సిరీస్ మాత్రం తనని ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఐదారు ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నట్లు మహేష్ వెల్లడించారు.

Also Read: Chiranjeevi -Venkatesh: 80’s స్టార్స్ రీయూనియన్.. స్పెషల్ ఫ్లైట్ లో చిరు.. వెంకటేష్!

Related News

Big tv Kissik Talks: మహేష్ విట్టా లవ్ లో ఇన్ని  ట్విస్టులా.. నా ఆటోగ్రాఫ్ సినిమాని తలపిస్తోందిగా?

Big tv Kissik Talks: బిగ్ బాస్ నా జీవితాన్నే మార్చేసింది.. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను?

Big tv Kissik Talks: పేరుకే గొప్ప నటుడు.. సొంత ఇల్లు కూడా లేదు.. ఇండస్ట్రీలో ఇంత మోసమా?

Shobha Shetty: బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్న బిగ్ బాస్ బ్యూటీ.. రేపే ప్రారంభం!

Tv Serials: టీవీ సీరియల్స్ కు కమిట్మెంట్ తప్పనిసరినా? ఆ ఒక్కటి చెయ్యడం కుదరదు..

Intinti Ramayanam Today Episode: భరత్ ను ఇరికించిన పల్లవి.. అవనికి బిగ్ షాక్.. పల్లవి ప్లాన్ సక్సెస్ అయ్యిందా..?

Nindu Noorella Saavasam Serial Today october 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  రామ్మూర్తి ఇంట్లో ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ   

Big Stories

×