Vishnu Priya Open Up on Casting Couch: కాస్టింగ్ కౌచ్.. సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపించే పేరు ఇది. ఇప్పటికే ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటకు పెట్టారు. దీనిపై ఇండస్ట్రీ పెద్ద ఉద్యమమే మొదలైంది. మీటూ పేరుతో ఈ ఉద్యమానికి తెరలేపారు. దీని ద్వారా ఎంతో నటీనటులు పరిశ్రమలో తమకు ఎదురైన లైంగిక వేధింపులపై పెదవి విప్పారు. తనూశ్రీ దత్తా, సింగర్ చిన్మయి శ్రీపాద వంటి ప్రముఖులు సంచలన ఆరోపణలు తర్వాత ఒక్కొక్కరు బయటకు వచ్చారు. సినీ పరిశ్రమలో పెద్ద దుమారం రేపింది ఈ మీటూ ఉద్యమం. అయినా మహిళలపై వేధింపులు ఆగడం లేదు. ఇప్పటికీ ఏక్కడో అక్కడ ఈ వేధింపులకు నటీమణులు బాధితులు అవుతూనే ఉన్నారు.
బుల్లితెర, వెండితెర అయినా కూడా కాస్టింగ్ కౌచ్ అనేది సాధారణం అయిపోయింది. అయితే ఈ కాస్టింగ్ కౌచ్‌పై తాజాగా యాంకర్ విష్ణు ప్రియ కూడా స్పందించింది. కాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కడైన ఉంది. నాకు కూడా కెరీర్ మొదటల్లో కమిట్మెంట్ అడిగారు. ఆఫర్స్ కావాలంటే తస్పనిసరిగా కమిట్మెంట్ ఇవ్వాలన్నారు. కేవలం అవకాశాల కోసం నన్నునేను అమ్ముకోను. అక్కర్లేదు అని వాళ్ల మొహం మీదే చెప్పేశాను. ఆ తర్వాత మల్లెమలైలో పోవే పోరా వచ్చింది. ఇక్కడ తెలుసుగా.. ఒంటి మీద ఈగ కూడా వాలనివ్వరు. ఫీమేల్ ఆర్టిస్టులను చాలా రెస్పాక్ట్ ఇస్తారు. ఇక్కడ భద్రత ఉంటుంది. సో ఆ తర్వాత నాకు ఇలాంటి ఎదురవ్వలేదు. తర్వాత నేమ్ ఫేం, వచ్చాయి. కాబట్టి, ఆ తర్వాత నాకు ఇలాంటి అనుభవాలు ఎదురవ్వలేదు.
కానీ, సోషల్ మీడియాలో నా పోస్ట్స్, వీడియోలు చూసి. డబ్బులు ఎక్కువ ఇస్తే కమిట్మెంట్ వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నారు. నాకు తరచూ ఫోన్స్, మెసేజ్ చేస్తుంటారు. ఇంత రెమ్యునరేషన్ ఇస్తాం. కానీ, ముందు మేము అడిగిందని ఇవ్వాలని మెసేజ్ చేస్తారు. వెంటనే వారిని బ్లాక్ చేసేస్తా అని చెప్పుకొచ్చింది. అలాగే తన లవ్, బ్రేకప్లపై కూడా స్పందించింది. తనకు మూడు సార్లు బ్రేకప్ అయ్యిందని చెప్పింది. ‘ఫస్ట్ రిలేషన్లో చాలా సీరియస్గా ఉన్నాను. అతడినే పెళ్లి చేసుకుంటానని ఫిక్స్ అయ్యా. తన కోసం ఆఫర్స్ కూడా వదిలేసి పెళ్లి చేసుకుని గృహిణిగా ఉండిపోదామని ఎన్నో కలలు కన్నాను. అతను కూడా ఇండస్ట్రీ వ్యక్తే.
ఆ బ్రేకప్ని భరించలేకపోయాను. తీవ్రమైన డిప్రెషన్కి వెళ్లాను. అప్పుడే ఆధ్యాత్మికంగా మరింత స్ట్రాంగ్ అయ్యా. ఇక కొన్నేళ్లకు మరో వ్యక్తి నా లైఫ్లోకి వచ్చాడు. కానీ, కొన్నాళ్లు అతడు కూడా హ్యాండ్ ఇచ్చాడు. సెకండ్ రిలేషన్ నుంచి బయటపడటానికి నాకు చాలా కాలం పట్టింది. అప్పుడే కాశీకి వెళ్లి కొన్ని రోజులు ఉండి వచ్చాను. ఆ తర్వాత మూడో రిలేషన్ ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడో వెళ్లిందో తెలిసేలోపే సింగిల్గా మిగిలిపోయా. ఇప్పుడు నిజమైన రిలేషన్స్ అంటూ లేవు. ఎవరూ స్ట్రాంగ్ కమిట్మెంట్ ఇవ్వడం లేదు. అవసరానికి వస్తున్నారం.. అవసరం తీరాక వెళ్లిపోతున్నారు. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు‘ అని చెప్పుకొచ్చింది.