Bigg Boss 10: బిగ్ బాస్ 10 62వ రోజుకు సంబంధించి తాజాగా విడుదల చేసిన రెండవ ప్రోమోలో హోస్ట్ నాగార్జున (Nagarjuna) కంటెస్టెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా నీతూ మాస్టర్ (Neetu Natraj) ఈ వారం ఎపిసోడ్లో త్రిగుణ్ (Trigun) పై ఒక రేంజ్ లో ఫైర్ అయిన విషయం తెలిసిందే. “నువ్వు గేమ్ ని గేమ్ లాగే ఆడు.. కుట్రతో కాదు..పేల్చాల్సిన టైమ్ లో పేల్చకపోతే గన్ రివర్స్ అవుతుంది”.. అంటూ ఒక రేంజ్ లో మండిపడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రోమోలు ఎడిట్ చేయడంతో అసలు స్వరూపం ఇదే అంటూ కొంతమంది ఆంటీ ఫ్యాన్స్ కూడా త్రిగుణ్ పై ఒక రేంజ్ లో మండిపడ్డారు. అయితే నాగార్జున అసలు విషయం కాస్త రివీల్ చేయడంతో నీతూ మాస్టర్ ముఖం తెల్లబోయింది. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
తాజాగా విడుదల చేసిన రెండవ ప్రోమోలో.. థర్మోకోల్ గేమ్ లో దెబ్జానీ పై ముఖేష్ కాలు లేపారు. ఈ విజువల్స్ ను నాగార్జున చూపిస్తూ.. రాంప్రసాద్ నువ్వే న్యాయమూర్తి.. ఈ జడ్జిమెంట్ కూడా నువ్వే చెప్పాలి. తాడుతో కొడితే కనిపించింది కదా సార్ చెప్పేదేముంది అన్నావ్ అంటూ నాగార్జున అన్నారు. దీనికి రాంప్రసాద్ మాట్లాడుతూ.. యాక్చువల్ గా కాలి తో తన్నడం తప్పే కదా సర్.. మరి తను అలా అమ్మాయి మీద కాలు ఎత్తడం చాలా తప్పు సార్ అని అంటుండగా ..చెప్పాలి కదా అని నాగార్జున అంటే.. అప్పుడు తిరుగుతున్న యాంగిల్స్ లో మొత్తం కనిపించలేదు సార్ అని రామ్ ప్రసాద్ అన్నారు. దీనికి నాగార్జున.. శివ అరుస్తున్న అరుపులు కి ఏం జరుగుతుందో ఎవరికి ఏమి వినపడదు.. సంచాలక్ గా నువ్వు చేయాల్సింది చేసావ్.. క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి కదా.. అక్కడ ఏం జరుగుతుంది అని.. వర్షిణి ను అడుగుతూ.. తప్పు సార్.. కాల్ లేపడం చాలా తప్పు సర్.. అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.
also read: అతనో నక్క.. మగాడే కాదు.. దెబ్జానీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగ్!
ఇక ఆ తర్వాత నీతూ మాస్టర్ పై ఫైర్ అయ్యారు.. నీతూ మాస్టర్ త్రిగుణ్ పై ఫైర్ అయిన వీడియోను చూపిస్తూ.. నీతూ మాస్టర్ పై మండిపడ్డారు నాగార్జున. ఆ వీడియో మాటలలో నీతూ విన్నది కరెక్టేనా అంటూ అటు శ్వేత ను, ఇటు అమన్ ను కూడా ప్రశ్నించారు. శ్వేత , ఆమన్ ఇద్దరూ కూడా నీతూ మాట్లాడిన మాటలు తప్పు అంటూ తెలిపారు. అటు రామకృష్ణ కూడా త్రిగుణ్ వైపే సమాధానం చెప్పారు. అప్పటికి నీతూ మాస్టర్ వినకపోవడంతో త్రిగుణ్ అన్న మాటలను ప్లే చేయడంతో నీతూ మాస్టర్ ఒక్కసారిగా తెల్లబోయింది. నువ్వు విన్నప్పుడు అక్కడే ఎందుకు ఆబ్జెక్ట్ చేయలేకపోయావు అని ప్రశ్నించగా.. స్టాండ్ తీసుకోవాలంటే భయమేస్తోంది సార్ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది. ఇక నాగార్జున మాట్లాడుతూ..పేల్చాల్సిన టైమ్ లో పేల్చకపోతే గన్ రివర్స్ అవుతుంది.. ఆమె మాటలను ఆమెకే వినిపించి కౌంటర్ ఇచ్చాడు. మొత్తానికి అయితే ఈ ప్రోమో వైరల్ గా మారింది.