E-Paper
Advertisement

జీఓ నం. 14 ను రద్దు చేయాలని.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్!

జీఓ నం. 14 ను రద్దు చేయాలని.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్!
Advertisement

Atma Gourava: ఆత్మ గౌరవ భవనాలపై కులసంఘల ట్రస్ట్ లకు పూర్తి అధికారులు ఇవ్వాలని, జీఓ నంబర్ 14 ను రద్దు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హైద్రాబాద్ సోమాజిగూడలోని హైద్రాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఆత్మ గౌరవ భవనాల పై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓ నంబర్ 14 పై బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అన్ని రాజకీయ, 42 కులసంఘల నాయకులు హాజరయ్యారు.

మరో రూ.95 కోట్లు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల కోసం ఎకరా భూమి సుమారు 200 కోట్లు మార్కెట్ విలువ కలిగిన 82 ఎకరాల భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిందన్నారు. భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే రూ.95.25 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. రెండు కుల సంఘాల భవనాలు పూర్తయ్యాయి. కొన్ని నిర్మాణ దశలో ఉండగా, మరికొన్నింటికి టెండర్లు పూర్తయ్యాయని, మిగిలిన వాటికి వెంటనే టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే విడుదల చేసిన రూ.95.25 కోట్ల నిధులతో చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అదనంగా మరో రూ.95 కోట్లకు ప్రభుత్వం జీవో విడుదల చేసి నిర్మాణాలను వేగవంతం చేయాలని, కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలపై ప్రభుత్వ పెత్తనం తగదని, జీవో నెం.14ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Alao Read: పవిత్రమైన చెట్టును నరికిన మూడ్రోజులకే ఇంటి పెద్ద మృతి… 16 రోజుల్లో ఐదుగురి చావులు… నవ్విస్తూ భయపెట్టే మలయాళ థ్రిల్లర్

క్రిమినల్ చర్యలు..

భవనాల నిర్వహణ, సమావేశాలు, కార్యకలాపాల విషయంలో కుల సంఘాల ట్రస్టులకు పూర్తి స్వేచ్ఛ కల్పించాలి. ప్రభుత్వ అనుమతుల నిబంధనలు విధించడం సరికాదని, కేటాయించిన భూములు, నిర్మించిన భవనాలపై సంబంధిత కుల సంఘాల ట్రస్టులకు శాశ్వత హక్కులు కల్పించాలని కోరారు. అవకతవకలు జరిగితే బాధ్యులపై చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అంతేకానీ కుల సంఘాల హక్కులను హరించకూడదన్నారు. దేశవ్యాప్తంగా జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టాలి. ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. జనగణనలో ఓబీసీ కులాలకు యూనిక్ కోడ్ కేటాయించాలని,ఓబీసీ కులగణన చేయాలని డిమాండ్ చేశారు.

న్యాయమైన వాటా..

Advertisement

విద్య, ఉద్యోగాలు, రాజకీయ రిజర్వేషన్లలో బీసీలకు న్యాయమైన వాటా కల్పించడానికి శాస్త్రీయమైన కులగణన అవసరం అన్నారు. కులగణన కోసం దేశవ్యాప్త ఉద్యమాలు చేసి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ లింగయ్యయాదవ్, మున్నూరుకాపుసంఘం అధ్యక్షుడు పురుషోత్తం, బీసీ కమీషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్, మాజీ టీఎన్జీవో అధ్యక్షులు మామిళ్ల రాజేందర్,గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, రాంబాబు యాదవ్, నారాయణ, సుర్వీ యాదయ్య, ప్రణీల్ చందర్, కుమార్ గౌడ్, చెన్నయ్య, కృష్ణయ్య గౌడ్, నర్సింహా గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.

Also Read: అతనో నక్క.. మగాడే కాదు.. దెబ్జానీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగ్!

Tags

Related News

ఇళ్లు మంజూరైనా పనులు ప్రారంభించకపోతే రద్దే: మంత్రి పొన్నం ప్రభాకర్!

మేడ్చల్‌లో మిషన్ భగీరథ నీరు రోడ్డుపాలు.. పట్టించుకోని అధికారులు!

పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అవ్వదు.. కేటీఆర్ గడ్డం పై సీఎం రేవంత్ కౌంటర్!

తెలంగాణ ఖైదీలకు.. కార్పొరేట్ ఉద్యోగాలు ఇప్పిస్తున్న జైళ్ల శాఖ!

రేసుగుర్రం అనుకుంటే కీలుగుర్రంగా మారిన సీఎం రేవంత్: కవిత ఎద్దేవా

రైతులకు బంపర్ ఆఫర్! క్వింటాల్ వరి రూ.5,500? ఎలాగో తెలుసా?!

కొడంగల్ అభివృద్ధి నిధులపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి!

Big Stories

Advertisement
×