Illu Illalu Pillalu Narmadha: బుల్లితెర నటిగా కథలో రాజకుమారి అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన అన్షు రెడ్డి(Anshu Reddy) బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా బుల్లితెరపై వరుస సీరియల్స్ లో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న నర్మదా గతంలో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. నిశ్చితార్థం తర్వాత నటి అన్షు రెడ్డి కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల తన నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. ఇక ఈ వ్యవహారం కారణంగా కొంతకాలం పాటు సీరియల్స్ కి దూరమైన ఈమె రీ ఎంట్రీ ఇచ్చారు.
ప్రస్తుతం అన్షు రెడ్డి స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu Illaalu,Pillalu) అనే సీరియల్లో నర్మదా అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న అన్షు రెడ్డి ఇప్పుడిప్పుడే తిరిగి కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇలా సీరియల్ తో పాటు స్పెషల్ ఈవెంట్స్ అలాగే పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు. మరోవైపు బొటిక్ కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా అన్షు రెడ్డి తన అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు.
తాజాగా ఈమె పెళ్లి చేసుకోవడం పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. నర్మదా నిజంగానే పెళ్లి చేసుకుందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు అన్షు రెడ్డి ఎక్కడ కూడా పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని తెలియ చేయలేదు. ఇలా తన పెళ్లి విషయాన్ని పూర్తిగా రహస్యంగా ఉంచిన ఈమె ఏకంగా పెళ్లి చేసుకొని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం అన్షు రెడ్డి పెళ్లి(Anshu Reddy Wedding)కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు అన్షు రెడ్డి దంపతులకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇక ఈ పెళ్లి ఫోటోలు వైరల్ అవడంతో అన్షు రెడ్డి పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి ఎవరు అతని బ్యాగ్రౌండ్ ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. మరి అన్ష పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి ఎవరు అనేది తెలియాలి అంటే ఈ విషయంపై అన్షు స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే. పెళ్లి వేడుకలో భాగంగా పలువురు బుల్లితెర నటీనటులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా పెళ్లికి సంబంధించిన విషయాన్ని చాలా రహస్యంగా ఉంచిన అన్షు రెడ్డి ఒక్కసారిగా పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తూ కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు చేస్తున్నారు.
Also Read: ప్లీజ్ దీపావళికి క్రాకర్స్ పేల్చండి.. ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేసిన బాలు!