Bigg boss 10:బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ రియాలిటీ షో గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం పదవ సీజన్ 8 వారాలు పూర్తి కాగా.. 9వ వారం ఎలిమినేషన్ కోసం ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. గత వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ఝాన్సీ, రోహిత్ ఇద్దరు కామనర్స్ ఒకేసారి ఎలిమినేట్ అయ్యి.. అభిమానులను ఆశ్చర్యపరిచారు. పైగా రోహిత్ నాయుడుని మళ్లీ హౌస్ లోకి తీసుకోవాలి అంటూ పెద్ద ఎత్తున రచ్చ చేసిన విషయం తెలిసిందే. అటు ఝాన్సీ కూడా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఇక తొమ్మిదవ వారం ఏకంగా 10 మంది నామినేషన్ లోకి వచ్చారు. మరి ఎవరు? ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ కాబోతున్నారు? అనే వార్త వైరల్ గా మారింది.
9వ వారం నామినేషన్ లో భాగంగా ముఖేష్ గౌడ, టెంపర్ వంశీ, అమన్, నరేష్, వర్షిణి, రామ్ ప్రసాద్, శివ, సుధీర్, నీతూ నటరాజ్, దెబ్జానీ మోదక్ ఇలా మొత్తం 10 మంది నామినేషన్ లోకి వచ్చారు. అయితే ఇందులో అనూహ్యంగా ముఖేష్ గౌడ 32 శాతం ఓటింగ్ తో మొదటి స్థానంలో దూసుకుపోతుండగా.. టెంపర్ వంశీ 25% ఓటింగ్ తో రెండవ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానాలలో అమన్, దెబ్జానీ, ఆటో రాంప్రసాద్, సుధీర్ రెడ్డి, నరేష్ , నీతూ మాస్టర్, వర్షిణి , శివకుమార్ ఇలా వీరంతా తర్వాతి స్థానాలలో ఉన్నారు. ఇకపోతే అత్యంత తక్కువ ఓట్లతో శివ, సుధీర్ రెడ్డి డేంజర్ జోన్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇకపోతే శివ తో పోల్చుకుంటే సుధీర్ రెడ్డి ఓట్లు మరింత తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
also read:‘జిమ్ జిమ్ తారా’ ఆంటీ రేంజ్ మారిపోయిందిగా.. ఏకంగా ఆ షోలో ఛాన్స్!
ఇకపోతే ఈ వారం సుధీర్ రెడ్డి డేంజర్ జోన్ దిశగా ఉన్నట్లు తాజా ఓటింగ్ చూస్తే అర్థమవుతుంది. ఇకపోతే ఈయన పిఆర్ టీమ్ ఈయనను హౌస్ లో ఉంచేందుకు చాలా గట్టిగానే ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా జిమ్ జిమ్ తార లక్ష్మీ ఆంటీ తో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు కూడా సుధీర్ కి ఓటు వేయండి అంటూ సోషల్ మీడియాలో వీడియోలు కూడా విడుదల చేశారు. అయినా సరే ఫలితం లేకుండా పోతుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం ఓటింగ్ లో ఏదైనా మ్యాజిక్ జరిగి ఆయన సేవ్ అవుతారో.. ఇకపోతే ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్ లో భాగంగా ముఖేష్ కి సింపతీ బాగా పెరిగిపోయి ఆయన ఏకంగా మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.