E-Paper
Advertisement

అతనో నక్క.. మగాడే కాదు.. దెబ్జానీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగ్!

అతనో నక్క.. మగాడే కాదు.. దెబ్జానీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగ్!
Advertisement

Bigg Boss 10:ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పటికే 9 సీజన్లు పూర్తి కాగా, పదవ సీజన్ కూడా 8 వారాలు పూర్తయ్యాయి. తొమ్మిదవ వారం కూడా చివరి దశకు చేరుకుంది. సాధారణంగా మిగతా ఎపిసోడ్లతో పోల్చుకుంటే వీకెండ్ ఎపిసోడ్స్ కి ఏ రేంజ్ లో ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హౌస్ లో జరిగిన ఐదు రోజుల ప్రస్తావన.. శని, ఆదివారాలలో జరుగుతుంది. కంటెస్టెంట్ల తప్పులను బయటపెడుతూ వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంటారు హోస్ట్ నాగార్జున (Nagarjuna). ఈ క్రమంలోనే తాజాగా 62వ రోజుకు సంబంధించి శనివారం నాటి ఎపిసోడ్ మొదటి ప్రోమోని నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు.

వంశీ, వర్షిణి లపై నాగార్జున ఫైర్..

ఇందులో ఒక్కొక్కరికి తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చిన నాగార్జున.. ముఖ్యంగా దెబ్జానీ..ముఖేష్ ను అన్న మాటలకు సంబంధించిన వీడియోని మళ్లీ ప్లే చేసి ఆమెకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. ప్రోమో మొదట్లో వంశీ కుండ పగలగొట్టిన నాగార్జున.. సుధీర్ తో మాట్లాడుతూ.. నామినేషన్ లో వంశీ మాట్లాడిన మాటలు ఏంటి? అని అడిగాడు. కళ్ళు, కోతి అంటూ ఇంకో పదాన్ని చెప్పాడు. కానీ వంశీ అన్న అసలైన మాటను ప్రస్తావించలేదు. అన్ని గుర్తుపెట్టుకునే వర్షిణిని అడుగుతాను అంటూ నాగార్జున అడిగారు. అక్కడ మూలకు ఇద్దరు కులుకుతారు అంటూ వంశీ అన్న మాటలను ఆమె ప్రస్తావించింది. అసలు దానికి అర్థం ఏంటి? అని నాగార్జున అడగగా.. వర్షిని అసభ్యకర పదమని నాకర్థమైంది అంటూ చెప్పింది . దీనికి నాగార్జున మాట్లాడుతూ.. డిఫరెంట్ సెన్స్ అని నీకు అర్థమైందా? లేక నువ్వు అనుకుంటున్నావా? అంటూ మళ్ళీ ప్రశ్నించారు. వంశీ ముఖేష్ తో మాట్లాడుతూ చెల్లిని బయటకు పంపించి కులుకుతున్నారు అంటూ వర్షిని, ముఖేష్ లను ఉద్దేశించి కామెంట్లు చేశారు. అలా అందుకు సంబంధించిన వీడియోని కూడా నాగార్జున ప్లే చేసి వీరికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Advertisement

also read:స్వయంభు ఈ ఏడాది కూడా రానట్టేనా?

దెబ్జానీ కలకత్తా నుంచీ వచ్చావ్..

తర్వాత దెబ్జానీ తో మాట్లాడుతూ.. నీ ఆటకు నువ్వు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటావు అని అడిగాడు. కెప్టెన్సీ కాలేకపోయాను కాబట్టి మైనస్ 2 అంటూ ఆమె చెప్పింది. నీకు వీడియో చూపిస్తాను. దానికి ఎన్ని మార్కులు ఇస్తావో చెప్పు అని ప్రశ్నించాడు. ఇకపోతే థర్మోకోల్ బాల్స్ గేమ్ లో ముఖేష్ ఈమె బ్యాగ్ ను కింద పడేయడంతో ఈమె ఆవేశంలో ముఖేష్ ని ఉద్దేశిస్తూ.. అసలు మగాడే కాదు.. సాలా.. నక్క పులి అంటూ ఆవేశంతో అనరాని మాటలు అన్నది.. ఈ వీడియోని నాగార్జున రీ ప్లే చేస్తూ నక్క అంటే ఫాక్స్ ఓకే.. సాలా ఏంటి? మగాడే కాదు.. ఏంటి? ఆటని ఆవేశం ఎప్పుడూ టేక్ ఓవర్ చేయకూడదు. నువ్వు కలకత్తా నుంచి వచ్చావు.. కాళీమాతలా ఆట ఆడాలి.తప్పుడు మాటలు వద్దు మనకి.. అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏది ఏమైనా దెబ్జాని ముఖేష్ పై అన్న మాటలకు ఇప్పటికే ఆమె పైన విపరీతమైన ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News

ఘనంగా ఇల్లు ఇల్లాలు పిల్లలు నర్మదా వివాహం… ఫోటోలు వైరల్!

గుండె నిండా గుడిగంటలు మనోజ్ నెల సంపాదన ఎంతో తెలుసా?

వైష్ణవి సోనీ హవా మామూలుగా లేదుగా..ఈ సాంగ్స్‌తోనే సెన్సేషన్!

బిగ్ బాస్ లో ఊహించని ఎలిమినేషన్.. పీఆర్ టీమ్ గట్టిగా కష్టపడ్డా నో యూజ్!

సీరియల్స్ చేయడం పై ఆమని కామెంట్స్… అన్ని ఇబ్బందులు ఉన్నాయా?

‘జిమ్ జిమ్ తారా’ ఆంటీ రేంజ్ మారిపోయిందిగా.. ఏకంగా ఆ షోలో ఛాన్స్!

హీరోగా అవతారం ఎత్తిన బిగ్ బాస్ కళ్యాణ్ పడాల.. డైరెక్టర్ ఎవరంటే?

Big Stories

Advertisement
×