E-Paper
Advertisement

పాటలు కట్టి బ్రాండ్ చేయాల్సిన పనిలేదు… త్రిగుణ్ కి ఇచ్చి పడేసిన నాగార్జున

పాటలు కట్టి బ్రాండ్ చేయాల్సిన పనిలేదు… త్రిగుణ్ కి ఇచ్చి పడేసిన నాగార్జున
Advertisement

Bigg Boss 10 Telugu Day 62 Promo 3: బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది ఈ కార్యక్రమం తెలుగులో విజయవంతంగా 9 సీజన్లను పూర్తిచేసుకునే పదవ సీజన్ ప్రసారం అవుతుంది. ఇక ఈ పదవ సీజన్ ఇప్పటికే 8 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకొని తొమ్మిదవ వారం చివరి దశకు చేరుకుంది.. ఇక ప్రతివారం వీకెండ్ లో భాగంగా శని ఆదివారాలలో నాగార్జున(Nagarjuna) బిగ్ బాస్ వేదిక పైకి వచ్చి హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ వారు చేసిన తప్పులను ప్రశ్నిస్తూ ఉంటారు.

పాటలు కట్టి బ్రాండ్ చేయాల్సిన పనిలేదు

ఇకపోతే నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు .ఈ ప్రోమో వీడియోలో భాగంగా ఈ వారంలో కంటెస్టెంట్ల ఆట తీరు గురించి వారు మాట్లాడిన మాట తీరు గురించి నాగార్జున మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈవారం కెప్టెన్ గా ఉన్నటువంటి త్రిగుణ్ (Trigun)గురించి నాగార్జున మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా నాగార్జున కుండ పగలగొడుతూ.. ప్రతి ఒక్కరి మీద పాటలు కట్టి వారిని బ్రాండ్ చేయాల్సిన పనిలేదు అంటూ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు ఒక వీడియో చూపిస్తాను త్రిగుణ్ నీకు ఆ వీడియో కరెక్ట్ అనిపిస్తుందా లేదా అంటూ నామినేషన్స్ కి సంబంధించిన ఒక వీడియో ప్లే చేశారు.

నీది చీప్ క్యారెక్టర్..

Advertisement

ఇందులో భాగంగా త్రిగుణ్ వర్షిని(Varshini) మధ్య మాటలు యుద్ధం జరిగింది.. ఆడాలి ఆడాలి ఆట ఆడాలి అడుక్కొని తినకూడదు అంటూ త్రిగుణ్  మాట్లాడుతూ నీ క్యారెక్టర్ అదే అంటూ వర్షిని గురించి చాలా చులకన భావనతో మాట్లాడారు. నీది చీప్ క్యారెక్టర్ అంటూ త్రిగుణ్ మాట్లాడటంతో ఈ వీడియో చూపిస్తూ నాగార్జున క్యారెక్టర్ లెస్, చీప్, అంటూ మాట్లాడటం ఏంటని మండిపడ్డారు అలాగే కెప్టెన్ గా త్రిగుణ్ బాగా చేశారు అనే వాళ్ళు చేతులెత్తండి అని నాగార్జున అడగగా కేవలం వంశీ మాత్రమే చేయి పైకెత్తారు. దీంతో నాగార్జున వంశీ నువ్వు చెయ్యి పైకెత్తిన అది కన్సిడర్ కాదు అంటూ సమాధానం ఇచ్చారు.

Advertisement

ఎవరైనా మధ్యలో వచ్చి మాట్లాడుతుంటే కెప్టెన్ గా ఆపాల్సిపోయి నువ్వే మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావని నాగార్జున అడగడంతో..నేను వెళ్లి ట్రాప్ లో పడ్డాను సర్ అంటూ త్రిగుణ్ సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేయగా.. నాగార్జున మాత్రం నా దృష్టిలో నువ్వు కింద పడిపోయావు అంటూ కౌంటర్ ఇచ్చారు. కెప్టెన్ ఎప్పుడు కూడా పోలైట్ గా ఉండాలి లేదంటే తనని కూడా షట్ అప్ అనే అంటారు అంటూ నాగార్జున త్రిగుణ్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈరోజు జరగబోయే ఎపిసోడ్ ల భాగంగా ఈయన ఇంకా ఏ కంటెస్టెంట్ కు ఎలాంటి వార్నింగ్ ఇచ్చారు అనేది తెలియాల్సి ఉంది.

Also Read: తెరపైకి షకీలా బయోపిక్.. సాయి రాజేష్ సంచలన నిర్ణయం!

Related News

అతనో నక్క.. మగాడే కాదు.. దెబ్జానీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగ్!

ఘనంగా ఇల్లు ఇల్లాలు పిల్లలు నర్మదా వివాహం… ఫోటోలు వైరల్!

ప్లీజ్ దీపావళికి క్రాకర్స్ పేల్చండి.. ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేసిన బాలు!

గుండె నిండా గుడిగంటలు మనోజ్ నెల సంపాదన ఎంతో తెలుసా?

వైష్ణవి సోనీ హవా మామూలుగా లేదుగా..ఈ సాంగ్స్‌తోనే సెన్సేషన్!

బిగ్ బాస్ లో ఊహించని ఎలిమినేషన్.. పీఆర్ టీమ్ గట్టిగా కష్టపడ్డా నో యూజ్!

సీరియల్స్ చేయడం పై ఆమని కామెంట్స్… అన్ని ఇబ్బందులు ఉన్నాయా?

Big Stories

Advertisement
×