E-Paper
Advertisement

వైష్ణవి సోనీ హవా మామూలుగా లేదుగా..ఈ సాంగ్స్‌తోనే సెన్సేషన్!

వైష్ణవి సోనీ హవా మామూలుగా లేదుగా..ఈ సాంగ్స్‌తోనే సెన్సేషన్!
Advertisement

Vaishnavi Sony:ఫోక్ సాంగ్స్ ..సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎన్నో ఫోక్ సాంగ్స్ మనకి దర్శనమిస్తూనే ఉన్నాయి .ముఖ్యంగా ఎన్నో పాటలు మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతున్నాయి .ఇక వీటిల్లో ఎంతోమంది ప్రధాన పాత్రలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు కూడా .వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు వైష్ణవి సోనీ . ప్రస్తుతం ఈవిడ నటించిన పాటలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి .

ఇక వైష్ణవి సోనీకి ఉన్న క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఆమె పాటలకి వస్తున్న విమిలియన్ల వ్యూస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి.ముఖ్యంగా మల్లె చెట్టు పాటతో మంచి క్రేజ్ కొట్టేసింది వైష్ణవి సోని .శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ లో వచ్చిన ఈ పాటకు కళ్యాణ్ కీస్ మ్యూజిక్ అందించగా బొడ్డు దిలీప్ పాడాడు .
ఇక ఈ పాట రిలీజ్ అయిన ఏడు నెలల్లోనే ఏకంగా 82 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టడం విశేషం .

Advertisement

ఇక పోరి రాయే జాతర పాట కూడా వైష్ణవి సోని ఖాతాలో మరో మంచి హిట్ అని చెప్పాలి .బుల్లెట్ బండి లక్ష్మణ్ రాసిన ఈ పాటకు కళ్యాణ్ కీస్ సంగీతం అందించడం విశేషం. ఇక ప్రభ, నర్సింలు పాడిన ఈ పాటలో వైష్ణవి సోనీ కి జోడిగా జనతా బబ్లు నటించి మెప్పించాడు .
ఇక దీనికి లీడింగ్ బాయ్స్ కొరియోగ్రఫీ అందించగా రిలీజ్ అయిన 10 నెలల్లోనే ఈ పాట ఏకంగా 59 మిలియన్ల వ్యూస్ ని వెనకేసింది. ఒక జాతర బ్యాగ్రౌండ్ లో వచ్చిన ఈ పాట ఇప్పటికీ నెట్టింట్లో మారు మ్రోగి పోతూనే ఉంటుంది .

Advertisement

ఇక బాగుందే పార్ట్ 2 కూడా వైష్ణవి సోనీ ఖాతాలో మరో మంచి పాటగా చెప్పుకోవాలి .మదీన్ ఎస్కే మ్యూజిక్ అందించిన ఈ పాటని కొండ రాజేందర్ రాయగా దివ్య మాలిక్ రాము కలిసి పాడారు .ఇక మున్నా దర్శకత్వంలో వచ్చిన ఈ పాట ఇప్పటికీ 16 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టింది .

https://youtu.be/PFnqjD_cWj0?si=NBEe413Jph-KdL9t
అయితే వైష్ణవి సోని క్రేజ్ ను ఆకాశంలో పెట్టేసింది మాత్రం భాసింగ బలాలు అని చెప్పాలి. కేవలం నాలుగు నెలల్లో ఈ పాట ఏకంగా 245 మిలియన్ల వ్యూస్ ని సాధించి ఫోక్ ఇండస్ట్రీస్ షేక్ చేసింది. కళ్యాణి కిస్ మ్యూజిక్ అందించగా స్వామి నరేష్ దుబ్బా ఈ పాటని రాయడంతో పాటు శ్రీనిధితో కలిసి పాడటం విశేషం .ఇక శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ అందించగా తక్కువ సమయంలోనే ఈ స్థాయిలో వ్యూస్ కొల్లగొట్టడం ఒకరకంగా రికార్డు అని చెప్పాలి .

ఇక ఈ క్రమంలోనే గుజ్జారి గుజ్జారి మామిడి ఇండ్ల కింద పార్ట్ 2 పాట కూడా వైష్ణవి సోనీకి మంచి పేరు తెచ్చింది SV మల్లిక్ తేజ లిరిక్స్ అందించిన ఈ పాటకు నవీన్ జై మ్యూజిక్ అందించాడు ,ప్రభ ,స్వామి పాడిన ఈ పాటకి రాజేష్ కొరియోగ్రఫీ చేశాడు .ఇక రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ఈ పాట 20 లక్షల వ్యూస్ ని కొల్లగొట్టింది .మొత్తానికి వరుస హిట్స్ తో దూసుకుపోతున్న వైష్ణవి సోనీ క రకంగా ఒక ఫోక్ ఇండస్ట్రీని షేక్ చేస్తుందని చెప్పాలి.

ఇంక వైష్ణవి సోని క్రేజ్ ఏ రేంజ్ లో ఉందంటే ఈమె ప్రధాన పాత్రలలో నటించిన రెండు పాటలు ఒకే రోజున విడుదల కావడం విశేషం .బంగారు గాజులు అంటూ కిట్టు పవన్ తో నటించిన ఒక పాట రిలీజ్ కాగా అదే రోజు హంస రాజా అంటూ ఇంద్రజిత్ తో కలిసి నటించిన పాట కూడా అదే రోజున రిలీజ్ కావడం విశేషం ..చూడాలి ముందు ముందు ఈ ముద్దుగుమ్మ ఇంకెన్ని ఫోక్ సాంగ్స్ తో అలరిస్తుందో !

Tags

Related News

బిగ్ బాస్ లో ఊహించని ఎలిమినేషన్.. పీఆర్ టీమ్ గట్టిగా కష్టపడ్డా నో యూజ్!

సీరియల్స్ చేయడం పై ఆమని కామెంట్స్… అన్ని ఇబ్బందులు ఉన్నాయా?

‘జిమ్ జిమ్ తారా’ ఆంటీ రేంజ్ మారిపోయిందిగా.. ఏకంగా ఆ షోలో ఛాన్స్!

హీరోగా అవతారం ఎత్తిన బిగ్ బాస్ కళ్యాణ్ పడాల.. డైరెక్టర్ ఎవరంటే?

శోకసంద్రంలో మునిగిపోయిన బిగ్ బాస్ ప్రియాంక సింగ్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి అండగా రామరాజు.. భద్రకు దిమ్మతిరిగే కౌంటర్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : మనీష కోసం టెన్షన్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. విక్కీకి షాక్..

Big Stories

Advertisement
×