E-Paper
Advertisement

గుండె నిండా గుడిగంటలు మనోజ్ నెల సంపాదన ఎంతో తెలుసా?

గుండె నిండా గుడిగంటలు మనోజ్ నెల సంపాదన ఎంతో తెలుసా?
Advertisement

Gundeninda Gudigantalu Manoj: స్టార్ మా లో ప్రసారమవుతూ ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న బుల్లితెర సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలు(Gundeninda Gudigantalu Serial) సీరియల్ ఒకటి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సీరియల్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ సీరియల్ కి బాలు పాత్ర ఎంత హైలెట్ అయ్యిందో మనోజ్ పాత్ర(Manoj Role)కు కూడా అంతే ప్రాధాన్యత ఉందని చెప్పాలి.

గుండె నిండా గుడిగంటలు సీరియల్ తో ఫేమ్..

ఈ సీరియల్ లో మనోజ్ పాత్రలో నటుడు యశ్వంత్ కనిగిరి(Yaswanth Kanigiri) నటిస్తున్నారు. యశ్వంత్ స్వస్థలం నెల్లూరు అని తెలుస్తుంది. ఈయన బుల్లితెర నటుడుగా పలు సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో మాత్రం మనోజ్ పాత్ర కాస్త తింగరి తనంతో, చేసే పొరపాట్లతో సీరియల్ కథను కీలక మలుపులు తిప్పుతుంది. తింగరితనంతో నటించే మనోజ్ పాత్రకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఈ సీరియల్లో మనోజ్ ను ఉద్దేశించి బాలు పెట్టే పేర్లు కూడా హైలెట్ గా నిలిచాయని చెప్పాలి. లక్షలు మింగినోడు, నగలు మింగినోడు, పార్కులో పల్లీలు తినేవాడు అంటూ బాలు పిలిచే పేర్లు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి.

రోజుకు పాతికవేల రెమ్యూనరేషన్..

Advertisement

ఇలా మనోజ్ పాత్రలో ప్రేక్షకులందరిని మెప్పిస్తున్న యశ్వంత్ ఈ సీరియల్ లో మాత్రమే కాకుండా ఇతర సీరియల్స్ లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన నేల సంపాదన ఎంత అనే విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. పలు సమాచారం ప్రకారం యశ్వంత్ ఒక రోజు సీరియల్ షూటింగ్లో పాల్గొంటే 20 నుంచి 25 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తుంది. ఇలా రోజుకు పాతికవేల రెమ్యూనరేషన్ అంటే నెలకు ఈయన సీరియల్స్ షూటింగ్లో పాల్గొనడం దాన్నిబట్టి నెలకు ఈయన 3నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తున్నారని చెప్పాలి.

లక్షల్లోనే ఆదాయం..

ఇలా సీరియల్స్ ద్వారా మాత్రమే ఈ స్థాయిలో సంపాదిస్తున్న యశ్వంత్ ప్రత్యేకంగా ఏదైనా కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా మరి కొంత ఆదాయం పొందుతున్నారని చెప్పాలి. ఇలా మొత్తం కలిపి ఈయన నెలకు 5 నుంచి 7 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. ఇలా యశ్వంత్ సంపాదన తెలిసిన అభిమానులు ఫన్నీగా సంపాదిస్తున్నారు. లక్షలు మింగినోడు లక్షలు మింగినా బాగానే సంపాదిస్తున్నారు అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇదివరకు యశ్వంత్ నేను శైలజ, బంగారు పంజరం, మనసిచ్చి చూడు, నిన్ను కోరి వంటి తదితర సీరియల్స్ లో నటించారు.

Advertisement

Also Read: సీరియల్స్ చేయడం పై ఆమని కామెంట్స్… అన్ని ఇబ్బందులు ఉన్నాయా?

Related News

వైష్ణవి సోనీ హవా మామూలుగా లేదుగా..ఈ సాంగ్స్‌తోనే సెన్సేషన్!

బిగ్ బాస్ లో ఊహించని ఎలిమినేషన్.. పీఆర్ టీమ్ గట్టిగా కష్టపడ్డా నో యూజ్!

సీరియల్స్ చేయడం పై ఆమని కామెంట్స్… అన్ని ఇబ్బందులు ఉన్నాయా?

‘జిమ్ జిమ్ తారా’ ఆంటీ రేంజ్ మారిపోయిందిగా.. ఏకంగా ఆ షోలో ఛాన్స్!

హీరోగా అవతారం ఎత్తిన బిగ్ బాస్ కళ్యాణ్ పడాల.. డైరెక్టర్ ఎవరంటే?

శోకసంద్రంలో మునిగిపోయిన బిగ్ బాస్ ప్రియాంక సింగ్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి అండగా రామరాజు.. భద్రకు దిమ్మతిరిగే కౌంటర్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×