Kissik Talks:ఈ వారం గెస్ట్ గా బిగ్ టీవీ నిర్వహిస్తున్న కిసిక్ టాక్స్ లో గెస్ట్ గా వచ్చిన రోహిత్ నాయుడు పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చాడు.ముఖ్యంగా బిగ్‌బాస్ టీమ్ నుంచి మళ్లీ హౌస్‌లోకి వెళ్లాలని ఆఫర్ వస్తే శాలినిని పంపిస్తారా? మీరే వెళ్తారా? అనే ప్రశ్నకి ఇలా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.అంతే కాకుండా బిగ్ బాస్ లో పార్టిసిపేషన్ పై తన ఒపినియన్ తో పాటు ,హౌస్ కి ఆటోలో వెళ్ళిన విషయాలని ఓపెన్ గా ఇలా పంచుకున్నాడు రోహిత్ .
మళ్లీ హౌస్‌లోకి వెళ్లాలని ఆఫర్ వస్తే
ముందుగా బిగ్‌బాస్ టీమ్ నుంచి మళ్లీ హౌస్‌లోకి వెళ్లాలని ఆఫర్ వస్తే శాలినిని పంపిస్తారా? మీరే వెళ్తారా? అనే ప్రశ్నకి సమాధానంగా ప్రస్తుతం హౌస్‌లో వాతావరణం పూర్తిగా టాక్సిక్‌గా మారిందని ,అందువల్ల తనే వెళ్తానని తేల్చి చెప్పాడు.
ఇక పర్సనల్ గా ట్రోల్ చేయడం,కించపరచడం పదేపదే ట్రిగర్ చేయడం, ఇతరుల మానసిక ప్రశాంతతను దెబ్బతీయడం, ఇష్టమొచ్చినట్టుగా పేర్లు పెట్టడం తనకు నచ్చవని మనసులోని మాటని బయటపెట్టాడు.అలాంటి వాతావరణంలోకి తన వాళ్లను పంపించడం ఇష్టం లేదని, తానే హౌస్‌లోకి వెళ్లి పోరాడి గెలిచి తిరిగి వస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు.
ఇక్కడ భవిష్యత్తులో తన పిల్లలు బిగ్‌బాస్‌లో తండ్రి ఆటను చూసినప్పుడు గర్వపడాలని కోరుకుంటున్నానని తెలిపాడు. తన తండ్రి హౌస్‌లో ధైర్యంగా ఆడాడు, తప్పును ప్రశ్నించాడు అని పిల్లలు అనుకోవాలి కానీ.. ఇతరులను వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడిన వ్యక్తి అని భావించకూడదని అన్నాడు.ఒక కంటెస్టెంట్‌గా తన ఆటకు ఒక హద్దు ఉండాలని, తన ప్రవర్తన చూసి కుటుంబ సభ్యులు సిగ్గుపడే పరిస్థితి రాకూడదని చెప్పుకొచ్చాడు.
బయటకు వచ్చిన తర్వాత
ఇక బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు చాలా ప్రాజెక్టులు, ఆఫర్లు వస్తున్నాయని జరుగుతున్న ప్రచారంపై రోహిత్ ఇలా రియాక్ట్ అయ్యాడు. ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ తనకు పూర్తిగా కొత్త అని, కెమెరాల ముందు ఫొటోలు దిగడానికి కూడా మొదట్లో ఇబ్బందిగా అనిపించేదని చెప్పాడు. ఒక్కసారిగా తన ముందు కెమెరాలు పెట్టి మాట్లాడమంటే కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానని, దాని నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపాడు.
ఇక హౌస్‌లోక ఆటోలో వెళ్లిన విషయం గురించి చెబుతూ తాను కావాలనే సామాన్యుడిలా కనిపించేందుకు అలా చేయలేదని, ఉదయం క్యాబ్ బుక్ కాకపోవడంతో టీమ్ మెంబర్స్ ఆటోలో వెళ్లిపోదామని చెప్పారని, అందుకే ఆటోలో వెళ్లినట్లు క్లారిటీ ఇచ్చాడు.ఇక తనకు సొంతంగా కారు లేదని కూడా రోహిత్ చెప్పడం ఇక్కడ గమనార్హం.
ఆడియన్స్ మూడ్ తగ్గట్టుగా టెలీకాస్ట్
ఇకపొతే బిగ్‌బాస్‌లో చూపించే లైవ్ ఫీడ్, టీవీలో ప్రసారమయ్యే ఎపిసోడ్స్ మధ్య చాలా తేడా ఉంటుందని లైవ్ ఫీడ్ కూడా ఎడిట్ చేసి చూపిస్తారని, ఎపిసోడ్ అయితే పూర్తిగా ఎడిటింగ్‌పై ఆధారపడి ఉంటుందని అసలు విషయం బయటపెట్టాడు.ఎలాంటి సీన్స్ ఉండాలి ఎక్కడ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేయాలి, ఆడియన్స్ మూడ్ తగ్గట్టుగా ఎపిసోడ్ ని ఎలా టెలీకాస్ట్ చేయాలి అనే విషయాలన్నీ ఎడిటర్స్ చేతుల్లో ఉంటుందని అన్నాడు.
ALSO READ:శాలినితో రిలేషన్‌పై రోహిత్ ఓపెన్ కామెంట్స్.. సింగిల్ కాదంటూ హింట్!
ఇక తనకు సంబంధించిన పంచాయతీలనే పదేపదే చూపించడం వల్ల ఆడియన్స్ లో తనపై అభిప్రాయం మారే అవకాశం ఉందని ,రోజూ తనను శాలిని పక్కన కూర్చున్నట్లు, గొడవల్లో ఉన్నట్లు మాత్రమే చూపిస్తే.. అతను అసలు గేమ్ ఆడటం లేదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఏర్పడుతుందని వివరించాడు. తన గ్రాఫ్‌ను తగ్గించే విధంగా కంటెంట్‌ను ఎడిట్ చేసి ఉండొచ్చని తనకు అనిపించిందని, అయితే అది నిజమో కాదో తాను చెప్పలేనని స్పష్టం చేశాడు రోహిత్ !