E-Paper
Advertisement

బిగ్ బాస్ 10 విన్నర్ త్రిగుణ్…ఫుల్ సపోర్ట్ చేస్తున్న టాలీవుడ్ హీరో?

బిగ్ బాస్ 10 విన్నర్ త్రిగుణ్…ఫుల్ సపోర్ట్ చేస్తున్న టాలీవుడ్ హీరో?
Advertisement

Bigg Boss 10 Winner: తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 కార్యక్రమం 12 వారాలు పూర్తి చేసుకొని మరొక మూడు వారాలలో గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. ఇలా ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే మూడు వారాలే ఉన్న నేపథ్యంలో విన్నర్ ఎవరు అనే విషయంపై ఎంతో ఉత్కంఠత నెలకొంది. రోహిత్, త్రిగుణ్ మధ్య విన్నర్ రేస్ ఉండేదని అందరూ భావించారు కానీ రోహిత్ బయటకు వెళ్లిపోవడంతో ముఖేష్,త్రిగుణ్ మధ్య పోటీ నెలకొంది అయితే ఎక్కువ శాతం త్రిగుణ్ విన్నర్ అంటూ ఫిక్స్ అయ్యారు. ఇకపోతే తాజాగా ఒక టాలీవుడ్ హీరో సైతం త్రిగుణ్ విన్నర్(Trigun Winner) అవ్వాలని కోరుకుంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు.

త్రిగుణ్ కి మద్దతుగా కిరణ్ అబ్బవరం..

ఇక త్రిగుణ్ విన్నర్ అవడం కోసం మద్దతు తెలుపుతున్న హీరో ఎవరు అనే విషయానికి వస్తే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్న నోటిఫికేషన్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సక్సెస్ అందుకుంటున్న కిరణ్ అబ్బవరం త్వరలోనే రియాలిటీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలోనే మరో కొత్త సినిమాని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా కిరణ్ అబ్బవరం గోవాలో జరుగుతున్న 57వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ లో చెన్నై లవ్ స్టోరీ..

Advertisement

ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా కిరణ్ అభవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story)సినిమా ప్రదర్శించారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్ అబ్బవరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అయితే ఈ సినిమాలో త్రిగుణ్ కూడా సెకండ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఇలా ఈ సినిమా సక్సెస్ అయిన అనంతరం త్రిగుణ్ బిగ్ బాస్ 10 (Bigg Boss 10)కార్యక్రమంలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు.

త్రిగుణ్ విన్నర్ అవ్వాలి..

ఈ నేపథ్యంలోనే త్రిగుణ్ బిగ్ బాస్ 10 లో పాల్గొనడంతో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ చాలా అద్భుతంగా ఆడుతున్నారు. ఖచ్చితంగా విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ త్రిగుణ్ కి పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేశారు. ఇప్పటికే త్రిగుణ్ విన్నర్ అవుతారని అందరూ భావిస్తున్నారు ఈ సమయంలో కిరణ్ అబ్బవరం కూడా విన్నర్ కావాలని కోరుకుంటున్నట్లు తెలియజేయడంతో త్రిగుణ్ కి మరింత మద్దతు లభించిందని చెప్పాలి. కిరణ్ అబ్బవరం నటిస్తున్న రియాలిటీ సినిమా డిసెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు విపరీతమైన ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఇక ఇటీవల రికార్డ్ అనే సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నట్టు కిరణ్ తెలిపారు.

Advertisement

Also Read: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. పెద్ద స్కెచ్ వేశారుగా?

Related News

అసలు ఈ పాటలో ఏముందిరా మావా.. ఇంతలా వైరల్ అవుతోంది!

గాజులు గలగలతో వచ్చిన క్రేజ్.. అయ్యప్ప పాటతో మొత్తం రివర్స్!

శోభితను ఎప్పుడైనా అలా పిలిచావా.. నాగార్జున ప్రశ్నకు షాక్ అయిన చైతు!

త్రిగుణ్ తో నాకు పోటీ ఏంటి?: ముఖేష్

బిగ్ బాస్ నుండి టెంపర్ వంశీ ఎలిమినేటెడ్!

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య.. బాలు మీనా కలిసిపోయారు.. రవి, శృతి గొడవ.. ప్రభాకు షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి స్ట్రాంగ్ కౌంటర్.. అడ్డంగా దొరికిన కమల్.. రమ్య ఎంట్రీతో ట్విస్ట్..

Big Stories

Advertisement
×