Tella Cheera Tella Raika Song:తెలంగాణా కల్చర్ ,ఇక్కడి పల్లెటూరి వాతావరణం, ఇందులోని మట్టి వాసన కలగలసిన జానపదాలు ఇపుడు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి.ఎంతలా అంటే వచ్చిన ప్రతీ పాట మినిమం మిలియన్ వ్యూస్ కొల్లగొట్టెంతగా.ఇదిగో అ అక్రమంలోనే ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ”తెల్ల చీర తెల్ల రైక” అనే సరికొత్త జానపదం.ఈ ఏడు జులైలో వచ్చిన ఈ పాట ఇప్పటికి ఏకంగా 29 మిలియన్ల వ్యూస్ ని దక్కించుకున్నది అంటే ఈ పాట ఆడియన్స్ కి ఎంతలా కనెక్ట్ అయిందో అర్థం అవుతుంది.
ఆన్ స్క్రీన్ మీద వీరి కెమిస్ట్రీ అదుర్స్
పాట విషయానికి వస్తే అక్కిచెర్రి తో కలిసి స్టెప్పులు వేసిన ప్రియా హాసిని గౌడ్ పాటకి మరో రేంజ్ కి తీసికెళ్ళారు.ముఖ్యంగా ఆన్ స్క్రీన్ మీద వీరి కెమిస్ట్రీ అదుర్స్ అని చెప్పాలి.ఇక పాటలో పల్లెటూరి పదాలని అందంగా పొందికగా పేర్చిన కొంగరి కృష్ణతో పాటు పాటకి తన గొంతుతో ప్రాణం పోసిన మల్లమ్మని మెచ్చుకోకుండా ఉండలేము.పైగా ఈ పాటకి ట్యూన్ కూడా తనే ఇవ్వడం విశేషం.
ఇక ఈ మధ్య సూపర్ హిట్ అవుతున్న ప్రతీ ఫోక్ సాంగ్ కి స్టెప్పులు డిజైన్ చేస్తున్న శేఖర్ మాస్టారే ఈ పాటకి కొరియోగ్రఫీ చేయగా కమ్లీ పటేల్ మరోసారి తన అద్భుతమైన విజువల్స్ తో పాటని నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళాడు.ముఖ్యంగా పాటలో అణువణువున పల్లె టూరి వాసన గుభాలించింది అంటే కమ్లీ పటేల్ గొప్పదనమే.
ఫోక్ ఇండస్ట్రీలో పాతుకుపోయిన కళ్యాణ్ కీస్
అన్నింటికన్నా మించి ఫోక్ ఇండస్ట్రీలో పాతుకుపోయిన కళ్యాణ్ కీసే ఈ పాటకి సంగీతం అందించడంతో పాట ఆడియన్స్ కి ఈజీగా కనెక్ట్ అయిపొయింది.ఒకరకంగా ఈ మ్యూజిక్ డైరెక్టరే ఇపుడు ఇండస్ట్రీని వరుస హిట్స్ తో ఏలుతున్నాడని చెప్పాలి.ఇక పాటకి కావాల్సిన ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ సరిగ్గా అమర్చడం లో నిర్మాత వాలి సక్సెస్ అయ్యాడనడంలో సందేహం లేదు.
ఇక అక్కిచెర్రి, ప్రియా హాసిని గౌడ్ కాంబినేషన్ విషయానికి వస్తే..వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకే ముద్దులొలికే నా ముద్దుల గుమ్మ అనే పాట వచ్చి పాట సూపర్ హిట్ అయింది కూడా.హేమలత గౌడ లిరిక్స్ అందించిన ఆ పాటకి వెంకట్ అజ్మీరా సంగీతం అందించగా బొడ్డు దిలీప్ , బట్టు శైలజలు తమ సింగింగ్ తో అదరగొట్టేశారు.
దాదాపు 16 లక్షల వ్యూస్
సురేష్ సూర్య విజువల్స్ , ప్రశాంత్ APS కొరియోగ్రఫీ ఇలా అన్ని సరిగ్గా సరిపోవడంతో ఇప్పటికి ఈ పాట దాదాపు 16 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకుంది. చూడాలి మరి ఈ కాంబినేషన్ లో ముందు ముందు వచ్చే ఫోక్ సాంగ్స్ ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తాయో !