Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం సెలబ్రిటీలు పాల్గొంటూ వారికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇలా సెలబ్రిటీ టాక్ షోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ కార్యక్రమంలో నేడు మోస్ట్ అవైటెడ్ పర్సన్ బిగ్ బాస్ రోహిత్ నాయుడు (Rohit Naidu)హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రసారమైంది ఇందులో భాగంగా రోహిత్ బిగ్ బాస్ జర్నీ గురించి ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను బయటపెట్టారు.
ముఖ్యంగా రోహిత్ తన ఎలిమినేషన్ గురించి అలాగే త్రిగుణ్ (Trigun)గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వర్ష మాట్లాడుతూ త్రిగున్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అంటూ ప్రశ్న వేయడంతో రోహిత్ నాయుడు మాట్లాడుతూ తన గురించి నాకు ఎలాంటి ఒపీనియన్స్ లేవు. హి ఈస్ ఏ జస్ట్ కంటెస్టెంట్. అలాగే ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఒక కాంపిటేటర్ అంతే అతని గురించి పెద్దగా నాకు ఎలాంటి ఒపీనియన్స్ లేవని రోహిత్ తెలిపారు. బిగ్ బాస్ హౌస్లో ఎవరైతే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటారో వారిని బయటికి పంపిస్తున్నారని చెబుతున్నారు. మీకు అలా అనిపించలేదా త్రిగుణ్ మీద అనే ప్రశ్న కూడా వేశారు.
ఈ ప్రశ్నకు రోహిత్ సమాధానం చెబుతూ..త్రిగుణ్ మీద ఏం కాదండి.. ఇది కేవలం షో మేకర్స్, అక్కడ ఉన్న టీం అని రోహిత్ తెలిపారు.ఇక తనని గెలిపించడం కోసమే మిమ్మల్ని బయటకు పంపించారా ఈ మాటకు మీరేం చెబుతారు అంటే… తనని గెలిపించడం కోసమే నన్ను బయటికి పంపించారనే విషయంపై నేను క్లారిటీ చెప్పలేను ఎందుకంటే ఇది బిగ్ బాస్ టీమ్ డెసిషన్.. ఒకవేళ తనని గెలిపించడం కోసం బయటకు పంపించారు అనేది తెలియాలి అంటే బయట నుంచి నేను ఆట చూడాలి అది నేను చేయలేదు కాబట్టి చూసినవారే జడ్జ్ చేస్తారు.
ఇక హౌస్లో ఉండి నేను చూసింది, నాకు అనిపించింది ఏమంటే త్రిగుణ్ ను గెలిపించటం కోసమే నన్ను పంపించారని భావిస్తున్నాను. నేను గెలుస్తాననే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని వాళ్ళు భావించారేమో అందుకే నన్ను పంపించారని నేను అనుకుంటున్నానని రోహిత్ తెలిపారు. రియాలిటీ షోలో బిగ్ బాస్ పర్సనాలిటీ షో .. వీక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళందరూ ఇప్పటికే హౌస్ లోనే ఉండి స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్నవాళ్లు బయట ఉన్నారు అంటూ రోహిత్ తన ఎలిమినేషన్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే త్రిగుణ్ ను హైలెట్ చేయడం కోసమే , తనని గెలిపించడం కోసమే నన్ను బయటకు పంపించారంటూ ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయి.
Also Read: మెగా ఇంటికి ‘ఆకాశంలో ఒక తార’ టీం.. చిరు చరణ్ ప్రత్యేక అభినందనలు..