Bigg Boss 10 Telugu Elimination:బిగ్ బాస్ 10 తెలుగు 12 వ వారం పూర్తి అయింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే హౌస్ నుంచి టెంపర్ వంశి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరొక కంటెస్టెంట్ కూడా నేడు ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్లలో వంశీతోపాటు వర్షిని కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వర్షిని కూడా ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ ఫినాలేకి కేవలం మూడు వారాలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే డబుల్ ఎలిమినేషన్ చేసినట్టు తెలుస్తోంది.
వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా మొదటి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఓటింగ్‌లో అందరికంటే లీస్ట్ పొజిషన్లో ఉన్న టెంపర్ వంశీ(temper vamsi ) మొదట హౌస్ నుంచి బయటకు వచ్చారు. అయితే ఈయన హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంతో పెద్దగా ఎమోషనల్ అవ్వలేదు. 12 వారాలు పాటు హౌస్ లో కొనసాగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. తన కూతుర్ని కలిసినట్టు కల వచ్చిందని, ఆకల నిజమవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఇక తన బిగ్ బాస్ జర్నీ చూసి సంతోషించిన వంశీ ఎలాగైనా కప్పు గెలవాలి అంటూ త్రిగుణ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఇకపోతే హౌస్ లో 12 వారాలు పాటు కొనసాగిన వంశీ వారానికి రెండు లక్షల రూపాయలు చొప్పున మొత్తం 24 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి వంశీ బయటకు వచ్చిన తరువాత కూడా మరొక ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించినట్టు ప్రోమో వీడియోలు చూస్తేనే తెలుస్తుంది. ఇక నేడు ఎపిసోడ్ లో భాగంగా లీస్ట్ పొజిషన్ ఉన్న రామకృష్ణ, వర్షిని మధ్య ఈ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిందని సమాచారం. ప్రకారం వర్షిని (varshini)హౌస్ నుంచి బయటకు వచ్చారని తెలుస్తోంది.
ఇలా 12వ వారం ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ చేస్తూ బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇక వర్షిని 12 వారాలకు గాను భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈమె వారానికి మూడు లక్షల రూపాయలు చొప్పున రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం. ఇలా 12 వారాలకి కలిపి సుమారు 36 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు తెలుస్తుంది. మరి వర్షిని ఎలిమినేషన్ విషయంలో స్పష్టత రావాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం కావాల్సి ఉంది. ఇక హౌస్‌లో కేవలం ఇద్దరు లేడీ కట్టిస్టెంట్ లు ఉండగా వర్షిని టాప్ ఫైవ్ లో ఉంటుందని అందరు భావించారు కానీ ఈమె కూడా ఈ వారం ఎలిమినేట్ కావడంతో కేవలం దెబ్జానీ మాత్రమే లేడీ కంటెంట్ గా హౌస్ లో కొనసాగుతున్నారు.
Also Read: క్లిన్ కారా చదువుతున్నది సమంత స్కూల్లోనేనా.. ఉపాసన పోస్టు వైరల్!