E-Paper
Advertisement

బిగ్ బాస్ హౌస్ లో నాకు న్యాయం జరగలేదు.. అందుకే అలా చేయాల్సి వచ్చింది: రోహిత్

బిగ్ బాస్ హౌస్ లో నాకు న్యాయం జరగలేదు.. అందుకే అలా చేయాల్సి వచ్చింది: రోహిత్
Advertisement

Big Tv Kissik Talks: బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. తాజాగా ఈ కార్యక్రమం తెలుగులో పదవి సీజన్ ప్రసారమవుతున్న సంగతి  తెలిసిందే. ఈ కార్యక్రమంలో సామాన్యుడిగా అడుగుపెట్టిన రోహిత్ (Rohit)ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈయనే విజేతగా నిలుస్తారని అందరూ భావించారు కానీ ఊహించని విధంగా రోహిత్ ఎనిమిదవ వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇలా రోహిత్ ఎలిమినేట్ అయిన తర్వాత వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటు సందడి చేస్తున్నారు.

గల్లీలో పోట్లాడినట్లు పోట్లాడటం…

ఈ నేపథ్యంలోనే రోహిత నాయుడు కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ హౌస్లో ఆయన వ్యవహరించిన తీరుకు సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.బిగ్ బాస్ హౌస్లో ఏదైనా ఒక చిన్నమాట మాట్లాడాలి అంటే కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు షో చూస్తుంటారు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు. ఈ సీజన్లో మాత్రం పని దొంగ అంటూ పాటలు పాడటం..  గల్లీలో పోట్లాడినట్లు పోట్లాడటం, త్రిగుణ్ మిమ్మల్ని కావాలని ట్రిగ్గర్ చేయడం, మీరు కూడా అలాగే మాట్లాడటం చేశారు. ఇదంతా వాంటెడ్ గానే జరిగిందా లేదంటే ఫ్లోలో వచ్చాయా అంటూ ప్రశ్న ఎదురైంది.

శనివారం న్యాయం జరుగుతుందని ఎదురు చూశాను..

Advertisement

ఈ ప్రశ్నకు రోహిత్ సమాధానం చెబుతూ ఫస్ట్ 3 వారాల పాటు నేను చాలా సైలెంట్ గానే ఉన్నాను హౌస్ లో ఉన్న పరిస్థితులన్నింటినీ గమనించాను. ప్రతి శనివారం నేను ఒకటి గమనించాను ఏదైనా తప్పు చేస్తే నాగార్జున గారు వచ్చి సరిదిద్దుతారని, అక్కడి నుంచి ఏదైనా మారుతుందేమోనని చూశాను కానీ ఏం మారలేదు. ఈ శనివారం నాకు న్యాయం జరుగుతుందని ఎదురు చూశాను కానీ నాకు మాత్రం హౌస్ లో ఎలాంటి న్యాయం జరగలేదని రోహిత్ తెలిపారు. ఇలా నాగార్జున గారు నాకు న్యాయం చేస్తారని ఎదురు చూశాను కానీ నా ఓపిక నశించింది అందుకే తిరిగి నేను కూడా మాట్లాడాల్సి వచ్చిందని రోహిత్ తెలిపారు.

Advertisement

బిగ్ బాస్ హౌస్ లో నాకు న్యాయం జరగకపోవడంతో చాలా బాధపడ్డాను, లో ఫీలయ్యాను. అందుకే నేను కూడా ఎవరైతే నన్ను ఎదిరిస్తున్నారో వారిని ఎదిరించడం మొదలుపెట్టానని రోహిత్ తెలిపారు. మళ్లీ హౌస్ లోకి వెళితే మీరు ఎవరిని కాంపిటీషన్ గా తీసుకుంటారని ప్రశ్నించగా అక్కడున్న వారందరూ కూడా నాకు కాంపిటీషన్ అని తెలిపారు. నాకు ఎవరు ఎదురు వచ్చినా నేను వారిని వెనక్కి నెట్టి టాప్ వన్  లోకి వెళ్లాలని భావిస్తాను అంటూ రోహిత్ సమాధానం చెప్పారు. ఇలా రోహిత్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే నాగార్జున కూడా రోహిత్ ను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేశారని ఇదంతా త్రిగుణ్ ను హైలెట్ చేయడం కోసమేనని స్పష్టమవుతుంది.

Also Read: త్రిగుణ్ ను గెలిపించడం కోసమే నన్ను పంపించారు.. రోహిత్ సెన్సేషనల్ కామెంట్!

Related News

త్రిగుణ్ ను గెలిపించడం కోసమే నన్ను పంపించారు.. రోహిత్ సెన్సేషనల్ కామెంట్!

శాలినితో రిలేషన్‌పై రోహిత్ ఓపెన్ కామెంట్స్.. సింగిల్ కాదంటూ హింట్!

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి.. టెంపర్ వంశీకి చుక్కలు చూపించిన శివాజీ!

బిగ్ బాస్ డబుల్ ట్విస్ట్.. వంశీతో పాటు మరో కంటెస్టెంట్ ఎలిమినేషన్?

బిగ్ బాస్ 10 విన్నర్ త్రిగుణ్…ఫుల్ సపోర్ట్ చేస్తున్న టాలీవుడ్ హీరో?

అసలు ఈ పాటలో ఏముందిరా మావా.. ఇంతలా వైరల్ అవుతోంది!

గాజులు గలగలతో వచ్చిన క్రేజ్.. అయ్యప్ప పాటతో మొత్తం రివర్స్!

Big Stories

Advertisement
×